ETV Bharat / business

ఆల్​టైమ్ హై రికార్డులతో ముగిసిన స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్@72,568​ & నిఫ్టీ@21,894 - sensex high record

Stock Market Today 12th January 2024 In Telugu : దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం రికార్డు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 72,568, జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 21,894 దగ్గర ఆల్​టైమ్ హై క్లోజింగ్​లను నమోదు చేశాయి.

Share Market Today 12th January 2024
Stock Market Today 12th January 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 3:09 PM IST

Updated : Jan 12, 2024, 4:56 PM IST

Stock Market Today 12th January 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 847 పాయింట్లు లాభపడి 72,568 వద్ద రికార్డు స్థాయిలో ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 247 పాయింట్లు వృద్ధిచెంది 21,894 వద్ద జీవన కాల గరిష్ఠాలతో స్థిరపడింది.

శుక్రవారం ఒకానొక సమయంలో సెన్సెక్స్​ 72,720 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది. నిఫ్టీ 21,928 వద్ద ఆల్​ టైమ్ హై రికార్డ్​ను నిలకొల్పింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం సహా, ఐటీ స్టాక్స్ భారీ లాభాలు మూటగట్టుకోవడమే ఇందుకు కారణం.

  • లాభపడిన స్టాక్స్​ : ఇన్ఫోసిస్​, టెక్ మహీంద్రా, హెచ్​సీఎల్ టెక్​, టీసీఎస్​, విప్రో, ఎస్​బీఐ, ఎల్ అండ్​ టీ, భారతీ ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంక్​
  • నష్టపోయిన షేర్స్​ : బజాజ్​ ఫిన్​సెర్వ్​, పవర్​గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్​, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్​, ఏసియన్ పెయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​

ఐటీ స్టాక్స్​ ర్యాలీ

  • దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​ నేడు దాదాపుగా 8 శాతం వరకు లాభపడింది. డిసెంబర్​ త్రైమాసికంలో కంపెనీ భారీ లాభాలు ఆర్జించింది. దీనితో మదుపరులు ఇన్ఫోసిస్ స్టాక్స్ కొనుగోలుకు ఎగబడ్డారు.
  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (TCS) 4 శాతం వరకు లాభపడింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ 8.2 శాతం వరకు లాభాలు నమోదు చేయడమే ఇందుకు కారణం.
  • టెక్ మహీంద్రా, విప్రో, హెచ్​సీఎల్ టెక్ కంపెనీలు కూడా గణనీయంగా లాభాలు నమోదు చేశాయి.
  • దేశీయ సెక్టోరల్ ఇండెక్స్​ల్లో, బీఎస్​ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ అత్యధికంగా 5.06 శాతం పెరిగింది. టెక్​ సెక్టార్​ కూడా 4.40 శాతం మేర లాభపడింది.
  • ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఇవాళ మంచి లాభాలను మూటగట్టుకున్నాయి.

మార్కెట్​పై ప్రభావం చూపుతాయా?
శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తరువాత పారిశ్రామిక ఉత్పత్తి (IIP), వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల కానున్నాయి. ఇవి రేపటి దేశీయ మార్కెట్​ ట్రేడింగ్​పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లు
శుక్రవారం ఏసియన్ మార్కెట్లైన సియోల్​, షాంఘై, హాంకాంగ్ నష్టాలతో ముగిశాయి. టోక్యో మార్కెట్లు మాత్రమే లాభాలతో స్థిరపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు ప్రస్తుతం లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

తరలి వెళ్తున్న విదేశీ పెట్టుబడులు
ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం రూ.865 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 2.49 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 79.34 డాలర్లుగా ఉంది.

మెటర్నిటీ బీమాతో ఆర్థిక రక్షణ- పాలసీ తీసుకునేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి!

ఆర్థిక లక్ష్యం నెరవేరాలా? భార్యాభర్తలు పాటించాల్సిన టాప్​-9 ఫైనాన్సియల్​ టిప్స్ ఇవే!

Last Updated : Jan 12, 2024, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.