ETV Bharat / business

ట్విట్టర్‌ యూటర్న్‌.. బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ నిలిపివేత - ట్విట్టర్ లేటెస్ట్ న్యూస్

కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచి ట్విట్టర్​లో వస్తోన్న మార్పులు యూజర్లను గందరగోళంలో పడేస్తున్నాయి. మొన్నటిదాకా ‘బ్లూ టిక్‌’కు ఛార్జీలు కట్టాలని చెప్పిన మస్క్‌.. ఇప్పుడు ఆ ప్రీమియం ఫీచర్‌ను నిలిపివేశారు.

twitter blue tick subscription
twitter blue tick subscription
author img

By

Published : Nov 12, 2022, 10:42 AM IST

Updated : Nov 12, 2022, 11:18 AM IST

ట్విట్టర్​లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్‌’ను ప్రీమియం సర్వీసుగా మార్చి తీసుకొచ్చారు కొత్త యజమాని ఎలాన్‌ మస్క్. ఈ బ్లూ టిక్‌కు నెలవారీ ఛార్జీలు ప్రకటించారు. అయితే దీనివల్ల నకిలీ ఖాతాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో ఈ సర్వీసును నిలిపివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ కన్పించట్లేదని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ట్విట్టర్​ను మస్క్‌ కొనుగోలు చేయకముందు.. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేట్‌ సంస్థలు, ప్రముఖులు, జర్నలిస్టలు ఇలా ప్రముఖుల ఖాతాలను వెరిఫై చేసి ఈ ‘బ్లూ టిక్‌’ కేటాయించేవారు. దీంతో ఆయా ఖాతాలు వారివే అనేందుకు కచ్చితమైన ఆధారం ఉండేది. రెండు వారాల క్రితం ఈ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ను మస్క్‌ కొనుగోలు చేసిన తర్వాత.. ఈ ‘బ్లూ టిక్‌’ సర్వీసులో మార్పులు చేశారు. నెలవారీ ఛార్జీలతో ప్రీమియం వెర్షన్‌ను తీసుకొచ్చారు. అంటే.. నెలకు 8 డాలర్లు చెల్లించినవారికి ఎలాంటి వెరిఫికేషన్‌ లేకుండానే ‘బ్లూ టిక్‌’ ఇచ్చారు.

నిన్నటి నుంచి భారత్‌లోనూ ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. అయితే, దీని తర్వాత నకిలీ ఖాతాలు విపరీతంగా పెరిగాయి. ప్రముఖ బ్రాండ్లు, కంపెనీలు, వ్యక్తుల పేరుతో నకిలీ ఖాతాలను తెరిచి వాటికి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటున్నారు. వాటికి కూడా బ్లూ టిక్‌ ఉండటంతో.. ఆ సంస్థలు/వ్యక్తుల అసలైన ఖాతా ఏదనే గందరగోళం నెలకొంది. దీనిపై ఆందోనలు వ్యక్తమవడంతో ఈ సర్వీసును ట్విట్టర్​ నిలిపివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విట్టర్​ యాప్‌లో బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ ఫీచర్‌ కన్పించట్లేదని పలువురు యూజర్లు పేర్కొన్నారు. అంటే.. ఇక కొత్తగా ఎవరి ఖాతాలకు ‘బ్లూ టిక్‌’ ఇవ్వబోరన్నమాట.

మరోవైపు ఇదే సమయంలో ట్విట్టర్​ కొత్తగా ‘అధికారిక’ అనే ట్యాగ్‌ తీసుకొచ్చింది. వెరిఫైడ్‌ ఖాతాల కింద ఊదా రంగులో ‘Official’ అనే ట్యాగ్‌ను జత చేసింది. నిజానికి ఈ ట్యాగ్‌ను ఈ వారం మొదట్లోనే తీసుకురాగా.. ఆ తర్వాత దీనిపై కూడా ఆందోళనలు వ్యక్తమవడంతో కొద్ది గంటల్లోనే వెనక్కి తీసుకుంది. మళ్లీ శుక్రవారం నుంచి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే అది కూడా పూర్తి స్థాయిలో కాదు. అమెజాన్‌, నైక్‌, కోకా-కోలా, గూగుల్‌ వంటి కొన్ని దిగ్గజ సంస్థల ఖాతాలకు మాత్రమే ఈ ట్యాగ్‌ కన్పిస్తోంది. సెలెబ్రిటీలు, ప్రభుత్వ ఖాతాలకు ఇంకా దీన్ని జత చేయలేదు. రానున్న రోజుల్లో జత చేస్తారా? లేదా? అన్నదానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ.. అధికారిక ట్యాగ్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే.. ఇక ట్విట్టర్​లో ‘బ్లూ టిక్‌’ అనేది కన్పించకపోవచ్చేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచి ట్విట్టర్​.. యూజర్లకు గందరగోళం సృష్టిస్తోంది.

Last Updated : Nov 12, 2022, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.