అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, చైనాలో కొవిడ్ ఆంక్షల సడలింపునకు తోడు కీలక రంగాలు రాణించటం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లోనూ లాభాలతో ముగిశాయి. 600 పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమైన సూచీలు.. అదే జోరును కనబరిచాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 1100 పాయింట్ల మార్క్‌ను దాటి చివరకు 1042 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 300కుపైగా లాభపడింది.
- ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1042 పాయింట్ల వృద్ధితో 55,925 వద్ద ముగిసింది.
- జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ 309 పాయింట్ల లాభంతో 16,661 వద్ద కదలాడుతోంది.
లాభనష్టాల్లోనివి..
టైటాన్ కంపెనీ, ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్‌లు 4శాతానికిపైగా లాభపడ్డాయి. మరోవైపు.. కొటక్‌మహీంద్ర, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐటీసీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.