Stock Market Close: రష్యా- ఉక్రెయిన్ శాంతి చర్చలతో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 740 పాయింట్లు పెరిగి 58 వేల 684 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 173 పాయింట్ల లాభంతో 17 వేల 498 వద్ద సెషన్‌ను ముగించింది. ఆరంభం నుంచి సూచీలు లాభాల్లోనే కదలాడాయి. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. 58 వేల 176 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. మళ్లీ భారీగా పెరిగి 58 వేల 728 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదుచేసింది. కొద్దిరోజులుగా రాణిస్తున్న లోహ రంగం షేర్లు ఇవాళ 3 శాతం మేర కుదేలయ్యాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఒక శాతం పడిపోయింది.
రాజీ దిశగా రష్యా- ఉక్రెయిన్.. మార్కెట్లలో మళ్లీ మునుపటి జోరు
15:39 March 30
11:38 March 30
స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 678 పాయింట్ల మేర లాభపడింది. ప్రస్తుతం 58,622 వద్ద కదలాడుతోంది.
సెన్సెక్స్ 30 షేర్లలో బజాజ్ ఫైనాన్స్ భారీ లాభాలతో ట్రేడవుతోంది. బ్యాంకింగ్ షేర్లు రాణిస్తున్నాయి. టాటా స్టీల్ సహా పలు షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
మరోవైపు, నిఫ్టీ సైతం భారీ లాభాల్లో ఉంది. 183 పాయింట్లు వృద్ధి చెంది.. 17509 వద్ద ట్రేడవుతోంది.
08:52 March 30
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న శాంతి చర్చలు సానుకూలంగా సాగడం, అమెరికా మార్కెట్లు రాణించడం వంటి కారణాలతో దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు లాభాల బాట పట్టాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 321 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం 58,265 వద్ద కొనసాగుతోంది. అటు నిఫ్టీ సైతం లాభాల్లోనే ఉంది. 107 పాయింట్ల వృద్ధితో.. 17,432 వద్ద ట్రేడవుతోంది.