ETV Bharat / business

రోజంతా పాజిటివ్​.. ఆఖర్లో రివర్స్​.. సెన్సెక్స్​ 700, నిఫ్టీ 215 డౌన్​ - దేశీయ సూచీలు

Stock Market Closing: మంగళవారం సెషన్​లో స్టాక్​ మార్కెట్లు నష్టపోయాయి. ఆఖరి అరగంటలో తీవ్ర ఒడుదొడుకులతో సెన్సెక్స్​ 700 పాయింట్లకుపైగా పడిపోయింది. నిఫ్టీ 17 వేల మార్కు దిగువకు చేరింది.

Stock Market Closing
Stock Market Closing
author img

By

Published : Apr 19, 2022, 4:02 PM IST

Updated : Apr 19, 2022, 4:35 PM IST

Stock Market Closing: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 704 పాయింట్లు కోల్పోయి.. 56 వేల 463 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 215 పాయింట్ల నష్టంతో 16 వేల 959 వద్ద సెషన్​ను ముగించింది. ఐటీ, ఎఫ్​ఎంసీజీ, విద్యుత్​, రియాల్టీ రంగాల షేర్లు కుదేలయ్యాయి. మొత్తంగా 2216 షేర్లు డీలాపడ్డాయి. 1111 షేర్లు రాణించాయి. 118 షేర్లలో ఎలాంటి మార్పూ లేదు.

దేశీయంగా ద్రవ్యోల్బణం, అమెరికాలో వడ్డీరేట్ల పెంపు, ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ భయాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిష్క్రమణ, బాండ్ల రాబడుల పెరుగుదల, చమురు ధరలు ఎగబాకడం వంటి అంశాలు మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. కిందటి సెషన్​లో భారీ పతనాన్ని చవిచూసిన ఐటీ షేర్లు నేడు కూడా అదే బాటలో పయనించాయి. ఇంధన రంగ షేర్లు ఈరోజు భారీగా లాభపడ్డాయి.

తొలుత దాదాపు 200 పాయింట్లకుపైగా లాభంతో సెన్సెక్స్​ దాదాపు సెషన్​ మొత్తం సానుకూలంగానే ట్రేడయింది. 300 పాయింట్ల లాభంతో 57 వేల 464 పాయింట్ల వద్ద సెషన్​ గరిష్ఠాన్ని తాకింది. ఆఖరి అరగంటలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఓ దశలో 1100 పాయింట్లకుపైగా కోల్పోయి.. 56 వేల 9 వద్ద సెషన్​ కనిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 704 పాయింట్ల నష్టంతో ముగించింది. గత సెషన్​లోనూ సూచీలు భారీగా పడిపోయాయి. సెన్సెక్స్​ 1172, నిఫ్టీ 302 పాయింట్లు పతనమైంది.

లాభనష్టాల్లో ఇవే: హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​ అత్యధికంగా నష్టపోయాయి. హెచ్​డీఎఫ్​సీ 5.45 శాతం, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ 4.81 శాతం పడిపోయాయి. ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఇన్ఫోసిస్​, టెక్​ మహీంద్రా పతనమయ్యాయి. అపోల్​ హాస్పిటల్స్​ 5.75 శాతం దూసుకెళ్లింది. కోల్​ ఇండియా, రిలయన్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, బీపీసీఎల్​, ఎస్​బీఐ లాభపడ్డాయి. బీఎస్​ఈ మిడ్​, స్మాల్​ క్యాప్​ సూచీలు ఒక శాతం మేర పడిపోయాయి. ఆయిల్​ అండ్​ గ్యాస్​ సెక్టార్​ సానుకూలంగా ట్రేడయింది.

ఇవీ చూడండి: బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన ఎస్​బీఐ.. ఈఎంఐలు మరింత భారం

స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. తగ్గిన బిట్​ కాయిన్ విలువ

Last Updated : Apr 19, 2022, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.