ETV Bharat / business

'ట్రంప్​పై ట్విట్టర్​ బ్యాన్​ ఎత్తేస్తా..!'.. మస్క్​ సంచలన నిర్ణయం - ఎలాన్​ మస్క్​ డొనాల్డ్ ట్రంప్​

Elon Musk Donald Trump: డొనాల్డ్​ ట్రంప్​ ట్విట్టర్​ ఖాతా పునరుద్ధరణపై మరోమారు చర్చ మొదలైంది. అందుకు ట్విట్టర్​ను కొనుగోలు చేసిన టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణం. ఇంతకీ ఏమన్నారంటే?

Tesla chief Elon Musk
ట్రంప్​ ట్విట్టర్​ ఖాతా పునరుద్ధరణ
author img

By

Published : May 11, 2022, 8:08 AM IST

Updated : May 11, 2022, 9:24 AM IST

Elon musk Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ట్విట్టర్​ ఖాతా పునరుద్ధరణపై కీలక వ్యాఖ్యలు చేశారు టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్. ట్విట్టర్​ కొనుగోలు ఒప్పందం పూర్తయితే.. ట్రంప్​ ఖాతాను పునరుద్ధరిస్తామని సూత్రప్రాయంగా తెలిపారు. ఫైనాన్షియల్​ టైమ్స్​ నిర్వహించిన కార్ల భవిష్యత్తు కార్యక్రమంలో ఈ విషయంపై మాట్లాడారు మస్క్​. శాశ్వతంగా నిషేధం విధించటం తప్పుడు నిర్ణయమని, అది ట్విట్టర్​పై విశ్వాసాన్ని తగ్గిస్తుందన్నారు.

"చాలా స్పష్టంగా, మూర్ఖంగా ఉన్నందున అది నైతికంగా తప్పుడు నిర్ణయంగా భావిస్తాను. తప్పుడు, చెడు ట్వీట్లు ఉంటే.. వాటిని తొలగించటం లేదా కనిపించకుండా చేయటం వంటి చర్యలు తీసుకోవాలి. కానీ, శాశ్వతంగా నిషేధించకూడదు. డొనాల్డ్​ ట్రంప్​ ఖాతాపై నిషేధం విధించటం సరైంది కాదని నేను భావిస్తాను. అది పొరపాటు అని నేను అనుకుంటున్నాను. దాంతో దేశంలోని చాలా వర్గాలను దూరం చేసింది."

- ఎలాన్​ మస్క్​, టెస్లా సీఈఓ

ట్విట్టర్​ను కొనుగోలు చేసేందుకు 44 బిలియన్​ డాలర్ల ఒప్పందానికి ఆ సంస్థ బోర్డ్​ డైరెక్టర్లు గత నెల అంగీకారం తెలిపారు. ఇంకా రెగ్యులేటరీ ఆమోదం కావాలి. ఈ క్రమంలోనే ట్విట్టర్​ను కొనుగోలు చేయాలని మస్క్​కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వ్యాఖ్యలను మస్క్​ ఖండించారు. ఈ విషయంపై తానెప్పుడూ ట్రంప్​తో మాట్లాడలేదని స్పష్టం చేశారు. ట్రంప్​తో ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. ఆ తర్వాత ట్విట్టర్​తో ఒప్పందం తర్వాత ట్రంప్​ను తిరిగి సోషల్​మీడియాలోకి తీసుకొస్తారంటూ వార్తలు వెలువడ్డాయి. వీటిపై ట్రంప్​ స్పందించారు. 'వ్యక్తిగతంగా నాకు మస్క్​ అంటే చాలా ఇష్టం. అయితే ట్విట్టర్​ నాపట్ల ప్రవర్తించిన తీరుపై నేను అసంతృప్తి చెందాను. ఒక వేళ నన్ను ట్విట్టర్​లోకి అనుమతించినా నేను మాత్రం రాను.' అని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఓలా, ఉబర్​కు కేంద్రం వార్నింగ్.. ఎందుకలా చేస్తున్నారంటూ..?

ట్రంప్ చెప్పడం వల్లే మస్క్ ట్విట్టర్​ను కొన్నారా?

ట్విట్టర్​ యూజర్లకు మస్క్​ షాక్​- వారు డబ్బు చెల్లించాల్సిందే!

Last Updated : May 11, 2022, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.