3.40 PM : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1628 పాయింట్లు నష్టపోయి 71,500 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 460 పాయింట్లు కోల్పోయి 21,571 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.
2.25 PM : దేశీయ స్టాక్ మార్కెట్లు మరింతగా నష్టపోతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1427 పాయింట్లు నష్టపోయి 71,701 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 400 పాయింట్లు కోల్పోయి 21,631 వద్ద కొనసాగుతున్నాయి.
12.15 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1260 పాయింట్లు నష్టపోయి 71,868 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 357 పాయింట్లు కోల్పోయి 21,674 వద్ద కొనసాగుతున్నాయి.
10.46 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1039 పాయింట్లు నష్టపోయి 72,089 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 290 పాయింట్లు కోల్పోయి 21,742 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market Today January 17th 2024 : : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ మొదలైన వెంటనే సెన్సెక్స్ 1371 పాయింట్లు, నిఫ్టీ 395 పాయింట్లు వరకు నష్టపోయాయి. తరువాత నష్టాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 710 పాయింట్లు నష్టపోయి 72,417 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 200 పాయింట్లు కోల్పోయి 21,831 వద్ద కొనసాగుతున్నాయి.
మదుపరులు లాభాలు స్వీకరిస్తుండడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం వల్ల స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ కూడా భారీగా పతనం అవుతున్నాయి.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టీసీఎస్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, టైటాన్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్
అంతర్జాతీయ మార్కెట్లు
ప్రస్తుతం ఏషియన్ మార్కెట్లు అయిన సియోల్, షాంఘై, హాంకాంగ్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టోక్యో మార్కెట్లు మాత్రం లాభాలతో కొనసాగుతున్నాయి. మంగళవారం యూఎస్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
కరెక్షన్కు గురయ్యే ఛాన్స్!
కొన్ని అంతర్జాతీయ, జాతీయ ప్రతికూల పరిణామాల వల్ల, సమీప కాలంలో దేశీయ మార్కెట్లు కొద్దిగా బలహీనపడే అవకాశం ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న యూఎస్ బాల్డ్ ఈల్డ్స్ (10 సంవత్సరాల రాబడి 4.4 శాతం) వల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడులు తగ్గవచ్చు. ఇక దేశీయంగా చూసుకుంటే, మన ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది. కార్పొరేట్ రాబడులు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈక్విటీ స్టాక్స్ వాల్యూ ఇప్పటికే బాగా పెరిగింది. అందువల్ల అవి షార్ప్ కరెక్షన్ను గురయ్యే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెరిగిన విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ గణాంకాల ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మంగళవారం రూ.656.57 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
రూపాయి విలువ
Rupee Open 17th January 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 3 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.15గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices 17th January 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.57 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 77.84 డాలర్లుగా ఉంది.
గుడ్ న్యూస్ - భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?
అన్లిమిటెడ్ 5G డేటా, 365 డేస్ వ్యాలిడిటీ- అత్యంత చీప్‌గా రిలయన్స్ జియో కొత్త ప్లాన్