ETV Bharat / business

SBI E Rupee Wallet News : ఎస్​బీఐ కస్టమర్స్​కు గుడ్​న్యూస్​.. ఇకపై 'ఇ-రూపీ'​తో UPI​ పేమెంట్స్!

SBI E Rupee Wallet News : ప్రభుత్వ రంగ బ్యాంక్​ ఎస్​బీఐ తమ కస్టమర్స్​కు గుడ్​న్యూస్​ చెప్పింది. తన డిజిటల్‌ రూపీ యాప్‌ అయిన 'ఇ-రూపీ' యాప్​లో యూపీఐ ఇంటర్‌-ఆపరేబిలిటీ ఫీచర్​ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. అంటే దీని సాయంతో అన్ని రకాల క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసి డిజిటల్‌ మనీని ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు.

SBI Latest News On CBDC Digital Rupee
SBI Announcement Today
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 6:02 PM IST

SBI E Rupee Wallet News : ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్​ స్టేట్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ) తమ వినియోగదారులకు శుభవార్త వినిపించింది. డిజిటల్‌ రూపాయికి సంబంధించి నూతన సదుపాయాన్ని ప్రారంభించింది. అన్ని రకాల మర్చెంట్​ క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసి డిజిటల్‌ రూపీని (CBDC) పేమెంట్స్​కు వినియోగించేకునేందుకు వీలుగా యూపీఐ ఇంటర్‌-ఆపరేబిలిటీ సదుపాయాన్ని తమ కస్టమర్స్​కు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఎస్‌బీఐ ఇ-రూపీ (e-Rupee) యాప్‌ వాడుతున్న వారు ఇకపై యూపీఐని స్కాన్‌ చేసి ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చని ఎస్‌బీఐ సోమవారం వెల్లడించింది. తమ వినియోగదారులకు డిజిటల్​ సౌలభ్యాన్ని మరింత చేరువచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కాగా, తాజాగా తీసుకువచ్చిన ఈ ఫీచర్​ను ఎస్​బీఐ ఇ-రూపీ యాప్​ ద్వారా వినియోగించుకోవచ్చు. ( SBI Latest News On Digital Rupee )

డిజిటల్​ రూపీ వినియోగం!
SBI E Rupee : ఇంతకుముందు పలు ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా ఈ సౌలభ్యాన్ని తీసుకువచ్చాయి. ముందుగా హెచ్‌డీఎఫ్‌సీ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత యాక్సిస్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌ సైతం ఇంటర్‌-ఆపరేబిలిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చాయి. కాగా, తాజా ప్రకటనతో ఎస్​బీఐ కూడా ఆ జాబితాలోకి చేరినట్లయింది. దీని ద్వారా యూపీఐ లావాదేవీల కోసం క్యూఆర్‌ కోడ్‌లను వినియోగిస్తున్న వ్యాపారులు.. తమ రోజువారీ వ్యాపార లావాదేవీల్లో ఇకపై డిజిటల్‌ రూపాయిని సైతం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.

పైలట్​ ప్రాజెక్ట్​!
SBI CBDC Wallet : సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ( CBDC )గా పేర్కొనే ఇ-రూపీ(డిజిటల్​ రూపీ) పైలట్‌ ప్రాజెక్ట్‌ను ఆర్‌బీఐ 2022 డిసెంబర్​ 1న ప్రారంభించింది. తొలుత హోల్‌సేల్‌ విభాగంలో ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. తర్వాత రెగ్యులర్‌ లావాదేవీలైన రిటైల్‌ యూజర్ల కోసం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్ ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగా ఎంపిక చేసిన కస్టమర్లను బ్యాంకులు ఆహ్వానిస్తున్నాయి. వారు మొబైల్‌ అప్లికేషన్‌ను డౌన్​లోడ్​ చేసుకొని ఇ-రూపీని వినియోగించుకోవచ్చు.

సీబీడీసీ అంటే ఏంటి?
2022-23 కేంద్ర బడ్జెట్​ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఈ CBDC సిస్టంను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. సింపుల్​గా చెప్పాలంటే ఈ సీబీడీసీలు అనేవి ఒకరకమైన డిజిటల్​ కరెన్సీ. వీటిపై నగదు డిపాజిట్లపై వచ్చే వడ్డీలేమి రానప్పటికీ.. వీటిని సులువుగా ఇతర కరెన్సీలోకి మార్చుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.