ETV Bharat / business

Stock Market Closed on 23 October 2023 : సెన్సెక్స్​ 825 పాయింట్లు పతనం.. భారీ నష్టాలకు కారణాలివే..

Stock Market Closed on 23 October 2023 : సోమవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీగా నష్టాలు మూటగట్టుకున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 825 పాయింట్లు, జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 260 పాయింట్లు మేర నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తీవ్రమైన ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం.

stock market close today
Stock Market Closes Red
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 3:56 PM IST

Updated : Oct 23, 2023, 4:35 PM IST

Stock Market Closed on 23 October 2023 : సోమవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇజ్రాయెల్​, హమాస్​ మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతుండడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తీవ్రమైన ప్రతికూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం. వీటికి తోడు గ్లోబల్ మార్కెట్​లో ముడిచమురు ధరలు భారీగా పెరగడం కూడా.. దేశీయ మార్కెట్లపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. దీనితో వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ స్టాక్​మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 825 పాయింట్లు నష్టపోయి 64,571 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 260 పాయింట్లు కోల్పోయి 19,281 వద్ద స్థిరపడింది.

  • లాభపడిన షేర్స్​ : బజాజ్​ ఫైనాన్స్ లిమిటెడ్​, ఎం అండ్ ఎం
  • నష్టపోయిన స్టాక్స్​ : టాటా స్టీల్​, టీసీఎస్​, టాటా మోటార్స్, విప్రో, ఎస్​బీఐ, మారుతి సుజుకి, రిలయన్స్​

ఆల్​ సెక్టార్స్ ఇన్ లాస్​​!
వాస్తవం చెప్పాలంటే.. దేశంలోని దాదాపు అన్ని రంగాలు కూడా నష్టపోయాయి. బ్యాంకింగ్​, మెటల్​, ఆయిల్​, టెక్ షేర్స్ అన్నీ తీవ్రమైన నష్టాలను చవిచూశాయి..

విదేశీ పెట్టుబడులు పెరిగాయి.. కానీ
స్టాక్ ఎక్స్ఛేంజ్​ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు శుక్రవారం రూ.456.21 కోట్ల విలువైన దేశీయ ఈక్విటీలను కొనుగోలు చేశారు. అయితే తాజాగా యూఎస్​ బాండ్ ఈల్డ్స్​.. వడ్డీరేట్లు మరింత పెరిగిన నేపథ్యంలో.. ఈ విదేశీ పెట్టుబడులు మరలా తరలివెళ్లే అవకాశం బాగా పెరిగింది.

గ్లోబల్ మార్కెట్స్​
Global Market News Today 23 October 2023 : సోమవారం సియోల్​, టోక్యో, షాంఘై మొదలైన ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ముగిశాయి. ప్రస్తుతానికి యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు కూడా నష్టాలతోనే ముగిశాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

ముడిచమురు ధరలు
Crude Oil Prices 23 October 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.04 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 92.18 డాలర్లుగా ఉంది.

Bank Account OTP fraud : బ్యాంకింగ్ అలర్ట్.. ఓటీపీ కూడా కొట్టేస్తున్నారు! ఇలా చేస్తేనే సేఫ్​

Tata Waiting Period October 2023 : టాటా కారు బుక్ చేశారా?.. డెలివరీకి ఇంకా ఎంత కాలం వెయిట్ చేయాలంటే..

Last Updated : Oct 23, 2023, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.