ETV Bharat / business

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్​ మార్కెట్లు.. ఆటో, ఐటీ షేర్లు డౌన్​

Stock Market Live Updates
Stock Market Live Updates
author img

By

Published : Jun 7, 2022, 10:02 AM IST

Updated : Jun 7, 2022, 3:43 PM IST

15:34 June 07

భారత స్టాక్​మార్కెట్లు మంగళవారం సెషన్​లో నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 567 పాయింట్లు కోల్పోయి 55,107కు చేరగా ఎన్​ఎఈ నిఫ్టీ 153 పాయింట్లు తగ్గి 16,416 వద్ద స్థిరపడింది. ఆటో, ఎఫ్​ఎంసీజీ, ఐటీ, రియల్​ఎస్టేట్​ సెక్టార్ల షేర్లు 1 శాతం తగ్గాయి. మరోవైపు ఆయిల్​ అండ్​ గ్యాస్​, విద్యుత్​ రంగాలకు సంబంధించిన షేర్లను కొనుగోలు చేసేందకు మదుపర్లు ఆసక్తి చూపించారు.

మార్కెట్లు మొదలైన సమయానికి 55,373 వద్ద ఉన్న సెన్సెక్స్​ నష్టాల్లో ట్రేడయింది. గరిష్ఠంగా కేవలం 14 పాయింట్లు పెరిగి 55,387కు చేరిన సెన్సెక్స్​.. ఒకానొక దశలో కనిష్ఠంగా 54,882కు చేరింది. నేషనల్​ స్టాక్​ ఎక్స్ఛెంజీలో కూడా ఇదే పరిస్థితి. 16,469 వద్ద ప్రారంభమైన సూచీలు.. 16,487 గరిష్ఠాన్ని నమోదు చేయగా.. ఓ దశలో 16,347 కనిష్టానికి చేరుకున్నాయి.

  • ఎన్​టీపీసీ, మారుతి, మహీంద్రా అండ్​ మహీంద్రా, భారతీ ఎయిర్​టెల్, ఎస్​బీఐన్​ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
  • టైటాన్, యూపీఎల్​, డాక్టర్​ రెడ్డీస్​, బ్రిటానియా, ఎల్​టీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

11:38 June 07

మరింత కిందకు: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్​ ఓ దశలో 800 పాయింట్లకుపైగా పడిపోయింది. ప్రస్తుతం 700 పాయింట్ల నష్టంతో 55 వేల మార్కు దిగువకు చేరింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 370 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్​ 30 ప్యాక్​లో దాదాపు అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఓఎన్​జీసీ, కోల్​ ఇండియా, బీపీసీఎల్​, ఎన్​టీపీసీ, హీరో మోటోకార్ప్​ మాత్రమే స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. టైటాన్​ కంపెనీ, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, యూపీఎల్​, ఎల్​ అండ్​ టీ డీలాపడ్డాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలే మార్కెట్లలో నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

09:52 June 07

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు.. సెన్సెక్స్​ 500, నిఫ్టీ 150 మైనస్​

Stock Market Live Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 550 పాయింట్లకుపైగా కోల్పోయి.. 55 వేల 100 ఎగువన కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 165 పాయింట్ల పతనంతో 16 వేల 400 వద్ద ఉంది. ఓఎన్​జీసీ, కోల్​ ఇండియా, ఎన్​టీపీసీ, హిందాల్కో, బీపీసీఎల్​ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. టైటాన్​ కంపెనీ, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, హెచ్​యూఎల్​, ఏషియన్​ పెయింట్స్​, సన్​ఫార్మా అత్యధికంగా నష్టపోయాయి.
ఎఫ్​ఎంసీజీ, ఫార్మా, ఐటీ, రియాల్టీ రంగం షేర్లు తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ఐరోపా మార్కెట్లు నిన్న లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు దాదాపు అన్నీ ఇవాళ.. నష్టాల్లోనే ఉన్నాయి. ఆస్ట్రేలియా రిజర్వు బ్యాంక్‌ నేడు రేట్ల పెంపుపై నిర్ణయం వెలువరించనుంది. దేశీయంగానూ ఆర్‌బీఐ రెపోరేటును పెంచే అవకాశం ఉందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 120 డాలర్ల దిగువకు చేరింది.

Last Updated : Jun 7, 2022, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.