ETV Bharat / business

66వేలకు చేరిన సెన్సెక్స్.. ఆల్​టైమ్​ హై రికార్డులతో ముగిసిన స్టాక్ మార్కెట్లు - nse sensex today price

Stock Market All Time High Close : దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​(శుక్రవారం) ఆల్​టైమ్ రికార్డు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 502 పాయింట్లు లాభపడి.. 66,060 వద్ద ముగిసింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 150 పాయింట్లు ఎగబాకి.. 19,564 వద్ద స్థిరపడింది.

stock market all time high close
stock market all time high close
author img

By

Published : Jul 14, 2023, 4:00 PM IST

Updated : Jul 14, 2023, 5:13 PM IST

Stock Market All Time High Close : దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతపు సెషన్​(శుక్రవారం) ఆల్​టైమ్ రికార్డు లాభాలతో ముగిశాయి. ఐటీ షేర్లు కొనుగోలు, అమెరికా మార్కెట్ల ప్రభావం, విదేశీ మదుపర్లు పెట్టుబడులకు మొగ్గు చూపడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ప్రారంభం నుంచే ఊపందుకున్నాయి. ఈ క్రమంలో వారాంతపు సెషన్​లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్​టైమ్ హై రికార్డు లాభాలను చూశాయి.

Stock Market Closed Today : శుక్రవారం ఉదయం 65,650 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. కాసేపటికే లాభాల బాట పట్టింది. ఆఖరి అర గంటలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ మరింత జోరును చూపించి 502 పాయింట్లు లాభపడి.. 66,060 వద్ద స్థిరపడింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ కూడా ఉదయం స్వల్వ లాభాలతో ప్రారంభమై.. ఆఖరి అరగంటలో భారీగా పుంజుకుని.. 150 పాయింట్ల లాభంతో 19,564 వద్ద నిలిచింది.

లాభాల్లోని షేర్లు ఇవే..
టీసీఎస్, టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, టాటా స్టీల్​, ఏషియన్ పెయింట్స్​, నెస్లే, ఎల్​అండ్​టీ, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నష్టాల్లోని షేర్లు ఇవే..
బజాజ్ ఫిన్​సర్వ్, రిలయన్స్, ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, మారుతీ, పవర్ గ్రిడ్, టైటాన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

రూపాయి విలువ..
Rupee Value In Dollar Today : అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 8 పైసలు క్షీణించి.. 82.16 వద్ద ముగిసింది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol and Diesel Prices : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది.

Last Updated : Jul 14, 2023, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.