ETV Bharat / business

ఇంటి లోన్​ కోసం క్రెడిట్​ స్కోర్​ పెంచుకోవాలా?.. ఈ టిప్స్ మీకోసమే! - ఇంటి రుణం కోసం క్రెడిట్​ స్కోర్​

ఇటీవలి కాలంలో హోమ్​ లోన్స్​ కోసం అప్లై చేసుకునే వారి సంఖ్య విరివిగా పెరిగింది. కానీ ఈ రుణాలను పొందేందుకు తగిన క్రెడిట్​ స్కోర్​ అవసరం ఉంటుంది. అయితే అసలు ఈ క్రెడిట్​ స్కోరు ఏంటి? అది ఎలా సహాయం చేస్తుంది, వాటిని పెంచేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

tips to increase credit score
tips to increase credit score
author img

By

Published : Nov 12, 2022, 3:59 PM IST

ఆర్థిక క్రమశిక్షణకు సూచీలలో ఒకటి క్రెడిట్‌ స్కోరు. 300 నుంచి 900 వరకూ ఉండే ఈ అంకెలు ఒక వ్యక్తి రుణ చెల్లింపు సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. రుణ చరిత్ర నిడివి, చెల్లింపుల చరిత్ర ఆధారంగా క్రెడిట్‌ స్కోరును లెక్కిస్తారు. రుణగ్రహీతల గురించి ఆర్థిక సంస్థలు సులువుగా అర్థం చేసుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. ఇటీవల కాలంలో ఇంటి రుణాల కోసం దరఖాస్తు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రుణాలను పొందడంలో క్రెడిట్‌ స్కోరు ఎలా సహాయం చేస్తుంది, దీన్ని మెరుగుపర్చుకోవడానికి చిట్కాలేమిటి తెలుసుకుందాం.

  • రుణాలను తీసుకున్నప్పుడు వాటి వాయిదాలను సకాలంలో చెల్లించడం ఎంతో ముఖ్యం. మీ చెల్లింపుల చరిత్రే మీ క్రెడిట్‌ స్కోరును నిర్ణయించడంలో కీలకం. కాబట్టి, గడువు తేదీ దాటకుండా చూసుకోండి. ఆలస్యం చేస్తే స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. చెల్లింపుల విషయంలో అశ్రద్ధ పనికిరాదు. సకాలంలో చెల్లించినప్పుడు మీ ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది.
  • మీ క్రెడిట్‌ కార్డు పరిమితి ఎంతో తెలుసుకోండి. అందులో 30 శాతానికి మించి ఖర్చు చేయొద్దు. అధికంగా ఖర్చు చేస్తే అప్పులపై ఆధారపడుతున్నారని ఆర్థిక సంస్థలు భావిస్తాయి. బిల్లులను క్రమం తప్పకుండా చెల్లించండి.
  • కేవలం హామీ లేని రుణాలే తీసుకుంటే స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మీ స్కోరు మెరుగుపర్చుకోవడానికి కొన్ని హామీతో ఉన్న రుణాలనూ తీసుకోండి. ఇలా మిశ్రమ రుణాలు ఉన్నప్పుడే మీ స్కోరుపై ప్రభావం తక్కువగా ఉంటుంది. మీకు తెలియకుండానే రుణాలు, కార్డులు జారీ కావచ్చు. మోసపూరిత లావాదేవీల వల్ల మీ క్రెడిట్‌ నివేదికలో తప్పుడు సమాచారం కనిపించవచ్చు.
  • దీన్ని గుర్తించేందుకు తరచూ మీ క్రెడిట్‌ నివేదికలను పరిశీలించుకోండి. దీనివల్ల మీ నివేదికలో ఏమైనా తేడాలుంటే వెంటనే కనిపెట్టేందుకు వీలవుతుంది. బ్యాంకులు, క్రెడిట్‌ బ్యూరోలను సంప్రదించి, వీటిని సరిచేసుకోవచ్చు.
  • క్రెడిట్‌ స్కోరు, నివేదికలపై అనేక అపోహలూ ఉన్నాయి. కేవలం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మాత్రమే ఈ నివేదికలను పరిశీలిస్తాయి అని భావిస్తుంటారు. కానీ, బీమా కంపెనీలు, మొబైల్‌ఫోన్‌ సంస్థలూ వీటిని చూస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో చేర్చుకునే ముందు యాజమాన్యాలూ ఉద్యోగి క్రెడిట్‌ నివేదికను పరిశీలిస్తున్నాయి.
  • మీ క్రెడిట్‌ నివేదికలను క్రమం తప్పకుండా పరిశీలించండి. దీనివల్ల మీ క్రెడిట్‌ స్కోరుపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. మీ ఆర్థిక ప్రవర్తనను తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి క్రెడిట్‌ బ్యూరో నుంచి ఏడాదికి ఒకసారి ఉచిత క్రెడిట్‌ నివేదిక పొందేందుకు అర్హత ఉంది.
  • మీ ఆదాయం గురించి క్రెడిట్‌ స్కోరులో ఎక్కడా ఉండదు. కేవలం మీరు తీసుకున్న రుణాలు, క్రెడిట్‌ కార్డుల వివరాలు మాత్రమే కనిపిస్తాయి.
  • అపోహలను వీడి, క్రెడిట్‌ స్కోరు పెంచుకోవడం ద్వారా సులభంగా రుణాలను పొందేందుకు వీలవుతుంది. ఇప్పుడు గృహరుణాల వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయి. మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి వడ్డీలో స్వల్ప తగ్గింపూ లభిస్తోంది. దీనివల్ల రుణ అర్హతా పెరుగుతుంది.

ఇదీ చదవండి:ఇలా చేస్తే EMI భారం నుంచి సత్వర విముక్తి!

ట్విట్టర్‌ యూటర్న్‌.. బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.