దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం సరికొత్త రికార్డు నెలకొల్పాయి. మదుపరులు కొనుగోళ్లపై దృష్టి పెట్టడం.. రిలయన్స్, విప్రో, మారుతీ సంస్థలు లాభాల బాట పట్టడం వల్ల రెండు సూచీలు జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 62, 294 పాయింట్లకు చేరుకుంది. జాతీయ స్టాక్ ఎక్స్చెంజి సూచీ నిఫ్టీ 29 పాయింట్లు లాభపడి 18, 513 పాయింట్ల వద్ద రికార్డుస్థాయి ముగింపు నమోదు చేసింది.
లాభనష్టాల్లోనివి
టీసీఎస్, ఐటీసీ, విప్రో, ఎం అండ్ ఎం, మారుతీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభపడగా.. హెచ్‌సీఎల్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.
ఇవీ చదవండి: మీ డిపాజిట్లకు అధిక వడ్డీ కావాలా?.. అయితే ఇలా చేయండి!
ఆసియా కుబేరుల జాబితాలో బ్రిటన్ ప్రధాని సునాక్, అక్షత.. తొలిసారిగా..