స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే నాటికి సెన్సెక్స్ 33 పాయింట్లు వృద్ధి చెంది 55,702 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 5 పాయింట్ల పెరిగి 16,682 వద్ద స్థిరపడింది. ఓ దశలో దాదాపు 900 పాయింట్ల మేర పెరిగిన సెన్సెక్స్.. భారీగా తగ్గింది. చివరకు సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. పవర్, ఐటీ రంగాలు లాభాలను నమోదు చేయగా.. రియల్ ఎస్టేట్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా సూచీలు తీవ్రంగా నష్టపోయాయి.
- సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ , హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టాటా స్టీల్, కొటాక్ బ్యాంక్, టీసీఎస్, హెడ్ఎఫ్సీ, ఐసీఐసీఐ షేర్లు లాభాలు గడించాయి. మారుతి, హెడ్ఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా ,టైటాన్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
- నిఫ్టీలో టెక్ మహీంద్రా, హీరో మోటో, ఇన్ఫీ, హెచ్‌సీఎల్ టెక్, విప్రో లాభాలు ఆర్జించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్రిటానియా, టాటా, సన్‌ఫార్మా షేర్లు నష్టాలతో ముగిశాయి.