ETV Bharat / business

Sukanya Samriddhi Yojana : సుకన్య సమృద్ధి యోజనతో 'ఆమె' భవిష్యత్ బంగారం.. రూ.300తో రూ.50 లక్షల మెచ్యూరిటీ!

Sukanya Samriddhi Yojana : కేంద్ర ప్రభుత్వం బాలికల భవిష్యత్​ కోసం.. సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా తల్లిదండ్రులు గరిష్ఠంగా ఇద్దరు అమ్మాయిల పేరు మీద రెండు వేర్వేరు ఖాతాలు తెరవడానికి వీలవుతుంది. ఈ పథకంలో రోజుకు కేవలం రూ.300 మదుపు చేస్తే.. మెచ్యూరిటీ సమయానికి రూ.50,00,000 వరకు పొందే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

Sukanya Samriddhi Yojana Scheme
సుకన్య సమృద్ధి యోజన పథకం
author img

By

Published : Aug 20, 2023, 12:37 PM IST

Sukanya Samriddhi Yojana : తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్​ బంగారుమయంగా ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్​ చదువు కోసం, పెళ్లి కోసం పొదుపు చేయాలని అనుకుంటారు. ఇందుకోసం సరైన పథకాల్లో పెట్టుబడి పెట్టాలని ఆశిస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది.

ఇద్దరికి మాత్రమే!
Sukanya Samriddhi Yojana Account : సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ నిబంధనల ప్రకారం, తల్లిదండ్రులు తమ కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లల పేరు మీద రెండు వేర్వేరు అకౌంట్స్​ను ఓపెన్​ చేయగలరు. అయితే ఆ బాలికల వయస్సు 10 ఏళ్ల లోపు ఉండాలి. ఒక వేళ వాళ్లకు మూడో అమ్మాయి ఉన్నా కూడా సుకన్య సమృద్ధి యోజన స్కీమ్​ కింద మూడో ఖాతా తెరవలేరు.

ప్రత్యేక పరిస్థితుల్లో
Sukanya Samriddhi Yojana Deposit Rules : సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఒక ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది. తల్లిదండ్రులకు ఇద్దరు కంటే ఎక్కువ మంది కవల ఆడ పిల్లలు పుడితే, అప్పడు మాత్రం మూడు కంటే ఎక్కువ ఖాతాలు తెరవడానికి వీలు కల్పిస్తారు.

వడ్డీరేటు ఎంత?
Sukanya Samriddhi Yojana Interest Rate 2023 : సుకన్య సమృద్ధి యోజన పథకంలో.. ఖాతా తెరచినప్పటి నుంచి 15 ఏళ్లు వరకు అమ్మాయి పేరుమీద మదుపు చేయవచ్చు. ఈ స్కీమ్​లో ఒక సంవత్సరానికి గరిష్ఠంగా రూ.1.5 లక్షలు వరకు మదుపు చేయవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ పీరియడ్​ 21 సంవత్సరాలు. ప్రస్తుతం ఈ పథకంలోని డిపాజిట్లపై 8 శాతం వరకు వడ్డీ రేటు ఇస్తున్నారు.

మెచ్యూరిటీ అమౌంట్​!
Sukanya Samriddhi Yojana Maturity : సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు మదుపు చేయవచ్చు. ఈ విధంగా 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే.. 8 శాతం చొప్పున వడ్డీ లెక్క వేసినా.. కాంపౌండింగ్ ఎఫెక్ట్​ వల్ల రూ.67.3 లక్షల వరకు మెచ్యూరిటీ అమౌంట్​ చేతికి అందుతుంది.

వడ్డీ రేట్లలో మార్పు వస్తే
SSY Interest Rates 2023 : సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. అందువల్ల వడ్డీ రేట్లు పెరిగితే.. మెచ్యూరిటీ అమౌంట్​ పెరుగుతుంది. ఒక వేళ వడ్డీ రేట్లు తగ్గితే.. అందుకు అనుగుణంగా మెచ్యూరిటీ మొత్తం కూడా తగ్గుతుంది. ఈ విషయాన్ని పాలసీదారులు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

టాక్స్ కూడా లేదు!
SSY Tax Benefits : ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్​ 80సీ ప్రకారం, సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా వచ్చిన ఆదాయంపై ఎలాంటి పన్ను విధించబడదు. ముఖ్యంగా పొదుపు చేసిన డబ్బు, వడ్డీ, మొత్తం రిటర్న్​లు.. అన్నింటిపైనా పన్ను మినహాయింపు లభిస్తుంది.

రూ.300లతో.. రూ.50 లక్షలు
Sukanya Samriddhi Yojana Calculator : మీరు మీ అమ్మాయి భవిష్యత్​ కోసం రూ.50,00,000 వరకు ప్రత్యేక నిధి సమకూర్చి ఇద్దామనుకుంటున్నారా? అయితే మీకు సుకన్య సమృద్ధి యోజన మంచి ఆప్షన్ అవుతుంది.

SSY Scheme Benefits : మీరు రోజుకు కేవలం రూ.300లు చొప్పున ఈ పథకంలో డిపాజిట్​ చేయడం వల్ల, సంవత్సరానికి గరిష్ఠంగా రూ.1,11,370లు మదుపు చేసినట్లు అవుతుంది. ఈ విధంగా మీరు 15 ఏళ్ల పాటు మదుపు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు 15 ఏళ్లలో రూ.16,42,500 మాత్రమే మదుపు చేస్తారు. కానీ 21 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్​ పూర్తి అయిన తరువాత మీకు ఏకంగా రూ.50,00,000 వరకు అందుతుంది. దీనికి ప్రధాన కారణం కాంపౌండింగ్​ ఎఫెక్ట్​.

నోట్​ : సుకన్య సమృద్ధి యోజన పథకంలో వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారతాయి. కనుక ఈ వడ్డీ రేట్లకు అనుగుణంగానే మెచ్యూరిటీ అమౌంట్​లోనూ మార్పులు ఉంటాయి. ఈ విషయాన్ని ఇన్వెస్టర్లు అందరూ కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.