ETV Bharat / business

UPI Payments Without Active Internet : జస్ట్ ఓ కాల్​తో..​ ఇంటర్నెట్​ లేకున్నా సులువుగా యూపీఐ పేమెంట్స్! - upi payment options

UPI Payments Without Active Internet In Telugu : యూపీఐ పేమెంట్స్​ను మరింత సులువుగా చేసేందుకు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్.. మూడు డిజిటల్​ పేమెంట్​ ఫెసిలిటీస్​ను అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా ఇంటర్నెట్​ లేకున్నా.. ఆర్థిక లావాదేవీలు జరపవచ్చు. వాటి పూర్తి వివరాలు మీ కోసం..

UPI Payments latest methods
UPI Payments Without Active Internet
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 11:55 AM IST

UPI Payments Without Active Internet : నేటి డిజిటల్ యుగంలో ప్రతి పనీ చాలా సులువుగా జరిగిపోతోంది. ముఖ్యంగా నూతన సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక లావాదేవీలు చాలా సులువుగా, తొందరగా జరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు పంపించాలంటే.. నేరుగా బ్యాంకులకు వెళ్లి, ఫారాలు నింపి, క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ మొబైల్స్, ఇంటర్నెట్​ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఉన్నచోటు నుంచే మనీ ట్రాన్సాక్షన్స్​ చేయగలుగుతున్నారు.

ఇంటర్నెట్​ లేకున్నా మనీ ట్రాన్స్​ఫర్​
UPI Payments Without Active Internet : సాంకేతికత మహిమ వల్ల నేడు ఇంటర్నెట్​ లేకున్నా చాలా సులువుగా పేమెంట్స్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. మరీ మఖ్యంగా బేసిక్ ఫోన్​తో యూపీఐ పేమెంట్స్ చేసుకునే ఫెసిలిటీ వచ్చింది.

హెచ్​డీఎఫ్​సీ యూపీఐ పేమెంట్స్!
HDFC Bank UPI Payment Digital Products : భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్​.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఇటీవల మూడు డిజిటల్ పేమెంట్​ ప్రొడక్టులను అందుబాటులోకి తెచ్చింది. అవి:

  1. UPI 123Pay
  2. UPI plug-in service
  3. Autopay

ఈ మూడు డిజిటల్ పేమెంట్​ ప్రొడక్టుల ద్వారా ఇంటర్నెట్ లేకున్నా.. పేమెంట్స్ చేయవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

1. UPI 123Pay : స్మార్ట్​ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యంలేని వ్యక్తులు ఈ యూపీఐ 123పే ద్వారా ఆర్థిక లావాదేవీలు (మనీ ట్రాన్స్​ఫర్​) చేసుకోవచ్చు. ఇంటరాక్టివ్​ వాయిస్​ రెస్పాన్స్​ (IVR) ద్వారా కస్టమర్లు ఆర్థిక లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇందుకోసం కస్టమర్లు ముందుగా యూపీఐ నంబర్​ 080 4516 3571కు కాల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం ద్వారా కసమర్లు ఒకసారికి కేవలం రూ.5000 మాత్రమే ట్రాన్స్​ఫర్ చేయగలరు. మొత్తంగా చూసుకుంటే.. ఒక రోజులో రూ.1,00,000 లిమిట్​ వరకు యూపీఐ పేమెంట్స్​ చేయవచ్చు.

2. UPI plug in Service : సాధారణంగా ఆన్​లైన్​లో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు.. పేమెంట్స్ చేయడం కోసం ఇతర యాప్​లకు డైవర్ట్ అవుతాం. కానీ యూపీఐ ప్లగ్​-ఇన్​ సర్వీస్ ద్వారా ఇతర యాప్​ల్లోకి వెళ్లకుండానే.. నేరుగా పేమెంట్స్ చేయవచ్చు.

3. Autopay on QR code : ఆటోమేటిక్​గా చెల్లింపులు చేయడానికి వీలుగా హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ 'ఆటోపే' ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా స్ట్రీమింగ్ సర్వీస్​, సబ్​స్క్రిప్షన్స్​లను మరలా రెన్యూవల్ చేసుకునేటప్పుడు ఇది ఉపయోగపడతుంది. ఇందు కోసం యూపీఐ క్యూఆర్​ కోడ్​ను స్కాన్ చేసి.. ఆటోమేటిక్ పేమెంట్స్​ను ముందుగానే సెట్​చేసుకోవాలి. దీని వల్ల ప్రతిసారీ మాన్యువల్​గా ఆర్థికలావాదేవీలు చేయాల్సిన అవసరం తప్పుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.