వరుస నష్టాలకు బ్రేక్..
రెండు వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్ పడింది. మంగళవారం రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 777 పాయింట్లు పెరిగి 57 వేల 357 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 247 పాయింట్ల లాభంతో 17 వేల 201 వద్ద సెషన్‌ను ముగించింది.
- లాభనష్టాల్లో.. ఆటో, రియాల్టీ, విద్యుత్ రంగం షేర్లు 2-3 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.75-1.50 శాతం మేర రాణించాయి.
- అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎం అండ్ ఎం భారీగా లాభపడ్డాయి.
- ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్ పతనమయ్యాయి.
- సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 5 మినహా అన్ని షేర్లు మంచి లాభాల్లో ముగిశాయి.
- అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగియడం, ఐరోపా మార్కెట్లు ఏప్రిల్ 26న సానుకూలంగా ప్రారంభమవడం వల్ల దేశీయ సూచీలు దూసుకెళ్లాయి.
- రిలయన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు.. మార్కెట్లు ఊపందుకోవడానికి మరో కారణంగా వ్యాపార నిపుణులు విశ్లేషిస్తున్నారు.