ETV Bharat / business

ట్విట్టర్ క్రాష్.. యూజర్ల ఇబ్బందులు.. కారణం ఏంటి?

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ క్రాష్ అయింది. అనేక మంది యూజర్లు ట్విట్టర్ ఓపెన్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 3.50 గంటల సమయంలో ఈ సమస్య తలెత్తింది. భారత్​లోని యూజర్లు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

TWITTER CRASH
Twitter is down
author img

By

Published : Mar 1, 2023, 4:35 PM IST

Updated : Mar 1, 2023, 5:15 PM IST

ఎలాన్​ మస్క్​కు చెందిన సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్​లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. అనేక దేశాల్లో ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలా మంది యూజర్లు ట్విట్టర్​ను ఓపెన్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 3.50 గంటల సమయంలో ఈ సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. ఖాతా ఫీడ్​లో ఉండే ట్వీట్లు కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఇందుకు కారణమేంటని ఇంకా తెలియలేదు. అంతర్జాల సేవల్లో అవాంతరాలను కనిపెట్టే 'డౌన్ డిటెక్టర్' వెబ్​సైట్ ప్రకారం.. ట్విట్టర్ క్రాష్​కు సంబంధించి వేలాది కంప్లైంట్స్ వచ్చాయి.

ట్విట్టర్ ఓపెన్ చేయగానే.. 'ట్వీట్స్ ఇప్పుడు లోడ్ కావడం లేదు' అనే సందేశం కనిపిస్తోందని కొందరు యూజర్లు చెబుతున్నారు. మరికొందరికి 'వెల్​కమ్​ టు ట్విట్టర్' అనే మెసేజ్ మాత్రమే కనిపిస్తోందని అంటున్నారు. అయితే, ట్వీట్లు చేయడానికి ఎలాంటి సమస్య లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ట్రెండింగ్​లో ఉన్న హ్యాష్​ట్యాగ్స్ సైతం కనిపిస్తున్నాయి. ఒక్క ఫీడ్​కు సంబంధించిన సమస్యే ఇది అని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ దేశాల్లోనే..
అమెరికా, యూకే, జపాన్, భారత్​లో ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. మొబైల్​తో పాటు డెస్క్​టాప్​ వెర్షన్​ సైతం క్రాష్ అయినట్లు యూజర్లు చెబుతున్నారు. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​లలో అనేక మంది ట్విట్టర్ క్రాష్​కు సంబంధించిన పోస్టులు చేస్తున్నారు. కొందరు జోకులు పేలుస్తూ మీమ్స్ షేర్ చేసుకుంటున్నారు. మరికొందరు తమ వ్యాపార, వ్యక్తిగత పనులకు ఆటంకం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో ట్విట్టర్​లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సేవలు నిలిచిపోతున్న ఘటనలు అనేకం నమోదవుతున్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఎలాన్ మస్క్ ఇటీవల వెల్లడించారు. అయినప్పటికీ మరోసారి సేవల్లో అంతరాయం ఏర్పడింది. ట్విట్టర్​లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం కూడా ఈ సమస్యలకు కారణమవుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన వెంటనే కీలక అధికారులు సహా అనేక మంది ఉద్యోగులపై మస్క్ వేటు వేశారు. ట్విట్టర్​ను మస్క్ కొనుగోలు చేయకముందు అందులో 7500 మంది ఉద్యోగులు ఉండగా.. తాజాగా ఈ సంఖ్య 2వేలకు చేరింది. అందులోని 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ట్విట్టర్ సబ్​స్క్రిప్షన్ సేవలు ప్రారంభించడంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నత ఉద్యోగిని సైతం తీసేసినట్లు సమాచారం.

Last Updated : Mar 1, 2023, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.