Top 7 Safest Cars In India : నేటి కాలంలో ట్రాఫిక్ సహా, రోడ్ యాక్సిడెంట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే వాహనం కొనాలని ఆశించే ప్రతి ఒక్కరూ ముందుగా సేఫ్టీ ఫీచర్ల గురించి ఆలోచిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ కార్లను సూపర్ సేఫ్టీ ఫీచర్లతో రూపొందిస్తున్నాయి. వాటిలో టాప్-7 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Harrier And Tata Safari : భారతదేశంలో భద్రతాపరంగా చూసుకుంటే టాటా కార్లది ప్రథమ స్థానం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు జరిగిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో అన్నింటి కంటే టాప్ స్కోర్ నమోదు చేసి.. టాటా హారియర్, టాటా సఫారీలు 5-స్టార్ రేటింగ్ పొందడమే ఇందుకు నిదర్శనం.
Tata Cars NACP Ratings :
- టాటా హారియర్, టాటా సఫారీ కార్లు అడల్ట్ ఆక్యుపేషన్ ప్రొటెక్షన్‌లో 34 పాయింట్లకు గాను 33.05 పాయింట్లు పొందాయి.
- ఈ రెండు కార్లు కూడా చైల్డ్ ఆక్యుపేషన్ ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించాయి. ఈ విధంగా ఈ రెండు టాటా కార్లు 5-స్టార్ రేటింగ్ పొందాయి. ఇప్పటి వరకు జరిగిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఇదే టాప్ స్కోర్ కావడం విశేషం.
Tata Cars Safety Features : భద్రతాపరంగా చూసుకుంటే.. ఈ టాటా కార్లలో 6-ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్సీ, టీపీఎంఎస్, ఈఎస్పీ, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రోల్-ఓవర్ మిటిగేషన్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సీల్ట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్ ఉన్నాయి. కనుక మంచి సేఫ్టీ కారు కావాలని అనుకునేవారికి ఈ టాటా హారియర్, టాటా సఫారీ కార్లు బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు.
Volkswagen Virtus And Skoda Slavia : ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా కార్లు కూడా 5-స్టార్ రేటింగ్ కలిగిన బెస్ట్ సేఫ్టీ కార్స్ అని చెప్పుకోవచ్చు.
Volkswagen And Skoda Cars NACP Ratings :
- అడల్ట్ ఆక్యుపేషన్ ప్రొటక్షన్లో ఈ రెండు కార్లు 34 పాయింట్లకు గాను 29.71 పాయింట్లు సాధించాయి.
- చైల్డ్ ఆక్యుపేషన్ ప్రొటక్షన్లో ఈ రెండు కార్లు 49 పాయింట్లకు గాను 42 పాయింట్లు పొందాయి.
- పైగా ఈ రెండు కార్లలో బాడీషెల్స్ స్టేబుల్‌గా ఉంటాయని, అంతేకాదు ఈ రెండింటికీ అదనపు లోడింగ్‌ను భరించగలిగే శక్తి ఉందని నిరూపితం అయ్యింది.
Volkswagen And Skoda Cars Safety Features : ఈ రెండు సెడాన్ కార్లలోనూ స్టాండర్డ్‌గా 6-ఎయిర్ బ్యాగ్‌లు, ఈఎస్సీ, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్స్, లోడ్ లిమిటర్స్ లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కనుక మంచి సేఫ్టీ కారు కొనాలని అనుకునేవారు ఈ ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా కార్లపై ఓ లుక్కేయవచ్చు.
Skoda Kushaq And Volkswagen Taigun : MQB-A0-IN ప్లాట్‌ఫాంకు చెందిన స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కార్లు కూడా 5-స్టార్ రేటింగ్ ఉన్న కార్లే.
Skoda And Volkswagen Cars NACP Ratings :
- అడల్ట్ ఆక్యుపేషన్ ప్రొటక్షన్లో ఈ రెండు కార్లు 34 పాయింట్లకు గాను 29.64 పాయింట్లు సాధించాయి.
- చైల్డ్ ఆక్యుపేషన్ ప్రొటక్షన్లో ఈ రెండు కార్లు 49 పాయింట్లకు గాను 42 పాయింట్లు సాధించాయి.
- ఈ స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కార్ల బాడీషెల్స్ స్టేబుల్‌గా ఉంటాయని, అదనపు లోడింగ్స్ను భరించగలిగే శక్తి కూడా ఈ రెండు కార్లకు ఉందని నిరూపితమైంది.
Skoda Kushaq And Volkswagen Taigun Safety Features : స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కార్లలో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్సీ, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సీట్‌బెల్ట్ రిమైండర్ సిస్టమ్, సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్స్ విత్ లోడ్ లిమిటర్స్ ఉంటాయి. కనుక ఈ రెండు కార్లు కూడా సేఫ్టీ కార్లలో లిస్ట్‌లో టాప్ పొజిషన్లో ఉంటాయి.
Hyundai Verna Car NACP Rating :
- గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ వెర్నా ఆశ్చర్యకరమైన ప్రదర్శన చేసి 5-స్టార్ రేటింగ్ సంపాదించింది.
- అడల్ట్ ఆక్యుపేషన్ ప్రొటక్షన్లో ఈ హ్యుందాయ్ కార్ 34 పాయింట్లకు గాను 28.18 పాయింట్లు సాధించింది.
- చైల్డ్ ఆక్యుపేషన్ ప్రొటక్షన్లో ఈ హ్యుందాయ్ వెర్నా కారు 49 పాయింట్లకు గాను 42 పాయింట్లు పొందింది.
Hyundai Verna Car Safety Features : హ్యుందాయ్ వెర్నా కారులో 6-ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్సీ, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సీల్ట్ బెల్ట్ టెన్షనర్స్ విత్ లోడ్ లిమిటర్స్, సీల్ట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్ లాంటి మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ కారు బాడీషెల్ ఆన్స్టేబుల్గా ఉందని.. అదనపు లోడ్ భరించే శక్తి దీనికి లేదని టెస్ట్‌ల్లో తెలింది. ఈ విషయాన్ని కార్ బయ్యర్స్ గమనించుకోవాల్సి ఉంటుంది.
రూ.10 లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే టాప్-10 కార్స్ ఇవే!
కొత్త బండి కొనాలా? టాప్ -10 సూపర్ స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే!