ETV Bharat / business

స్టాక్ మార్కెట్​ ఆల్​ టైమ్​ రికార్డ్.. దలాల్​ స్ట్రీట్​లో సంబరాలు

Share market Close : శుక్రవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. విదేశీ పెట్టుబడులు తరలిరావడం సహా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీయడమే ఇందుకు కారణం.

stock market close news
stock market news
author img

By

Published : Jun 30, 2023, 4:31 PM IST

Updated : Jun 30, 2023, 5:00 PM IST

Stock Market Closes all time high : దేశీయ స్టాక్​ మార్కెట్లు శుక్రవారం ఆల్​ టైమ్​ రికార్డ్​ హైతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీయడం సహా, విదేశీ పెట్టుబడులు తరలిరావడం కూడా దేశీయ మార్కెట్లకు కలిసివచ్చింది. బయ్యర్లు ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​, రిలయన్స్​, టీసీఎస్​ షేర్లు కొనడానికి ఉత్సాహం చూపించడం కూడా మరొక కారణం.

ఆల్​ టైమ్​ రికార్డ్ హై
ఓ సందర్భంలో బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 853.16 పాయింట్లు చేరి, ఆల్​ టైమ్​ ఇంట్రా డే​ రికార్డ్​ హై 64,768 వద్ద ట్రేడయ్యింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 216 పాయింట్లు వృద్ధి ఆల్​ టైమ్​ ఇంట్రాడే రికార్డ్​ హై 19,201 పాయింట్లకు చేరింది.
చివరకు.. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 803.14 పాయింట్లు లాభపడి 64,718 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 216 పాయింట్లు వృద్ధి చెంది 19,189 పాయింట్లు వద్ద స్థిరపడింది.

లాభాలతో ముగిసిన స్టాక్స్​ : ఎమ్​ అండ్​ ఎమ్​, ఇన్ఫోసిస్​, ఇండస్​ఇండ్​ బ్యాంకు, సన్​ఫార్మా, టీసీఎస్​, రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్​, విప్రో, టైటాన్​, ఎస్​బీఐ, ఏసియన్​ పెయింట్స్​, భారతీ ఎయిర్​టెల్​, ఐటీసీ, టాటాస్టీల్​

నష్టాలతో ముగిసిన షేర్లు : ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంకు

"అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండడం, నైరుతి రుతుపవనాలు పురోగమించడం దేశీయ స్టాక్​ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. అలాగే ప్రథమ త్రైమాసికంలో దేశీయ జీడీపీ వృద్ధి అంచనాలు మెరుగ్గా ఉండడం, నిరుద్యోగం తగ్గడం కూడా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు దోహదం చేశాయి. యూఎస్​ ఫెడరల్​ రిజర్వ్​ వడ్డీ రేట్లు పెంపు విషయంలో సంయమనం పాటించడం కూడా భారత్​లో విదేశీ పెట్టుబడులు పెరగడానికి కారణమైంది. "
- వినోద్ నాయర్​, హెడ్​ ఆఫ్​ రీసెర్చ్​, జియోజిత్​ ఫైనాన్సియల్​ సర్వీసెస్​

అంతర్జాతీయ మార్కెట్లు
Global Markets close : గురువారం యూఎస్​ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. శుక్రవారం ఆసియా మార్కెట్లు.. సియోల్​, షాంగై లాభాలతో ముగియగా.. టోక్యో, హాంగ్​కాంగ్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

చమురు ధరలు
Crude oil price today : అంతర్జాతీయ మార్కెట్​లో క్రూడ్​ ఆయిల్​ ధరలు 0.61 శాతం మేరకు పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​​ ముడి చమురు ధర 74.79 యూఎస్​ డాలర్లుగా ఉంది.

రూపాయి విలువ
Rupee closing Price today : అంతర్జాతీయంగా రూపాయి విలువ దాదాపు స్థిరంగా ఉంది. రూపాయి మారకపు విలువ అమెరికన్ డాలర్​తో పోల్చితే రూ.82.03 వద్ద స్థిరపడింది.

Last Updated : Jun 30, 2023, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.