Upcoming Cars In India 2024 : భారత్‌లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా బాగా అభివృద్ధి చెందుతోంది. పెరుగుతున్న డిమాండ్‌కు, వినియోగదారుల అభిరుచులకు అనుగణంగా సరికొత్త కార్లను రూపొందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా అందుబాటు ధరల్లోనే.. మంచి ఫీచర్లతో, స్టైలిష్ డిజైన్లతో తమ కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ పోటీలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, టయోటా, కియా, మహేంద్ర లాంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.
అప్‌కమింగ్ కార్స్ : 2024లో మారుతి సుజుకి కంపెనీ స్విఫ్ట్, డిజైర్ కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా కంపెనీ పంచ్ ఎలక్ట్రిక్ కారును, టయోటా - టైసర్, కియా - సోనెట్, మహీంద్రా - XUV300 కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. అందుకే వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
Mahindra XUV300 Features : మహీంద్రా కంపెనీ 2024 ప్రారంభంలోనే తన లేటెస్ట్ XUV300 కారును లాంఛ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఇప్పటికే అగ్రెసివ్‌గా రోడ్ టెస్ట్‌లు చేస్తోంది.
మహీంద్రా కంపెనీ ఈ నయా కారు డిజైన్‌లో, ఫీచర్లలో పలుమార్పులు చేసింది. ముఖ్యంగా కారులో పనోరమిక్ సన్‌రూఫ్‌ను ఏర్పాటుచేసింది. అంతేకాకుండా 6-స్పీడ్ టార్క్ - కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, రీడిజైన్డ్ డ్యాష్‌బోర్డ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేలను కూడా ఈ కారులో అమర్చింది. XUV700 డిజైన్ ప్రేరణతో ఈ XUV300 కారును స్పోర్టియర్ డిజైన్‌తో రూపొందించింది.
Mahindra XUV300 Price : ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ300 కారు ధర రూ.8 లక్షలు ఉండవచ్చు అని అంచనా.
Maruti Suzuki Swift and Dzire : మారుతి సుజుకి కంపెనీ 2024లో స్విఫ్ట్, డిజైర్ కార్లను లాంఛ్ చేయనుంది. వీటిలో స్ట్రాంగ్ హైబ్రీడ్ టెక్నాలజీతో.. 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ కార్లు ఏకంగా 35 kmpl మైలేజ్ ఇస్తాయని తెలుస్తోంది. ఈ హ్యాచ్‌బ్యాక్-సెడాన్ కార్ల లోయర్ వేరియంట్లు 1.2 లీటర్ డ్యూయెల్జెట్ పెట్రోల్, సీఎన్జీ పవర్ట్రైన్ ఆప్షన్లతో రానున్నాయి.
Maruti Suzuki Swift Price : మారుతి సుజుకి స్విఫ్ట్ కార్ ధర రూ.6 లక్షల వరకు ఉండవచ్చు.
Maruti Suzuki Dzire Price : మారుతి సుజుకి డిజైర్ కార్ ధర రూ.6.5 లక్షల వరకు ఉండవచ్చు.
Kia Sonet Facelift Features : ఈ కియా సోనెట్ కారు 2024లోనే లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీ అమర్చారని సమాచారం. అంతేకాదు కారులోపల న్యూ డ్యాష్‌బోర్డ్, డ్యూయెల్-స్క్రీన్ సెటప్, 360-డిగ్రీ కెమెరాలను కూడా పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ కియా సోనెట్ కార్‌ను 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో తీసుకురానున్నారు.


Kia Sonet Price : కియా సోనెట్ ధర రూ.7.8 లక్షల వరకు ఉంటుందని నిపుణుల అంచనా.

Toyota Taisor Features : టయోటా 2022లో అర్బన్ క్రూయిజర్‌ను నిలిపివేసింది. దాని స్థానంలో ఇప్పుడు టైసర్ కారును తీసుకురానుంది. వాస్తవానికి ఈ కారు.. మారుతి సుజుకి ఫ్రాంక్స్‌కు చెందిన రీ-బ్యాడ్జెడ్ వెర్షన్. టయోటా సిగ్నేచర్ గ్రిల్, ట్వీక్డ్ బంపర్లు, ప్రత్యేకమైన వీల్స్‌తో ఇది చూడడానికి సూపర్ స్టైలిష్ లుక్‌లో ఉంటుంది.
టయోటా ఈ టైసర్ కారు ఇంటీరియర్‌లోనూ, కలర్ స్కీమ్‌లోనూ సరికొత్త మార్పులు తీసుకువస్తోంది. అంతేకాదు ఈ కారును 1.2 లీటర్ పెట్రోల్ మోటార్, 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ ఆప్షన్లతో తీసుకువస్తోంది.
Toyota Taisor Price : ఈ టయోటా టైసర్ కారు ధర సుమారుగా రూ.8 లక్షల వరకు ఉండవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tata Punch EV Features : 2023 చివరిలో టాటా కంపెనీ.. పంచ్ ఈవీ కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కారు పలుమార్లు రోడ్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు కనిపించింది. ఈ ఎలక్ట్రికల్ మైక్రో ఎస్యూవీ కారును.. మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో తీసుకువచ్చేందుకు టాటా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ కార్లలోని బ్యాటరీలను ఒకసారి ఫుల్ రీఛార్జ్ చేస్తే 200 కి.మీ, 300 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
Tata Punch EV Price : టాటా పంచ్ ఈవీ కారు ధర రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టాప్-10 కార్లు ఇవే!
బజాజ్ బైక్ కొనాలా? త్వరలో లాంఛ్ కానున్న లేటెస్ట్ టూ-వీలర్స్‌పై ఓ లుక్కేయండి!