Tata Nexon EV Car Features and Price Details in Telugu: భారతదేశంలో ఎలక్ట్రికల్ కార్ల (ఈవీ) అమ్మకాలు జోరు అందుకుంటున్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల దెబ్బకు వాహన కొనుగోలుదారులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. నిజానికి విద్యుత్ వాహనాల వల్ల ఇంధన ఖర్చులు కలిసివస్తాయి. దీనితోపాటు అవి పర్యావరణ హితంగానూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇంధనాలతో నడిచే కార్లతో పోల్చితే.. విద్యుత్ వాహనాల నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. అందుకే విద్యుత్ వాహనాలపై నేడు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ ఆటోమొబైల్ దిగ్గజం, ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మరో ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అదే టాటా నెక్సాన్ ఈవీ(Tata Nexon EV). ఇది పెట్రోల్, డీజిల్‌తో నడిచే నెక్సాన్ మాదిరిగానే.. కొత్త curve డిజైన్‌తో రూపొందించబడింది.
నెక్సాన్ ఈవీ ఫీచర్స్ :
Features of TATA NEXON EV :
- లాంగ్ రేంజ్(LR) వేరియంట్‌లో 40.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 465 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది.
- ఇది 144 బీహెచ్‌పీ పవర్ వద్ద 215 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- మిడ్ రేంజ్ వేరియంట్ 30 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై 325 కి.మీ పరిధిని అందిస్తుంది.
- ఇది 129 బీహెచ్‌పీ పవర్ వద్ద 215 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- అంటే రెండు మోటర్లు కూడా 215 Nm ఎలక్ట్రిక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.
- ఇక EV మిడ్ రేంజ్(MR) 7.2 kw ఛార్జింగ్‌ను కలిగి ఉంది.
- ఫాస్ట్ ఛార్జర్(DC Charger) ద్వారా కేవలం 56 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుందని టాటా తెలిపింది.
- ఇందులో వెహికల్ టు వెహికల్(V2V), వెహికల్ టు లోడ్(V2L) టెక్నాలజీని బేస్ చేసుకుని ఛార్జర్స్ ఉంటాయి.
- ఏరో రెసిస్టెన్స్‌ను 13 శాతం తగ్గించింది. ఇంకా రేంజ్‌ను రెండు శాతం పెంచింది.
- టాటా నెక్సాన్ EV.. ఫ్రంట్ ప్రొఫైల్ విస్తృత శ్రేణి LED లైట్లను కలిగి ఉంది.
- స్పీడ్ విషయానికొస్తే ఈ కారు 8.9 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
- గరిష్ఠంగా గంటకు 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
- ఇది పాత వెర్షన్‌తో పోలిస్తే 12 కి.మీ ఎక్కువ వేగంతో వెళ్తుంది.
Upcoming Cars Under 15 Lakhs India : రూ.15 లక్షల్లో కారు కొనాలా? త్వరలో రానున్న 5 టాప్ మోడల్స్ ఇవే..
రంగు రంగుల్లో.. టాటా ఈవీ
- కొత్త టాటా నెక్సాన్ EV.. ఫ్లేమ్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ఫియర్‌లెస్ పర్పుల్, ఇంటెన్సిటీ టీల్, డేటోనా గ్రే.. వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో అందుబాటులో ఉంది.
- ఇది ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు EV ఫ్లాష్ చేయడానికి అనుమతిస్తుంది.
- అలాగే కొత్త టాటా నెక్సాన్ EV మోడల్ ప్రధాన ఫీచర్లలో ఒకటి 360 డిగ్రీ కెమెరా.
- వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్టీరింగ్ వీల్‌పై బ్యాక్‌లిట్ బ్రాండ్ లోగో ఉన్నాయి.
- ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి.
- వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, టైప్-సి పోర్ట్‌లు, సన్‌రూఫ్, JBL ఆడియో, వాయిస్ కమాండ్ ఫీచర్లు ఉన్నాయి.
- ఈ కారు ధర 15 నుంచి 21 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
- సెప్టెంబర్ 14న మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.
Tata Upcoming Cars 2023 : జోరుమీదున్న టాటా మోటార్స్.. వరుసగా 7 కార్ల లాంఛింగ్‌కు సన్నాహాలు!
5 Upcoming Compact SUVs : అత్యాధునిక హంగులతో రానున్న టాప్ 5 కార్లు ఇవే.. లాంఛ్ అప్పుడే..