Tesla car india: భారత్‌లో టెస్లా కార్ల విక్రయం, తయారీ కేంద్రాల స్థాపనపై ప్రయత్నాలకు విరామం ఇస్తున్నట్లు ఇటీవల టెస్లా సంస్థ ప్రకటించింది. అయితే ఎలాన్ మస్క్ తన నిర్ణయాన్ని మార్చుకుని త్వరలోనే ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకువస్తారని ఈవీ ఔత్సాహికులు ఆశించారు. కానీ మస్క్ తాజా ప్రకటనతో టెస్లా వాహనాలు అందుబాటులో వచ్చే అవకాశం ఉందని భావించిన వారికి నిరాశే మిగిలింది. భారత్‌లో టెస్లా ప్లాంట్ పెట్టే ఆలోచనే లేదని మస్క్ స్పష్టం చేశారు.
'భారత్‌లో టెస్లా తయారీ కేంద్రాలను స్థాపించే ఆలోచన లేదు. మొదట మా కార్ల విక్రయాలు, సర్వీసులకు అనుమతించని ఏ ప్రాంతంలోనూ తయారీ కేంద్రాలను సంస్థ ఏర్పాటు చేయదు' అని మస్క్ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో భారత్‌లో టెస్లా తయారీ కేంద్రం అందుబాటులోకి వస్తుందా అని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. స్పేస్ఎక్స్ ఆధ్వర్యంలో అమెరికా సహా పలు దేశాలు సేవలందిస్తున్న స్టార్‌లింక్ ఇంటర్నెట్ భారత్‌లోకి అడుగుపెట్టడంపై కూడా మస్క్ స్పష్టతను ఇచ్చారు. త్వరలోనే భారత్‌లోకి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. కేంద్రం అనుమతే ఆలస్యమని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
-
Tesla will not put a manufacturing plant in any location where we are not allowed first to sell & service cars
— Elon Musk (@elonmusk) May 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tesla will not put a manufacturing plant in any location where we are not allowed first to sell & service cars
— Elon Musk (@elonmusk) May 27, 2022Tesla will not put a manufacturing plant in any location where we are not allowed first to sell & service cars
— Elon Musk (@elonmusk) May 27, 2022
తొలుత విదేశాల్లో తయారైన కార్లను మాత్రమే భారత్‌లో విక్రయిస్తామని, ఆ తర్వాతే తయారీ యూనిట్‌ను స్థానికంగా నెలకొల్పుతామని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చెబుతూ వచ్చారు. దీంతో పాటు ఎలక్ట్రిక్ కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నారు. అయితే మస్క్ డిమాండ్లకు అంగీకరించని కేంద్రం.. కార్ల తయారీని భారత్‌లోని చేపట్టాలని స్పష్టం చేయడం వల్ల టెస్లాను భారత్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
ఇదీ చూడండి : ఒక ఛార్జింగ్‌తో 590 కి.మీ. ప్రయాణం.. బీఎండబ్ల్యూ ఐ4 సెడాన్ ఎంతంటే?