ETV Bharat / business

రూ.80 లక్షల కోట్లకు చిప్‌సెట్‌ మార్కెట్.. డిజైన్ సేవలకూ గిరాకీ - డిజైనింగ్‌లో దేశీయంగా లక్ష మంది

సెమీ కండక్టర్‌ చిప్‌సెట్లకు గిరాకీ బాగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల మార్కెట్‌ 2030 నాటికి సుమారు రూ.80 లక్షల కోట్లకు చేరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, చిప్‌ డిజైన్‌లో ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తుండగా.. లక్ష మందికి పైగా చిప్‌ డిజైన్‌ ఇంజినీర్లు పనిచేస్తున్నారు.

Etv semiconductor chip sets demand increasing in india
semiconductor chip sets demand increasing in india
author img

By

Published : Sep 4, 2022, 7:18 AM IST

కార్లు, బైక్‌లు, ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల రంగాల నుంచి సెమీ కండక్టర్‌ చిప్‌సెట్లకు గిరాకీ అనూహ్యంగా పెరుగుతోంది. కొవిడ్‌ పరిణామాల వల్ల, గతేడాది గిరాకీకి అనుగుణంగా వీటి సరఫరాలు సాధ్యం కాలేదు. ఇప్పటికీ పరిశ్రమల అవసరాలకు సరిపడా సెమీకండక్టర్ల సరఫరా ఉండటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ల మార్కెట్‌ 2030 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.80 లక్షల కోట్ల)కు చేరుతుందని హైదరాబాద్‌కు చెందిన మాస్‌ చిప్‌ టెక్నాలజీస్‌ వార్షిక సమావేశంలో (ఏజీఎం)లో సీఈఓ వెంకట్‌ సింహాద్రి అభిప్రాయపడ్డారు. ఈ విభాగంలో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం భారత్‌కు ఉందన్నారు. మనదేశంలో వీఎల్‌ఎస్‌ఐ/ ఎంబెడెడ్‌ డిజైన్‌ సర్వీసెస్‌ మార్కెట్‌ వచ్చే ఏడాదిలో 7.37 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రధానంగా వాహన, డేటా స్టోరేజ్‌, వైర్‌లెస్‌ విభాగాల నుంచి అధిక డిమాండ్‌ ఉంటుందని సమాచారం.

డిజైనింగ్‌లో దేశీయంగా లక్ష మంది
చిప్‌ డిజైన్‌లో ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లక్ష మందికి పైగా చిప్‌ డిజైన్‌ ఇంజినీర్లు పనిచేస్తున్నారు. దేశీయ సంస్థల్లో విప్రో, హెచ్‌సీఎల్‌, క్యాప్‌జెమినీ, ఎల్‌అండ్‌టీ ఈ రంగంలో అగ్రగామిగా ఉన్నాయి. ఈ విభాగంలో మనదేశం వచ్చే కొంతకాలం పాటు రెండంకెల వృద్ధి నమోదు చేస్తుందని భావిస్తున్నారు. సెమీకండక్టర్ల కోసం మన దేశం దిగుమతులపైనే ఆధారపడి ఉంది.

ఇటీవలి పరిణామాలకు తోడు, ఎలక్ట్రానిక్స్‌ తయారీలో భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రభుత్వం.. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.80,000 కోట్ల) పథకాన్ని ప్రకటించింది. దీనివల్ల చిప్‌లు, డిస్‌ప్లే, చిప్‌ డిజైన్‌ విభాగాల్లో కొత్త సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఏర్పడింది. కనీసం 100 కొత్త యూనిట్లు ఏర్పాటవుతాయని ప్రభుత్వ వర్గాల అంచనా.

అమెరికా రెండు దశాబ్దాలుగా సెమీకండక్టర్‌ పరిశోధన- డిజైనింగ్‌ సేవలకు పరిమితమై, ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించలేదు. ఫలితంగా తైవాన్‌, కొరియా, జపాన్‌, చైనాలో సెమీకండక్టర్‌ ఉత్పత్తి కార్యకలాపాలు పెరిగాయి. తాజాగా అమెరికా ప్రభుత్వం సెమీకండక్టర్‌ ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించింది. ఇందుకోసం 'చిప్స్‌ యాక్ట్‌' ను ఆమోదించింది. ఇంటెల్‌ అతిపెద్ద చిప్‌సెట్‌ తయారీ ప్లాంటును నిర్మించనుంది. అమెరికాలో సెమీకండక్టర్‌ ఉత్పత్తి విభాగంలో 52 బి.డాలర్ల (సుమారు రూ.4.16 లక్షల కోట్ల) పెట్టుబడులు సమకూరతాయని అంచనా. ఈ పరిణామాలను విశ్లేషిస్తే వచ్చే కొన్నేళ్ల పాటు సెమీకండక్టర్ల రంగం వేగంగా విస్తరించనుందని స్పష్టమవుతోంది. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించడానికి మనదేశమూ సిద్ధం కావడం ఆసక్తికర పరిణామంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

20 సంస్థలకు సేవలు
మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 అగ్రగామి సెమీకండక్టర్‌ కంపెనీలకు సేవలు అందిస్తోంది. దాదాపు వెయ్యి మంది సిబ్బందితో వేగంగా తమ సేవలను విస్తరిస్తోంది. పీఎల్‌ఐ పథకంలో పాల్గొనే అవకాశం తమకు లేదని, దీనికి బదులుగా డీఎల్‌ఐ పథకంతో లబ్ధి పొందేందుకు వీలుగా సెమీకండక్టర్‌ ఉత్పత్తులు / మేధోసంపత్తి (ఐపీ) హక్కులపై దృష్టి సారిస్తున్నట్లు మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ తెలిపింది.

ఇవీ చదవండి: లోన్​ యాప్​లపై ఈడీ కొరడా.. పేటీఎం, రేజోర్​పే పై సోదాలు..

ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​.. ఆరోస్థానానికి పడిపోయిన బ్రిటన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.