ETV Bharat / business

క్రెడిట్‌ స్కోరు 750కి తగ్గితే అంతే!.. అలా కాకూడదంటే ఇలా చేయండి - credit card bill news

తీసుకున్న రుణాలను ఎలా చెల్లిస్తున్నారు అని తెలియజేయడంలో రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరు ఎంతో కీలకం. క్రమశిక్షణతో వాయిదాలు చెల్లించే వారికి ఈ స్కోరు అధికంగానే ఉంటుంది. బ్యాంకులూ ఇలాంటి వారినే ఇష్టపడతాయి. వడ్డీ రేట్లు అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో స్కోరు 750కి మించి ఉన్నప్పుడే ఎంతోకొంత రాయితీ ప్రయోజనమూ అందుతుంది. రుణం తీసుకునే దగ్గర్నుంచి, దాన్ని పూర్తిగా చెల్లించే వరకూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. అప్పుడే స్కోరు తగ్గకుండా ఉంటుంది. మరి, అవేమిటో తెలుసుకుందామా.

tips to maintain good credit score and benefits
క్రెడిట్‌ స్కోరు..750కి తగ్గనీయొద్దు..తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
author img

By

Published : Jan 20, 2023, 7:22 AM IST

వడ్డీ రేట్లు పెరుగుతూ ఉండటం, రిటైల్‌ రుణాలకు గిరాకీ అధికంగా ఉండటంతో బ్యాంకులు అప్పులు ఇచ్చేటప్పుడు గతంతో పోలిస్తే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మంచి క్రెడిట్‌ స్కోరు ఉండటం ఒక తప్పనిసరి అవసరంగా మారింది. దీన్ని సాధించడం అసాధ్యమేమీ కాదు. మీరు చెల్లించాల్సిన వాయిదాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తే చాలు. కానీ, అనుకోని పరిస్థితుల్లో లెక్క తప్పొచ్చు. ఈఎంఐ, క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపు అనేక కారణాల వల్ల ఆలస్యం కావొచ్చు. స్కోరు 700 కన్నా తక్కువగా ఉంటే.. రుణ సంస్థలు అతని/ఆమె దరఖాస్తును తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. కొన్నిసార్లు అప్పు ఇచ్చినా.. అధిక వడ్డీని వసూలు చేసే అవకాశాలున్నాయి. రెండురకాలుగా చూసినా.. తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్నప్పుడు రుణాలు తీసుకోవడం పెద్ద సవాలే.

ఖాతా ముగిస్తేనే..
రుణాలను తిరిగి చెల్లించకపోవడం వల్ల వ్యక్తి క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రుణగ్రహీత వరుసగా మూడు నెలలపాటు వాయిదాలు చెల్లించకపోతే.. బ్యాంకులు దాన్ని నిరర్థక ఆస్తిగా (ఎన్‌పీఏ) పరిగణిస్తాయి. చెల్లింపులు పూర్తిగా నిలిచిపోతే డిఫాల్ట్‌గా పరిగణించి, బ్యాంకులు ఏదో ఒక మొత్తానికి ఆ అప్పును రద్దు చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. దీన్నే 'సెటిల్‌మెంట్‌' అని పిలుస్తారు. అంగీకరించిన మొత్తాన్ని చెల్లిస్తే ఆ అప్పును పూర్తిగా రద్దు చేస్తారన్నమాట. బ్యాంకులు ఈ విషయాన్ని క్రెడిట్‌ బ్యూరోలకు తెలియజేస్తాయి. దీనివల్ల ఆయా రుణాలను 'సెటిల్డ్‌' అని పేర్కొంటారు. రుణ చరిత్ర నివేదికలో ఇలాంటివి కనిపిస్తే బ్యాంకు అప్పు ఇచ్చేందుకు ఆలోచిస్తుంది. ఇది దీర్ఘకాలంలో నష్టం కలిగించే అంశమే. సాధ్యమైనంత వరకూ రుణాన్ని మొత్తం తీర్చేయడమే ఉత్తమం. అప్పుడే ఆ అప్పు ఖాతా పూర్తిగా రద్దవుతుంది.

గడువు దాటకముందే..
రుణ వాయిదాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులను గడువులోపే చెల్లించడం ఉత్తమం. వాయిదాలను ఒక్కసారి ఆలస్యంగా చెల్లించినా.. క్రెడిట్‌ స్కోరు 100 పాయింట్లకు పైగా ప్రభావితం అవుతుంది. మంచి క్రెడిట్‌ స్కోరు దక్కాలంటే.. చెల్లింపులన్నీ గడువు నాటికి ముందే ఉండాలి. ఆర్థికంగా ఇబ్బందులుంటే క్రెడిట్‌ కార్డులకు కనీస మొత్తమైనా గడువులోపు చెల్లించండి. ఆ తర్వాత మిగిలిన బకాయిని కట్టేయండి. బిల్లు అధికంగా ఉంటే.. మీ కార్డు రుణ పరిమితిని అధికంగా వాడుకుంటున్నారని బ్యాంకులు భావిస్తాయి.

దరఖాస్తులు వద్దు..
రుణం కావాలా, క్రెడిట్‌ కార్డు తీసుకుంటారా అనే ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఇలాంటి వాటికి స్పందించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చూస్తాం, తీసుకుంటాం అనే మాటలు వాడకూడదు. మీకు అవసరం లేకపోతే వద్దు అని స్పష్టంగా చెప్పండి. మీరు కార్డు లేదా రుణం కావాలని అంటే చాలు.. ఆ విషయం క్రెడిట్‌ బ్యూరోలకు చేరిపోతుంది. దరఖాస్తులు ఎక్కువగా ఉంటే.. రుణం కోసం మీరు ఎదురుచూస్తున్నారని అర్థం. ఇది మీ క్రెడిట్‌ స్కోరును తగ్గించేస్తుంది. దరఖాస్తు పదేపదే తిరస్కరించినా ఇబ్బందే. బ్యాంకులు మీకు రుణం ఇవ్వకపోవడానికి ఇష్టపడకపోవచ్చు.

నెలకోసారైనా..
రుణం తీసుకున్న వారు.. నెలకోసారైనా తమ క్రెడిట్‌ స్కోరును పరిశీలించుకోవాలి. ఇప్పుడు చాలా వెబ్‌సైట్లు ఈ క్రెడిట్‌ నివేదికను ఉచితంగానే అందిస్తున్నాయి. నమ్మకమైన వెబ్‌సైట్‌ను ఇందుకోసం ఎంచుకోండి. తేడాలున్నట్లు అనిపిస్తే వెంటనే బ్యాంకుకు ఆ విషయాన్ని తెలియజేయండి. రుణం తీసుకునే ముందు క్రెడిట్‌ నివేదికను స్వయంగా పరిశీలించండి. కొత్త అప్పు తీసుకునేందుకు సాధ్యం కాకపోతే.. బంగారం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు హామీగా రుణం పొందండి. క్రెడిట్‌ కార్డు వినియోగాన్ని తగ్గించండి. ఆర్థిక క్రమశిక్షణ ఇక్కడ చాలా అవసరం. అప్పుడే మీ క్రెడిట్‌ స్కోరు తిరిగి 750 పాయింట్లకన్నా అధికంగా ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.