ETV Bharat / business

సెబీ నుంచి మార్కెట్‌ సమాచారం!.. పెట్టుబడుల్లో మూక ధోరణి తొలగించేందుకే - సెబీ

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మదుపర్లు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా 'మార్కెట్‌ నష్టభయం కారణాల వివరాల'ను తరచు వెల్లడించేలా సన్నాహాలు చేస్తోంది. నష్టభయం అంశాలన్నింటినీ సంస్థలు వెల్లడించాల్సిందేనని పేర్కొంది.

సెబీ
సెబీ
author img

By

Published : Jul 11, 2022, 5:40 AM IST

Updated : Jul 11, 2022, 6:14 AM IST

మార్కెట్లపై మదుపర్లకు మరింత అవగాహన ఏర్పడేందుకు వీలుగా 'మార్కెట్‌ నష్టభయం కారణాల వివరాల'ను తరచు (త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షికంగా) వెలువరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సన్నాహాలు చేస్తోంది. ఇటువంటి వివరాల ప్రకటన అంతర్జాతీయంగా ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారీ లాభాలు, పతనాలు సహా మార్కెట్‌ ధోరణులకు సంబంధించిన వివరాలు ఇందులో ఉంటాయి. మదుపర్లు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ ప్రక్రియ ఉపకరిస్తుందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక చర్చల దశలోనే ఉంది.

గత కొన్నేళ్లలో చూస్తే.. 2020 ప్రారంభంలో తలెత్తిన కరోనా సంక్షోభ సమయంలో, గాభరా పడుతూ మదుపర్లు భారీగా అమ్మకాలకు తెగబడ్డారు. ఆ తర్వాత 'లాభాలు ఆర్జించేందుకు ఇదే సమయం' అంటూ వచ్చిన కథనాలను నమ్మి, తొందరగా ధనవంతులు కావొచ్చన్న ఆశతో, కంపెనీలు - రంగాల పరిస్థితులను అర్థం చేసుకోకుండానే షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. 'ఎక్కువమంది ఏం చేస్తుంటే, తామూ అదే చేయాలనే మూక ధోరణి'తో పెట్టుబడులు, అమ్మకాలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో వచ్చిన పలు పబ్లిక్‌ ఇష్యూలను చూస్తే, నమోదైన తొలిరోజు ఎక్కువకు విక్రయించి, లాభపడదామనే ధోరణే అత్యధికుల్లో కనిపించింది. ఆయా కంపెనీల మూలాలు తెలుసుకోకుండానే, అధిక ధరలకు దరఖాస్తు చేసిన వారు నష్టపోయారు. ఎక్కువ ఒడుదొడుకులు ఉండే ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ విభాగాలు మదుపర్ల భారీ నష్టాలను మిగిల్చాయి.

  • మార్కెట్లో అందుబాటులో ఉన్న 'పరిశోధనా సమాచారాన్ని' గమనిస్తే, లావాదేవీల్లో పాల్గొనేవారు రూపొందించిందే ఉంటోంది. స్వీయ వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఇలాంటివి అందుబాటులో ఉంచుతారు.
  • ఎటువంటి పక్షపాతం లేకుండా సెబీనే ఈ సమాచారం రూపొందిస్తే, మదుపర్లకు వాస్తవాలు తెలుస్తాయనేది తాజా ప్రతిపాదనకు కారణమైంది. ఇందుకు బిగ్‌ డేటా, కృత్రిమమేధ వంటి అధునాతన సాంకేతికతలను వినియోగించుకుంటారు.
  • 'మార్కెట్‌ నష్టాలకు లోబడి పెట్టుబడులుంటాయి' అనే పడికట్టు పదాలతో సరిపెట్టక, ఎలాంటి నష్టభయాలుంటాయనే అంశాలను సంస్థలు వెల్లడించాల్సి వస్తుంది. నమోదిత కంపెనీలు, బ్రోకర్లు, ఎక్స్ఛేంజీలు కూడా తమ నిర్ణయాలు, విధానాలు, భవిష్యత్తు ప్రణాళికలు వెల్లడించడం వల్ల మదుపర్లు ఆలోచించి, నిర్ణయం తీసుకునేందుకు వీలవుతుందని సెబీ భావిస్తోంది.
  • మదుపర్ల ధోరణి ఎలా ఉంది, లాభాలు ఆర్జించారా-నష్టపోయారా, ఏయే విభాగాలు లాభదాయకంగా -నష్టాలకు కారణమయ్యేలా ఉన్నాయన్నదీ వెల్లడించాలన్నది సెబీ యోచన.
    ఇటువంటి పరిణామాలను నివారించడానికి సెబీ తాజా నిర్ణయం దోహదపడుతుందని అంచనా వేస్తోంది.

ఇదీ చూడండి: 'అవును.. 5జీ స్పెక్ట్రమ్ రేసులో ఉన్నాం.. కానీ'

Last Updated : Jul 11, 2022, 6:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.