ETV Bharat / business

ఆ వీడియోతో ట్విట్టర్​కు కొత్త చిక్కులు.. ధర తగ్గించేసిన మస్క్! - సిరు మురిగేసన్

Twitter engineer video: ట్విట్టర్​ సిద్ధాంతాలు, వైఖరిపై అమెరికాకు చెందిన ఓ గ్రూప్​ విడుదల చేసిన వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది. ఈ వీడియో ట్విట్టర్​ను కొత్త చిక్కులో పడేసింది. ట్విట్టర్​ పూర్తి వామపక్షవాది అని.. మస్క్​ సంస్థను కొనుగోలు చేయడం ఉద్యోగులు సహించలేకపోయారని పేర్కొంటూ ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు.. ట్విట్టర్​ను ముందు చెప్పినదానికన్నా తక్కువ ధరకే కొంటానని సంకేతాలిచ్చారు మస్క్.

musk
మస్క్
author img

By

Published : May 17, 2022, 1:13 PM IST

Twitter engineer video: 'ట్విట్టర్​ భావప్రకటన స్వేచ్ఛను నమ్మదు.. ఆ సంస్థలో కొనసాగాలంటే ఉద్యోగులు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి ట్విట్టర్​ అనుసరించే కమ్యూనిస్ట్​ సిద్ధాంతాలనే నమ్మాలి.. ట్విట్టర్​ను మస్క్ కొనుగోలు చేయడం ఉద్యోగులకు నచ్చలేదు'.. ఈ మాటలు ఎవరో నెటిజన్​ చేసిన కామెంట్​ కాదు.. స్వయంగా ఆ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అమెరికాకు చెందిన ప్రాజెక్ట్​ వెరిటాస్​ అనే గ్రూప్ షేర్​ చేసిన ఈ వీడియో ట్విట్టర్​ను కొత్త చిక్కుల్లో పడేసింది. సిరు మురుగేశన్​గా పేర్కొంటున్న ఆ వ్యక్తి మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను ​సోషల్​ మీడియాలో షేర్​ చేసింది ప్రాజెక్ట్ వెరిటాస్.

Twitter engineer video
ప్రాజెక్ట్​ వెరిటాస్ షేర్​ చేసిన వీడియోలో ట్విట్టర్​ ఉద్యోగి సిరు మురుగేసన్

ప్రాజెక్ట్​ వెరిటాస్​ ప్రకారం.. ట్విట్టర్​లో సీనియర్​ ఇంజినీర్​గా పనిచేస్తున్న సిరు మురుగేశన్​.. సంస్థ వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాన్​ మస్క్​ 44 బిలియన్ డాలర్లు పెట్టి సంస్థను కొనుగోలు చేసే డీల్​పై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారని మురుగేసన్​ తెలిపారు. సంస్థ పూర్తిగా వామపక్షవాది అని.. మతతత్వవాదులను అసలు సహించదని పేర్కొన్నారు.

"ట్విట్టర్​ సంస్థలో అంతా పూర్తి కమ్యూనిస్టు వాతావరణం ఉంటుంది. అందుకే మస్క్​ సంస్థను కొనుగోలు చేసే ప్రతిపాదనను నా సహోద్యోగులు అసలు సహించలేకపోయారు. మస్క్​ సంస్థను కొంటానని ప్రతిపాదించిన రోజు నా తోటి ఉద్యోగులంతా 'ఇది నిజమైతే కంపెనీలో ఇదే నా ఆఖరి రోజు' అన్నట్టు స్పందించారు. టిట్టర్​ సిద్ధాంతాలకు విరుద్ధంగా మస్క్​ సంస్థలు నడవడమే అందుకు కారణం. ఆయన క్యాపిటలిస్ట్​.. కానీ మా సంస్థ మాత్రం క్యాపిటలిస్ట్ సిద్ధాంతంలో లేదు. నిజానికి మేమంతా కమ్యూనిస్టులం."

-సిరు మురుగేశన్, సీనియర్​ ఇంజినీర్​ - ట్విట్టర్​

మస్క్​ ట్విట్టర్​ కొనుగోలు ప్రక్రియను ఆపేందుకు తమ సంస్థ ఉద్యోగులు అన్ని విధాలా ప్రయత్నించారన్నారు మురుగేశన్. సంస్థ బదిలీ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఉద్యోగాలు పోతాయేమో అని ఉద్యోగులలో ఆందోళన మొదలైందన్నారు.

మస్క్​ ట్విస్ట్​.. ట్విట్టర్​ను 44 బిలియన్​ డాలర్లకు కొనుగోలు చేస్తానని భారీ ఆఫర్​ ప్రకటించిన ఎలాన్​ మస్క్​.. ఇప్పుడు అంత భారీ మొత్తం చెల్లించే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్​ అంత కన్నా తక్కువకే కొనాలని భావిస్తున్నట్లు మస్క్​ హింట్​ ఇచ్చారు. 'తక్కువ ధరకే కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అసాధ్యం ఏమీ కాదు' అని మస్క్​ సోమవారం జరిగిన మియామీ టెక్నాలజీ కాన్ఫరెన్స్​లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ట్విట్టర్​ కొనుగోలును ఉద్దేశించే చేసినవే అని తెలుస్తోంది. ట్విట్టర్​లోని ఫేక్​ అకౌంట్లు, స్పామ్​ ఎక్కువగా ఉండటం వల్ల ఆ సంస్థ కొనుగోలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మస్క్​ ఇప్పటికే ప్రకటించారు.

ట్విట్టర్​లోకి ట్రంప్​.. ట్విట్టర్​లో నిషేధానికి గురై సొంత సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ఓపెన్​ చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఇప్పుడు మళ్లీ ట్విట్టర్​లోకి పరోక్షంగా రీఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్​లో సొంత ఖాతాతో పోస్ట్​లు షేర్​ చేసుకునే అవకాశం లేకపోవడం వల్ల ఆయన స్థాపించిన 'ట్రూత్​ సోషల్​' నుంచి పోస్ట్​లను ట్విట్టర్​లో షేర్​ చేస్తున్నారు. ఇకపై ట్రంప్​ ప్రతి పోస్ట్​ను ట్విట్టర్​లో షేర్​ చేస్తామని ట్రూత్​ సోషల్ ప్రకటించింది.

ఇదీ చూడండి : 8 ఏళ్లు.. 30 కొనుగోళ్లు.. 2014 నుంచి అదానీ సామ్రాజ్య విస్తరణ ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.