ETV Bharat / business

Stock Market Today 11th September 2023 : భారీ లాభాలతో ముగిసిన స్టాక్​మార్కెట్లు.. నిఫ్టీ@20,000.. ఆల్​టైమ్ హైరికార్డ్ - nifty 50 top companies

Stock Market Today 11th September 2023 : సోమవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 50 ఆల్​టైమ్ హై లెవల్​ 20,000 పాయింట్లను మొదటిసారి దాటింది. దేశీయ ఆర్థిక వృద్ధిపై మదుపరులు ఆశాజనకంగా ఉండడమే ఇందుకు కారణం.

SHARE Market Today 11th September 2023
Stock Market Today 11th September 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 3:49 PM IST

Updated : Sep 11, 2023, 4:47 PM IST

Stock Market Today 11th September 2023 : దేశీయ స్టాక్​మార్కెట్లు వరుసగా 7వ రోజు కూడా భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 50 మొదటిసారిగా 20,000 పాయింట్లు దాటి ఆల్​టైమ్​ హై రికార్డ్​ను నమోదుచేసింది. దేశీయ పెట్టుబడిదారులు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆశాజనకంగా ఉండడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 528 పాయింట్లు లాభపడి 67,127 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 176 పాయింట్లు వృద్ధి చెంది 19,996 వద్ద స్థిరపడింది.

  • లాభాలు పొందిన షేర్స్​ : విప్రో, టాటాస్టీల్​, మారుతి సుజుకి, ఎస్​బీఐ, టాటా మోటార్స్​, టీసీఎస్​, టైటాన్​, ఇన్ఫోసిస్​
  • నష్టపోయిన స్టాక్స్​ : ఎల్​ అండ్ టీ, బజాజ్​ఫిన్​సెర్వ్​

అన్నీ మంచి శకునములే!
India Stock Market Today : జీ20 సమ్మిట్​ విజయవంతంగా ముగియడం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం కూడా దేశీయ స్టాక్​మార్కెట్లకు కలిసి వచ్చింది. దీనికి తోడు జీఎస్టీ వసూళ్లు పెరగడం, ప్రైవేట్​ కేపిటల్ ఎక్స్​పెండీచర్​, క్రెడిట్​ గ్రోత్​ వృద్ధి చెందడం సహా, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందనే అంచనాలు.. మదుపరుల సెంటిమెంట్​ను బాగా బలపరిచాయి.

నిఫ్టీ 50 ఆల్​టైమ్ హైరికార్డ్
Nifty 50 Hits 20000 Level : సోమవారం నిఫ్టీ 50 మొదటిసారిగా 20,008 పాయింట్ లెవల్​ను టచ్​ చేసి ఆల్​టైమ్ హైరికార్డ్​ను నెలకొల్పింది. చివరికి 19,996.35 పాయింట్ల వద్ద ముగిసింది.

ఆసియా మార్కెట్లు
Asian Markets Today : సోమవారం ఆసియా మార్కెట్లు సియోల్​, షాంగైలు భారీ లాభాలతో ముగియగా.. టోక్యో, హాంకాంగ్ మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్​ ముగించాయి.

యూఎస్​, యూరోపియన్ మార్కెట్స్​
European Markets Today : శుక్రవారం యూఎస్​ మార్కెట్లు లాభాలతో ముగియగా.. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు కూడా లాభాలతో ట్రేడ్​ అవుతున్నాయి.

ముడిచమురు ధరలు
Crude Oil Price Today 11th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.23 శాతం తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 90.35 డాలర్లుగా ఉంది.

Last Updated : Sep 11, 2023, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.