ETV Bharat / business

FDపై అధిక వడ్డీ రావాలా? SBI 'గ్రీన్​ డిపాజిట్​' స్కీమ్​తో ఫుల్ లాభాలు!

SBI Green Deposit Scheme Interest Rates In Telugu : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) ఇటీవలే 'గ్రీన్​ రూపీ టర్మ్ డిపాజిట్ స్కీమ్'​ను ప్రారంభించింది. ఇది ఒక స్పెషల్ ఫిక్స్​డ్​ డిపాజిట్ స్కీమ్​. ఈ గ్రీన్ డిపాజిట్ల ద్వారా సేకరించిన నిధులను పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు మళ్లిస్తారు. మరి ఈ స్కీమ్ వడ్డీ రేట్లు, ఇతర ప్రయోజనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామా?

SBI fixed deposit scheme interest rates 2024
SBI green deposit scheme interest rates
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 12:49 PM IST

SBI Green Deposit Scheme Interest Rates : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్​బీఐ ఇటీవలే 'గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ స్కీమ్​'ను ప్రవేశపెట్టింది. ఇది ఒక స్పెషల్ ఫిక్స్​డ్​ డిపాజిట్ స్కీమ్​. దీనిపై మంచి వడ్డీ రేట్లు కూడా అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా సేకరించిన నిధులను పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తారు.

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా
కేంద్ర ప్రభుత్వం 2070 నాటికి కర్బన ఉద్గారాలను (కార్బన్ న్యూట్రాలిటీ) గణనీయంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఎస్​బీఐ 'గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ స్కీమ్'​ (SGRTD)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ డిపాజిట్ స్కీమ్​లో మదుపు చేయడం ద్వారా ప్రకృతిని కాపాడుకునే నైతిక బాధ్యతను నెరవేర్చినట్లు అవుతుంది. దేశ ఆర్థిక సుస్థిరతకు మీ వంతు కృషి చేసినట్లు అవుతుంది. అదే సమయంలో వడ్డీ రూపంలో మంచి రాబడి సంపాదించడానికి వీలవుతుంది. పైగా మీ పోర్టుఫోలియోను డైవర్సిఫై చేసినట్లు అవుతుంది.

ఈ స్కీమ్​లో ఎవరు చేరవచ్చు?
ఈ గ్రీన్ డిపాజిట్​ స్కీమ్​లో భారతీయ పౌరులందరూ ఇన్వెస్ట్ చేయవచ్చు. ముఖ్యంగా వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ఒకవ్యక్తి యాజమాన్యంలోని సంస్థలు, సొసైటీలు, క్లబ్​లు, నాన్​-ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్​లతో సహా, ఎన్​ఆర్​ఐలు కూడా ఈ స్కీమ్​లో చేరవచ్చు.

వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
ఎస్​బీఐ ఈ గ్రీన్​ డిపాజిట్ స్కీమ్​ను మూడు రకాల కాలవ్యవధుల(టెన్యూర్స్​)తో అందిస్తోంది. అవి ఏమిటంటే?

  • 1111 రోజుల స్కీమ్ : దీని వడ్డీ రేటు 6.65 శాతం ఉంటుంది.
  • 1777 రోజుల స్కీమ్ : దీని వడ్డీ రేటు 6.65 శాతం ఉంటుంది.
  • 2222 రోజుల స్కీమ్ : దీని వడ్డీ రేటు 6.40 శాతం ఉంటుంది.

సీనియర్ సిటిజెన్స్​కు ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయా?
సీనియర్ సిటిజెన్స్​కు, ఎస్​బీఐ ఉద్యోగులకు, స్టాఫ్ సీనియర్ సిటిజన్లకు, రిటైల్ ఇన్వెస్టర్ల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తారు.

అవసరమైతే మధ్యలోనే డబ్బులు తీసుకోవచ్చా?
అత్యవసర సమయాల్లో నిబంధనలను అనుసరించి, ఈ గ్రీన్ డిపాజిట్లలోని సొమ్మును ముందుగానే విత్​డ్రా చేసుకోవచ్చు.

ఎక్కడ, ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
ఆసక్తి ఉన్నవారు నేరుగా ఎస్​బీఐ బ్రాంచ్​లకు వెళ్లి, ఈ గ్రీన్​ డిపాజిట్​ స్కీమ్​లో మదుపు చేయవచ్చు. త్వరలోనే యోనో (YONO) యాప్​, ఇంటర్నెట్ బ్యాంకింగ్​ల ద్వారా కూడా ఈ డిపాజిట్లలో మదుపు చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు ఎస్​బీఐ ప్లాన్ చేస్తోంది.

కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ
ప్రజలు పెద్ద ఎత్తున ఈ గ్రీన్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తే, దేశంలో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. పర్యావరణ అనుకూల పరిశ్రమలు, ఉత్పత్తులు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. దేశం ఆర్థికంగా సుస్థిరంగా ఉంటుంది. పైగా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించనవారం అవుతాము. వ్యాపారులు కూడా ప్రకృతి పరిరక్షణపై దృష్టి కేంద్రీకరించేలా ఇది చేస్తుంది.

ఎస్​బీఐ ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్స్​ 2024
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్​లు అందస్తోంది. వీటిపై మంచి వడ్డీ రేట్లను అందిస్తోంది. కొత్త ఏడాదిలో ఈ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

టర్మ్ డిపాజిట్ టెన్యూర్​ వడ్డీ రేట్లు (P.A)
60 ఏళ్లలోపు వారు సీనియర్ సిటిజెన్లు
7 రోజులు - 45 రోజులు 3.50%4.00%
46 రోజులు - 179 రోజులు 4.75%5.25%
180 రోజులు - 210 రోజులు 5.75%6.25%
211 రోజులు - ఒక సంవత్సరం లోపు 6.00%6.50%
1 సంవత్సరం - రెండేళ్ల లోపు 6.80% 7.30%
2 సంవత్సరాలు - 3 ఏళ్ల లోపు 7.00% 7.50%
3 సంవత్సరాలు - 5 ఏళ్ల లోపు 6.75%7.25%
5 సంవత్సరాలు - 10 ఏళ్ల లోపు 6.50% 7.50 %
400 రోజులు (అమృత్ కలశ్​ స్కీమ్​)7.10%7.60%

నోట్ : ఎస్​బీఐ వీ-కేర్​ స్కీమ్​లో చేరినవారికి (50 బేసిస్ పాయింట్లు) అధిక వడ్డీ అందిస్తారు.

క్రెడిట్‌ స్కోర్​ పెంచుకోవాలా? ఈ టాప్-5 టిప్స్ మీ కోసమే!

మీరు ఉద్యోగులా? మీ జీతంపై కట్టాల్సిన ఆదాయ పన్నును సింపుల్​గా లెక్కించండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.