ETV Bharat / business

ట్విట్టర్​ షేర్లు కొనుగోలు చేసిన ఎలాన్​ మస్క్ - tesla share price

Twitter Elon Musk: ప్రముఖ సోషల్​ మీడియా సంస్థ ట్విట్టర్​లో పెట్టుబడి పెట్టారు టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​. ఇందులో భాగంగా దాదాపు 73.5 మిలియన్ షేర్లను కొనుగోలు చేశారు.

tesla ceo elon musk
ఎలాన్​ మస్క్
author img

By

Published : Apr 4, 2022, 5:48 PM IST

Updated : Apr 4, 2022, 6:50 PM IST

Twitter Elon Musk: టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్..​ ప్రముఖ సోషల్​ మీడియా నెట్​వర్క్ ట్విట్టర్​లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారు. సోమవారం విడుదల చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్​ ప్రకారం దాదాపు 73.5 మిలియన్ షేర్లను తీసుకున్నారు. మస్క్​ ధీర్ఘకాలిక మార్కెట్​ను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టారు. గతంలో​ ట్విట్టర్​ సామర్థ్యంపై, వాక్​ స్వాతంత్య్రంపై మస్క్​ అనేక ప్రశ్నల్ని సంధించారు. దీంతో పాటు కొత్త సోషల్​ మీడియా ఫ్లాట్​ఫామ్​ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు ట్వీట్​ చేశారు.

మస్క్​ పెట్టుబడుల విషయం తెలిసి సోమవారం మార్కెట్​ ప్రారంభానికి ముందే ట్విట్టర్​ షేర్లు 25 శాతం పెరిగాయి. అదే సమయంలో టెస్లా షేర్లు కూడా స్వల్పంగా పెరిగాయి. టెస్లా మొదటి త్రైమాసిక ఉత్పత్తి ఫలితాలను నమోదు చేసిన రెండు రోజుల తర్వాత మస్క్​.. ట్విట్టర్ వాటా కొనుగోలు గురించి వెల్లడించారు. టెస్లా ఈ త్రైమాసికంలో 3,10,000 వాహనాలు డెలివరీ చేసినా.. అంచనాలను అందుకోలేకపోయింది.

ఇదీ చదవండి: హెచ్​డీఎఫ్​సీ డీల్​తో బుల్​ జోరు.. సెన్సెక్స్​ 1300 ప్లస్​

Last Updated : Apr 4, 2022, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.