ETV Bharat / business

2024లో లాంఛ్ కానున్న టాప్-3 SUV కార్స్ ఇవే! ధర ఎంతంటే? - best upcoming 5 seater cars 2024

Upcoming SUV Cars Under 15 Lakh In Telugu : మీరు కొత్త ఎస్​యూవీ కారు కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.15 లక్షలు మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. త్వరలో టాటా, మహీంద్రా, హ్యుందాయ్​ కంపెనీలు తమ లేటెస్ట్ ఎస్​యూవీ కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం.

best SUV Cars Under 15 Lakh
Upcoming SUV Cars Under 15 Lakh
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 3:42 PM IST

Upcoming SUV Cars Under 15 Lakh : నేడు మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎస్‌యూవీ కార్లకు విపరీతంగా డిమాండ్‌ పెరుగుతోంది. అందుకే కార్ల తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా సరికొత్త ఎస్​యూవీలను రూపొందించి మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ అనేది చాలా కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు అన్నీ తక్కువ బడ్జెట్లోనే మంచి ఫీచర్స్​, స్పెసిఫికేషన్లతో స్టైలిష్ కార్లను రూపొందించే పనిలో ఉన్నాయి. వాటిలో రూ.15 లక్షల బడ్జెట్లోని టాప్​-3 అప్​కమింగ్ ఎస్​యూవీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Mahindra Thar Features :
మన దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కారు మహీంద్రా థార్. అందుకే మహీంద్రా కంపెనీ వచ్చే ఏడాది 5 డోర్లతో సరికొత్త థార్​ ఎస్​యూవీ కారును లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ థార్‌ 5-డోర్‌.. స్కార్పియో ఎన్‌ మోడల్‌కు దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే దీని డిజైన్‌ సరికొత్తగా ఉండనుంది. ఈ మహీంద్రా థార్​ SUV కారులో.. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, LED హెడ్‌ల్యాంప్‌, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లాంటి అధునాతన ఫీచర్లు పొందుపరిచినట్లు తెలుస్తోంది.

Mahindra Thar Price : వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఈ మహీంద్రా థార్‌ ధర దాదాపు రూ.15 లక్షలు ఉంటుందని అంచనా.

Mahindra Thar
మహీంద్రా థార్​
Mahindra Thar
మహీంద్రా థార్​
Mahindra Thar
మహీంద్రా థార్​
Mahindra Thar
మహీంద్రా థార్​
Mahindra Thar
మహీంద్రా థార్​

Hyundai Creta Features :
మన దేశీయ మార్కెట్‌లో చాలా మంది వినియోగదారులను ఆకర్షిస్తున్న మోడల్స్​లో హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ఒకటి. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే దీనిని మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2020లో ప్రారంభించిన ఈ మోడల్​ను.. మరికొన్ని అప్‌డేట్‌లతో వచ్చే ఏడాది మార్కెట్లోకి తెస్తున్నారు. ADAS, 360 డిగ్రీ పార్కింగ్‌ కెమెరా లాంటి కొత్త ఫీచర్లను దీనిలో పొందుపరిచినట్లు సమాచారం.

Hyundai Creta Price : ఈ హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ధర రూ.15 లక్షలకు అటుఇటుగా ఉండవచ్చు.

Hyundai Creta
హ్యుందాయ్ క్రెటా
Hyundai Creta
హ్యుందాయ్ క్రెటా
Hyundai Creta
హ్యుందాయ్ క్రెటా
Hyundai Creta
హ్యుందాయ్ క్రెటా
Hyundai Creta
హ్యుందాయ్ క్రెటా

Tata Curvv Features :
టాటా కర్వ్‌ వచ్చే ఏడాది మన మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ ఎస్‌యూవీ కారు ఎలక్ట్రిక్​, ఐసీఈ వేరియంట్లలో తీసుకురానున్నారు. 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ టాటా కర్వ్‌ డిజైన్​.. నెక్సాన్‌ కారు డిజైన్‌లా కనిపిస్తోంది. ఈ ఎస్​యూవీ ఎలక్ట్రిక్​ కారు 400 కిలోమీటర్ల రేంజ్‌తో వస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఎస్​యూవీ కారులో 1.5 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ అమర్చుతున్నారు. ఇది 170 bhp పవర్​, 280 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. అంతేకాదు 1.5 లీటర్‌ టర్బో డీజిల్‌ ఇంజన్‌ వేరియంట్​ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

Tata Curvv Price : ఈ టాటా కర్వ్ ఎస్​యూవీ ధర రూ.15 లక్షల బడ్జెట్లోపు ఉంటుందని సమాచారం.

Tata Curvv
టాటా కర్వ్​
Tata Curvv
టాటా కర్వ్​
Tata Curvv
టాటా కర్వ్​
Tata Curvv
టాటా కర్వ్​
Tata Curvv
టాటా కర్వ్​

2024లో లాంఛ్​ కానున్న టాప్​-6 ఫ్యామిలీ కార్స్ ఇవే! ధర ఎంతంటే?

రూ.5,999కే ఇండిగో ఎయిర్​లైన్స్​ హాలీడే ప్యాకేజ్​ - ఫారిన్ టూర్స్​కు కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.