ETV Bharat / business

Securing Your Future - Why Term Insurance Plans Matter : మీకు బీమా ఉందా..? టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా..?? - టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి

Securing Your Future - Why Term Insurance Plans Matter : మీరు ఇప్పటివరకు ఎలాంటి జీవిత బీమా తీసుకోలేదా? కొత్తగా ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇప్పుడే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయండి. ఈ ప్లాన్​ను ఎందుకు? బెనిఫిట్స్ ఏంటీ? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Term Insurance Plan Details in Telugu
Securing Your Future - Why Term Insurance Plans Matter
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 11:36 AM IST

Securing Your Future - Why Term Insurance Plans Matter : కొవిడ్ మహమ్మారి తర్వాత చాలామందికి బీమాపై అవగాహన పెరిగింది. దీని ప్రాధాన్యాన్ని గుర్తించి ఆర్థిక ప్రణాళికలో భాగం చేసుకుంటున్నారు. దీంతో జీవిత బీమా(Life Insurance) పథకాలకు గిరాకీ పుంజుకుంటోంది. అయితే.. గతంలో పెట్టుబడులతో కూడిన జీవిత బీమా (ఎండోమెంట్‌) పాలసీలను భారీగా కొనుగోలు చేసేవారు. అనేక ప్రైవేట్‌ బీమా కంపెనీల రాకతో.. ఇప్పుడు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. చిన్న వయసులోనే ఈ పాలసీ కొనుగోలు చేయడం మంచిది. ఇంతకీ.. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఎందుకు వీటిని కొనుగోలు చేయాలి..?? వీటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎవరెవరు దీనిని తీసుకోవచ్చు? అన్న వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే..?

What is Term Insurance Plan in Telugu : టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పాలసీదారు కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణను అందించే స్వచ్ఛమైన జీవిత బీమా పథకం. ఇది నిర్దిష్ట కాలానికి తీసుకునే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పాలసీ కాల వ్యవధిలో పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణిస్తే.. నామినీ/లబ్ధిదారుకు బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది కంపెనీ. అయితే.. బీమా చేసిన వ్యక్తి మరణిస్తేనే ఈ ప్లాన్ కింద ప్రయోజనం అందిస్తారు. పాలసీదారు జీవించి ఉంటే.. ఎటువంటి ప్రయోజనమూ చెల్లించరు. అందుకే.. వీటిని 'ప్యూర్ ప్రొటెక్షన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్' అని అంటారు.

SBI General Insurance New Health Policy : సూపర్ హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ.. అన్​లిమిటెడ్ రీఫిల్స్​.. 3X బెనిఫిట్స్​!

టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు కొనాలి..?

Why Should You Buy Term Insurance in Telugu : కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తి ఒక్కరే ఉంటే.. అలాంటి వారు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోతే.. ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రావొచ్చు. అందువల్ల.. కుటుంబ పెద్ద లేకపోయినా.. అతనిపై ఆధారపడిన వారి ఆర్థిక బాధ్యతలను తీర్చడానికి ప్యూర్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

How to Claim LPG Insurance Policy: గ్యాస్​ సిలిండర్​ పేలితే ఇన్సూరెన్స్​.. ఎలా పొందాలో మీకు తెలుసా..?

ఆస్తులను రక్షించుకోవడానికి : కుటుంబ పెద్ద.. రుణాల ద్వారా కార్యాలయం, వాహనం లేదా ఇల్లు వంటి ఆస్తులను కొనుగోలు చేయడం.. లేదా నిర్మించి ఉండవచ్చు. వారు మరణిస్తే.. ఆ రుణాల బరువు కుటుంబం మీద పడకుండా.. టర్మ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.

ఉదాహరణకు.. 25 ఏళ్ల వ్యక్తి 60 సంవత్సరాల కాలవ్యవధికి నెలకు రూ.1,000 నుంచి 1,200 ప్రీమియం చెల్లిస్తే.. రూ.1 కోటి వరకు పాలసీదారుడు టర్మ్‌ బీమాను పొందొచ్చు. పాలసీ వ్యవధి ఉన్నంతకాలం ఈ స్థిర మొత్తాన్ని చెల్లించాలి. ఈ గడువులో పాలసీదారు ఏ కారణంచేతైనా మరణిస్తే.. బీమా సొమ్ము మొత్తం అతని కుటుంబానికి అందుతుంది.

Life Insurance Vs Term Insurance : లైఫ్ ఇన్సూరెన్స్ VS ట‌ర్మ్ ఇన్సూరెన్స్.. ఏది బెస్ట్ ఆప్షన్​?

Group Policy To Single Policy : కంపెనీ ఇచ్చే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.. ఉద్యోగం మానేశాక కూడా కొనసాగాలంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.