దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 400పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 16వేల దిగువన ట్రేడవుతోంది.
- ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 424 పాయింట్ల నష్టంతో.. 52,753 వద్ద ట్రేడవుతోంది.
- జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ.. 102 పాయింట్లు దిగజారి.. 15,727 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివి.. డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా, లాభాల్లో ట్రేడవుతుండగా.. ఇండస్‌ఇండ్‌బ్యాంక్, బజాజ్‌ఫిన్‌సర్వ్ నష్టాల్లో ఉన్నాయి.
జీవిత కాల కనిష్ఠానికి రూపాయి: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. బుధవారం మార్కెట్లు ప్రారంభమయ్యాక 11 పైసలు నష్టపోయి.. 78.96కు చేరుకుంది. మంగళవారం 48 పైసలు పతనమై 78.85 వద్ద ఉన్న విలువ.. బుధవారం రికార్డు స్థాయిలో నష్టపోయింది.
ఇదీ చదవండి: టాటా వాహనాల ధరలు పెంపు.. చిన్న కార్లకు మారుతి గుడ్‌బై!