ETV Bharat / business

'టాటా న్యూ' సూపర్​ యాప్ లాంచ్​- రివార్డ్ పాయింట్స్, క్యాష్​బ్యాక్స్... - టాటా న్యూ యాప్ లాంచ్

Tata Neu: గ్రాసరీస్ నుంచి గ్యాడ్జెట్ల వరకు, ఫుడ్​ ఆర్డర్ల నుంచి ప్రయాణ టికెట్ల వరకు వివిధ యాప్​లను వాడాల్సిన పనిలేకుండా ఒకే చోట ఆ సేవలను అందిస్తోంది టాటా న్యూ. ఈ సూపర్​ యాప్​ను టాటా గ్రూప్​ గురువారం వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Tata group launches super app Tata Neu
టాటా న్యూ
author img

By

Published : Apr 7, 2022, 6:27 PM IST

Tata Neu: ఈ కామర్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేపింది టాటా గ్రూప్​. 'టాటా న్యూ' పేరుతో సూపర్​ యాప్​ను గురువారం లాంచ్​ చేసింది. ఇక అన్ని బ్రాండ్లను ఒకే వేదిక ద్వారా ఉపయోగించేందుకు వీలు కల్పించింది. టాటా న్యూ రాకతో అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ వంటి దిగ్గజ ఈ కామర్స్​ సంస్థలకు గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి టాటా న్యూ సూపర్ యాప్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..

Tata group launches super app Tata Neu
టాటా న్యూ

ఏమిటీ సూపర్​ యాప్? : షాపింగ్​ అవసరాలు, ఫుడ్ ఆర్డర్లు, ప్రయాణ టికెట్లు, హోటల్ బుకింగ్స్​ కోసం మనం చాలా రకాల యాప్స్​ వాడుతుంటాం. అయితే వాటన్నింటినీ ఒకే దగ్గర పొందగలగడమే ఈ సూపర్​ యాప్ కాన్సెప్ట్​. దీని ద్వారా ఫోన్​లో స్టోరేజీ బాధ ఉండదు. అనేక యాప్​ల కోసం సైన్​అప్ అవ్వాల్సిన అవసరం లేదు.

'టాటా న్యూ'లో ఏమేం చేయొచ్చు? : టాటా గ్రూప్​లోని అనేక బ్రాండ్​లను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదే 'టాటా న్యూ'. ఫైనాన్స్​, మెడిసిన్, హాలిడే, ఎలక్ట్రానిక్స్​, గ్రాసరీస్​ సహా మరెన్నో విభాగాల్లో ఈ యాప్​ ద్వారా ఆఫర్లు పొందవచ్చు. బిగ్​బాస్కెట్, ఎయిర్​ ఏసియా, క్రోమా, టాటా క్లిక్, వెస్ట్​సైడ్​, ఐహెచ్​సీఎస్​ వంటి సంస్థల నుంచి ఆకర్షణీయ ఆఫర్లు ఉంటాయి.

రివార్డ్ పాయింట్లు కూడా.. : టాటా న్యూ ద్వారా 'న్యూకాయిన్స్​' అనే రివార్డు పాయింట్లు కూడా అందుతాయి. ఆన్​లైన్​తో పాటు ఆఫ్​లైన్​ కొనుగోళ్లకూ పాయింట్లు వస్తాయి. వాటిని క్యాష్​బ్యాక్​గా, డిస్కౌంట్లుగా వాడుకోవచ్చు. ఈ రకంగా ఇది షాపింగ్​తో పాటు యూపీఐ పేమెంట్స్​ యాప్​గానూ పనిచేస్తుంది. అమెజాన్, పేటీఎం, రిలయన్స్​ జియో వంటి సంస్థలు ఇదివరకే తమ సూపర్​ యాప్​లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాటి ద్వారా పేమెంట్లు, కంటెంట్ స్ట్రీమింగ్, షాపింగ్, ట్రావెల్ బుకింగ్స్​, గ్రాసరీస్ వంటి సేవలను అందిస్తున్నాయి. ముఖేశ్ అంబానీకి చెందిన జియో మార్ట్​ కూడా త్వరలోనే ఈ సూపర్​ యాప్​ వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది.

ఇదీ చదవండి: టాటా కొత్త కార్ అదుర్స్.. ధరల పెంపుతో మారుతీ షాక్.. 20వేల వాహనాలు రీకాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.