ETV Bharat / business

TCS Dress Code : TCSలో ఇక స్ట్రిక్ట్​గా డ్రెస్ కోడ్ అమలు.. కారణం ఇదేనంట! - టీసీఎస్​ ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ ఆఫీస్

TCS Dress Code : ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​(TCS) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే తమ ఉద్యోగులకు స్ట్రిక్ట్​గా డ్రెస్​కోడ్​ను అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇంకా ఏం చెప్పిందంటే?

TCS Dress Code Revealed And Going To Start Work From Office
TCS Dress Code And Work From Office
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 12:27 PM IST

TCS Dress Code : దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​(TCS) కంపెనీ సంస్థ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్​ కారణంగా వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేస్తున్న ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందిగా కొద్ది రోజుల క్రితం టీసీఎస్ ప్రకటించింది. ఆఫీసులకు వచ్చి పనిచేయడం వల్లే ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటుందని.. బిజినెస్ చక్కగా జరుగుతుందని అభిప్రాయపడింది. ఇదే క్రమంలో తాజాగా మరో కీలక విషయం తెలిసింది. ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి వచ్చే క్రమంలో డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.

టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్.. ఈ మేరకు ఉద్యోగులకు పంపిన అంతర్గత మెయిల్‌లో ఈ విషయం వెల్లడించారు. డ్రెస్ కోడ్ ప్రాముఖ్యం నొక్కి చెప్పారు. డ్రెస్ కోడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా తమ వాటాదారులపై మంచి ప్రభావం చూపిస్తుందని అన్నారు. 'మనం ఆఫీసులో ఉన్న సమయాల్లో బాధ్యతలు, ఇంకా విధుల్ని నిర్వర్తించే సమయంలో.. డ్రెస్ కోడ్ పాలసీ అనేది స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తుంది.' అని మిలింద్ అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా టీసీఎస్ కంపెనీలో గత రెండేళ్లలో చాలా మంది చేరారని.. వారు ఇంత వరకు ఆఫీసులకు రాలేదని చెప్పిన మిలింద్ లక్కడ్.. వారికి ఇప్పుడు టీసీఎస్ పద్ధతులు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టీసీఎస్ మార్గంలో పయనించేలా చేయాలని చెప్పుకొచ్చారు.

ఇది డ్రెస్​కోడ్​..
TCS Employee Dress Code :

సోమవారం నుంచి గురువారం- బిజినెస్​ క్యాజువల్స్​ :

  • మగవారు తప్పనిసరిగా ఫార్మల్​ ప్యాంట్​తో ఫుల్-స్లీవ్స్​ ఉన్న ఫార్మల్​ షర్ట్​ను మాత్రమే ధరించాలి.
  • మహిళా ఉద్యోగులు తప్పనిసరిగా ఫార్మల్ స్కర్టులు, చీరలు లేదా కుర్తాలను ధరించాలి.

శుక్రవారం- స్మార్ట్​ క్యాజువల్స్​ :
క్యాజువల్స్(టీ-షర్ట్స్​, షర్ట్స్​, జీన్స్​, కాటన్​ ప్యాంట్స్​)​, హాఫ్​-స్లీవ్​డ్​ షర్ట్స్, కాలర్డ్​ టీ-షర్ట్స్​, ఫుల్​ హ్యాండ్స్​ టీ-షర్ట్స్​(అమ్మాయిలు), క్యాజువల్​ ప్యాంట్స్​, ఖాకీ చొక్కాలు​, చినో​, ఫుల్​ లెంథ్​ జీన్స్​, కుర్తీస్​, ప్రింటెడ్​ బ్లౌజులు, స్కర్టులు.

ఫుట్​వేర్​..
ఫార్మల్​ షూస్​, లోఫర్​ షూస్​, హై అండ్​ లో హీల్స్​ చెప్పులు​, ఫ్లాట్​గా ఉండే చెప్పులు, శాండిల్స్​, స్నీకర్స్​ షూస్, వెల్వెట్​ షూస్​​ మాత్రమే ధరించాలి.

అఫీషియల్​ ఈవెంట్​లు, క్లయింట్​ విజిట్​లకు..

  • ఉద్యోగులు అఫీషియల్​ ఈవెంట్​లకు హాజరైనప్పుడు గానీ, క్లయింట్​ విజిట్​లకు వెళ్లినప్పుడు డార్క్​ కలర్స్​లో ఉండే బిజినెస్​ సూట్​లను ధరించాల్సి ఉంటుంది.
  • ఫుల్​-స్లీవ్డ్​ షర్ట్స్, ఫార్మల్​ ప్యాంట్స్​(ఇన్​షర్ట్​ వేయాలి)
  • డార్క్​ కలర్స్​లో ఉండే ఫార్మల్​ స్కర్టులు, బిజినెస్​ ఫార్మల్స్​, చీర లేదా సల్వార్​ సూట్స్​.
  • న్యూట్రల్​ రంగుల్లో ఉండే ఫుట్​వేర్​(ఫార్మల్​ షూస్​​​)ను మాత్రమే ధరించాలి.

Gold Rate Today 19th October 2023 : తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

How To Download Voter ID Card Online : ఓటర్ ఐడీ కావాలా?.. ఆన్​లైన్​లో ఇన్​స్టాంట్​గా డౌన్​లోడ్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.