ETV Bharat / business

మార్కెట్లకు భారీ లాభాలు.. మళ్లీ 60వేల ఎగువకు సెన్సెక్స్ - ఎన్​ఎస్​ఈ

stock market today live updates
స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్
author img

By

Published : Apr 4, 2022, 9:39 AM IST

Updated : Apr 4, 2022, 3:49 PM IST

15:48 April 04

బుల్​ జోరు.. సెన్సెక్స్​ 1300 ప్లస్​

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ పవనాలు ఇన్నప్పటికీ దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. రష్యా- ఉక్రెయిన్​ యుద్ధంలో సానుకూలత, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ విలీన ప్రకటన వెలువడటం వల్ల ఆయా షేర్లు దూసుకెళ్లటమూ కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపటం వల్ల తిరిగి 60వేల బెంచ్​ మార్క్​ను దాటింది సెన్సెక్స్​.

ముంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​.. 1335 పాయింట్ల వృద్ధితో 60,612 వద్ద స్థిరపడింది. 59,764 పాయింట్ల వద్ద వారాన్ని ప్రారంభించిన సెన్సెక్స్​ ఒక దశలో 60,845 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 60,612 వద్ద ముగిసింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచి నిఫ్టీ.- 383 పాయింట్ల లాభంతో 18,053 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 17,809 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ.. ఒక దశలో 18,115 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 18,053 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి: హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, హెడ్​డీఎఫ్​సీలు సుమారు 10 శాతం మేర లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్​ 4శాతం, హెడ్​డీఎఫ్​సీ లైఫ్ 3.83శాతం, కొటక్​ మహీంద్రా బ్యాంకు 3.23 శాతం వృద్ధి చెందాయి. మరోవైపు.. ఇన్ఫోసిస్​ ఒక శాతానికిపైగా నష్టపోయింది. టైటాన్​ కంపెనీ, జెఎస్​ డబ్ల్యూ స్టీల్​లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ​

13:58 April 04

దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 1160 పాయింట్ల లాభంతో 60 వేల 438 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 330 పాయింట్లు పెరిగి 18 వేల వద్ద కొనసాగుతోంది.

12:54 April 04

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 800 పాయింట్ల లాభంతో 60వేల 75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 220 పాయింట్ల వృద్ధితో 17వేల 890 వద్ద కొనసాగుతోంది.

10:54 April 04

దేశీయ స్టాక్​ మార్కెట్లు.. ఈ వారం భారీ లాభాలతో మొదలయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 1290 పాయింట్లు పెరిగి.. 60 వేల 556 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 334 పాయింట్ల లాభంతో 18 వేల 004 వద్ద ఉంది. హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ విలీన ప్రకటన వెలువడడం వల్ల ఆయా షేర్లు దూసుకెళ్తున్నాయి. సోమవారం ట్రేడింగ్​ ప్రారంభమైన మొదటి గంటలోనే మదుపర్ల సంపద రూ. 3లక్షల కోట్లకు పైగా పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 12.81 శాతం పెరిగి రూ. 2,765కి చేరుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ దాదాపు 10.22 శాతం పెరిగి రూ.1,660.20కి చేరుకుంది. బజాజ్​ ఫైనాన్స్​, ఎల్​టీ, ఎన్​టీపీసీ, భారత్​ఎయిర్​టెల్​, కొటాక్​ బ్యాంక్​​ లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, రిలయన్స్​, యాక్సిస్​ బ్యాంక్​, మారుతి, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఇన్ఫీ కంపెనీలు డీలాపడ్డాయి.

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్​ బెంచ్​ మార్క్​ నిక్కీ నష్టాల్లో ఉండగా.. హాంగ్​కాంగ్​, దక్షిణ కొరియా సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. వడ్డీ రేట్లపై ఏప్రిల్ 8న వెలువడనున్న ఆర్​బీఐ పాలసీ ప్రకటనతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు తరలింపు, విదేశీ నిధుల ప్రవాహంతో పాటు తయారీ, సేవల రంగాలకు సంబంధించిన పీఎంఐ డేటాతో ముడిపడి ఉన్న పరిణామాలు మదుపర్లను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

హెచ్​డీఎఫ్​సీ డీల్​: దేశంలోని అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్.. దేశంలోని మరో అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో విలీనం కానుంది. ఆర్​బీఐ, సెబీ నియంత్రణ నిబంధనలకు లోబడి ఉంటుందని హెచ్​డీఎఫ్​సీ తెలిపింది. ఒప్పందం ప్రకారం, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌లో ఉన్న ప్రతి 25 ఈక్విటీ షేర్‌లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 42 ఈక్విటీ షేర్లు షేర్ ఎక్స్ఛేంజ్ రేషియోగా ఇవ్వనుంది. ఆడిట్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న తరువాత నేడు(సోమవారం) జరిగిన సమావేశంలో విలీన ఒప్పందాన్ని ఆమోదించింది.

10:29 April 04

స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 1456 పాయింట్లు పెరిగి.. 60 వేల 732 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 393 పాయింట్ల లాభంతో 17 వేల 063 వద్ద ఉంది.

09:33 April 04

స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్

Stock market today: స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 1100 పాయింట్లకుపైగా లాభంతో 60వేల 395 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 295 పాయింట్లు వృద్ధి చెంది 17వేల 965 వద్ద ట్రేడవుతోంది. హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ విలీన ప్రకటన.. బ్యాంకింగ్ రంగంలో జోష్ నింపింది. ఫలితంగా ఆయా షేర్లు దూసుకెళ్తున్నాయి. విద్యుత్​ సహా ఇతర రంగాల షేర్లన్నీ దాదాపు లాభాల్లోనే ఉన్నాయి.

Last Updated : Apr 4, 2022, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.