ETV Bharat / business

SIP Plan : రోజూ రూ.100 చొప్పున ఆదా చేస్తే.. ఆ సమయానికి కోటీశ్వరులు కావచ్చు!

SIP Mutual Funds : రోజూ రూ.100 ఆదా చేసి సిప్​ పద్ధతిలో మీరు ఈ మొత్తాన్ని పెట్టుబడి పెడితే కొద్ది కాలంలోనే మీరు కోటీశ్వరులుగా మారే అవకాశం కల్పిస్తుంది మ్యూచువల్​ ఫండ్స్​. అదెలాగంటే..

Invest Rs 100 per Day and Retire With Over Rs 1 Crore In SIP
సిప్​ పద్ధతిలో రోజుకు రూ.100 ఆదా చేయండి.. ఆ టైమ్​కు రూ.కోటి పొందండి..
author img

By

Published : Jul 23, 2023, 7:17 PM IST

Mutual Funds SIP : మనం సంపాదించే మొత్తంలో నుంచి రోజూ కొంత డబ్బును ఆదా చేస్తే కొంత కాలానికే మనం కోటీశ్వరులుగా మారే అవకాశం కల్పిస్తుంది మ్యూచువల్​ ఫండ్స్​లోని 'సిప్' పద్ధతి. సిప్​ అంటే 'సిస్టమాటిక్​ ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్'​. రోజుకు రూ.100 పొదుపు చేసి.. మ్యూచువల్​ ఫండ్స్​లో సిప్​ పద్ధతిలో ఇన్వెస్ట్​ చేస్తే కొన్నేళ్లకే పెద్ద మొత్తంలో రిటర్న్స్​ను సంపాదించవచ్చు. ఇలా రోజూ వంద రూపాయలను ఆదా చేసి ప్రతి నెలా చిన్న మొత్తంలో మీరు మ్యూచువల్​ ఫండ్స్​లో మదుపు చేస్తే గనుక 30 సంవత్సరాల తర్వాత మీరు రూ.కోటికిపైనే రాబడిని పొందవచ్చు.

SIP Interest Rate : ఉదాహరణకు.. మీరు రోజూ రూ.100 ఆదా చేస్తే ప్రతి నెలా మీ దగ్గర రూ.3000 జమ అవుతుంది. ఈ మొత్తాన్ని(రూ.3000) మీరు ప్రతి నెలా సిప్​ విధానంలో ఇన్వెస్ట్​ చేస్తే గనుక దానిపై మీకు 12 శాతం యానువల్​ రిటర్న్స్​ జమ అవుతాయి. ఆ మొత్తం కాస్త 30 ఏళ్లల్లో రూ.1,05,89,741గా మారుతుంది. అంటే దాదాపుగా కోటి ఆరు లక్షలు ఆ సమయానికి మీ చేతికి అందుతాయి.

SIP Investment : అయితే ఇందులో మీ పెట్టుబడి కేవలం రూ.10,80,000 మాత్రమే. కాగా 30 ఏళ్లు వచ్చే సరికి ఈ మొత్తం రూ.95,09,741(అంచనా)గా ఉంటుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీరు పెట్టిన పెట్టుబడిపై వచ్చే రాబడి విషయంలో ఎటువంటి హామీ ఉండదు. ఎందుకంటే మ్యూచువల్​ ఫండ్స్​లోని సిప్​ పద్ధతిలో మదుపు చేయడంమంటేనే రిస్క్​తో కూడుకున్న అంశం. అందుకే మార్కెట్ ఒడుదొడుకులను బట్టి కూడా మీ రాబడి విషయంలో వ్యత్యాసం ఉండవచ్చు.

రోజువారీ సిప్​ ఆప్షన్​..
SIP Plan : అనేక మ్యూచువల్ ఫండ్​హౌస్‌లు రోజువారీ సిప్​ ప్లాన్​లను కూడా మదుపరులకు అందిస్తున్నాయి. మ్యూచువల్​ ఫండ్స్​లో రోజూవారీ పద్ధతిలో కూడా క్రమంగా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్​ చేయవచ్చు. దీన్నే డైలీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్​) అని కూడా అంటారు. ఈ విధానం పెట్టుబడిదారుల ఆర్థిక అవసరాల మేరకు మదుపు చేసేందుకు వీలుగా ఉండటమే కాకుండా తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో ఏకమొత్తంగా(లంప్సమ్​)అమౌంట్​ను పొందవచ్చు.

SIP Mutual Funds Returns : అయితే పెట్టుబడిదారులు ఈ రకమైన పెట్టుబడి ప్రణాళికలో చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో పెద్దమొత్తంలో లాభం పొందుతున్నారని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎమ్​ఎఫ్​ఐ) విడుదల చేసిన ఓ నివేదిక చెబుతోంది. ఈ పద్ధతిని ఎందుకు ఎంచుకోవచ్చనే దానికి గల కారణాలను కూడా విశ్లేషించింది.

మేలో సిప్​ జోరు..
AMFI SIP Data : ఈ మధ్యకాలంలో చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్​ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎమ్​ఎఫ్​ఐ) వెల్లిడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మే నెలలో స్టాక్​ మార్కెట్​లు పుంజుకోవడం వల్ల ఎక్కువమంది మ్యూచువల్​ ఫండ్స్​లో సిప్​ పద్ధతిలోనే పెట్టుబడులు పెట్టారని ఏఎమ్​ఎఫ్​ఐ నివేదించింది. దీంతో మే నెలలో ఇన్​ఫ్లో రూ.14,749 కోట్లతో గరిష్ఠ స్థాయికి చేరుకుందని ప్రకటించింది. మ్యూచువల్​ ఫండ్స్​ ఇండస్ట్రీ నిర్వహించే ఆస్తులు కూడా మే నెలలో మొత్తం రూ.43.2 లక్షల కోట్లతో గరిష్ఠ స్థాయికి చేరిందని.. రూ.45,234 కోట్ల మేర నికర ఇన్‌ఫ్లో లిక్విడ్ ఫండ్స్​ రూపంలో వచ్చాయని ఏఎమ్​ఎఫ్​ఐ ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే గత మార్చిలో సిప్​ ఇన్​ఫ్లో రూ.14,276 కోట్లుగా ఉంది. ఇది మునుపటి ఏడాదితో పోలిస్తే అధికమని ఏఎమ్​ఎఫ్​ఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్​లో సిప్​ ఇన్​ఫ్లో రూ.13,728 కోట్లకు తగ్గగా.. మే నెలలో రూ.14,749 కోట్ల మేర ఇన్​ఫ్లో మ్యూచువల్​ ఫండ్స్​ సిప్​ రూపంలో వచ్చాయని ఏఎమ్​ఎఫ్​ఐ నివేదించింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరం మే నెలలో కొత్తగా 25 లక్షల సిప్​ ఖాతాలు పెట్టుబడిదారులు తెరిచారని.. దీనితో వీటి సంఖ్య 6.5 కోట్లకు చేరిందని, ఇది ఆల్​టైమ్​ హై అని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.