ETV Bharat / business

బజాజ్ బైక్​ కొనాలా? త్వరలో లాంఛ్​ కానున్న లేటెస్ట్ టూ-వీలర్స్​పై ఓ లుక్కేయండి! - బజాజ్​ అప్​కమింగ్ టూ వీలర్స్

Upcoming Bajaj Two Wheelers In India In Telugu : బైక్ లవర్స్​కు గుడ్ న్యూస్​. ప్రముఖ భారతీయ టూ-వీలర్ కంపెనీ బజాజ్​ వరుసగా 6 సరికొత్త బైక్​లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వీటిలో పల్సర్​ NS400, న్యూ CNG బైక్​, పల్సర్​ 125, సన్నీ ఈవీ, CT 150X, చేతక్​ ఈవీ న్యూ వేరియంట్ బైక్​లు ఉన్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Bajaj Two Wheelers In India
Upcoming Bajaj Two Wheelers In India
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 2:43 PM IST

Upcoming Bajaj Two Wheelers In India : భారతదేశంలోని అతిపెద్ద టూ-వీలర్ కంపెనీ బజాజ్​ ఆటో 6 సరికొత్త బైక్​లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా ఇండియన్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనేందుకు వ్యూహం రచిస్తోంది.

బజాజ్ ఆటో కంపెనీ.. తమ లేటెస్ట్​ పల్సర్​ NS400, న్యూ సీఎన్​జీ బైక్​, పల్సర్​ 125, సన్నీ ఈవీ, CT 150X, చేతక్​ ఈవీ న్యూ వేరియంట్ బైక్​లను వచ్చే ఏడాది నుంచి క్రమంగా లాంఛ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. అందుకే వాటిపై మనమూ ఓ లుక్కేద్దాం.

1. Bajaj Pulsar NS400 Features : బజాజ్ కంపెనీ ఈ సూపర్​ పవర్​ఫుల్ పల్సర్​ ఎన్​ఎస్400​ బైక్​ను 2024లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. డోమినార్​400 బైక్​లో ఉపయోగించిన 373 సీసీ లిక్విడ్-కూల్డ్​ సింగిల్ సిలిండర్ ఇంజిన్​నే ఈ బైక్​లోనూ అమర్చారు. ఇది 40 bhp పవర్​, 35 Nm టార్క్ జనరేట్​ చేస్తుంది. పల్సర్ NS200 డిజైన్ ఇన్స్​పిరేషన్​తో, సరికొత్త షార్ప్ స్టైలింగ్​ లుక్​తో ఈ పల్సర్​ NS400 బైక్​ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.

Bajaj Pulsar NS400
బజాజ్ పల్సర్​ ఎన్​ఎస్​400

2. Bajaj CNG Bike Features : బజాజ్ కంపెనీ ఈ సీఎన్​జీ బైక్​ను Bruzer E101 అనే కోడ్​నేమ్​తో పిలుస్తోంది. ఎంట్రీ లెవెల్ కమ్యూటర్ సెగ్మెంట్​ను టార్గెట్​ చేస్తూ ఈ సరికొత్త బైక్​ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ బైక్​ను CT100 లేదా CT110 బైక్ డిజైన్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు సమాచారం.

సాధారణంగా సీఎన్​జీ కార్లలో బై-ఫ్యూయెల్ సెటప్ ఉంటుంది. అయితే బజాజ్​ కంపెనీ తమ CNG బైక్​లో.. బై-ఫ్యూయెల్​ ట్యాంక్​ను అమర్చడం లేదు. ​కానీ ఈ బైక్​లో కచ్చితంగా పెట్రోల్ ట్యాంక్​ను కూడా అమర్చే అవకాశం ఉంది. ఎందుకంటే, వాహనదారులు సమీపంలోని CNG స్టేషన్ల వరకు వెళ్లడానికైనా పెట్రోల్ ట్యాంక్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. బైక్ ఖర్చులు వీలైనంత వరకు తగ్గించాలని భావించేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

3. New Bajaj Pulsar P125 Features : బజాజ్ కంపెనీ పల్సర్ పీ125 బైక్​ను టెస్ట్ చేస్తున్న వీడియోలు ఇటీవలే బయటకు వచ్చాయి. ఇది చూడడాని పల్సర్ P150 లానే ఉంది. ఈ బైక్​లో 125సీసీ పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. ఇది 11.8 bhp, 10.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

New Bajaj Pulsar P125
బజాజ్ పల్సర్​ పీ125

4. Bajaj Sunny EV Features : బజాజ్ కంపెనీ తీసుకువచ్చిన లెజెండరీ చేతక్ స్కూటర్​లానే.. బజాబ్​ సన్నీ ఈవీ కూడా ఉంటుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఇటీవలే పుణెలో దర్శనమిచ్చింది. ఈ బైక్​ గుండ్రని హెడ్​ల్యాంప్​, పొడవైన ఫెండర్​, స్లిమ్​ బాడీలైన్​తో చూడడానికి చాలా బాగుంది. ఈ ఎలక్ట్రిక్​ బైక్​లో హబ్​ మౌంటెడ్​ మోటార్​ను అమర్చినట్లు తెలుస్తోంది. ఈ బజాజ్​ ఎలక్ట్రిక్ బైక్​ను బహుశా 2024లోనే లాంఛ్ చేసే అవకాశం ఉంది.

5. Bajaj CT 150X Features : బజాజ్ కంపెనీ సరికొత్త సీటీ 150 ఎక్స్ బైక్​ను త్వరలో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిలోనూ పల్సర్​ 150 బైక్​లోని ఇంజిన్​నే ఉపయోగించారు. ఈ బైక్ ఫీచర్స్​, స్పెక్స్​, డిజైన్, ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Bajaj CT 150X
బజాజ్ సిటీ 150ఎక్స్​

6. Bajaj Chetak Electric Features : బజాజ్​ చేతక్ ఈవీని 2023 మార్చి నెలలోనే అప్​డేట్ చేశారు. త్వరలో దీనిని చేతక్ ప్రీమియం పేరుతో లాంఛ్ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్​లో దీనిని టెస్ట్ చేస్తున్నప్పటి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. దీని మోటార్​ కెపాసిటీ, బ్యాటరీ ప్యాక్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Bajaj Chetak Electric
బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​

అదిరే ఫీచర్లతో రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్​ 450 లాంఛ్​ - ధర ఎంతంటే?

టూ-వీలర్ లోన్​ కావాలా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.