Differences Between Savings And Current Account : ప్రస్తుత డిజిటల్ యుగంలో.. దాదాపుగా అందరూ బ్యాంకు అకౌంట్ మెయింటెయిన్ చేస్తుంటారు. సాధారణ పౌరులు మొదలు.. బడా వ్యాపారుల వరకూ కచ్చితంగా ఏదో ఒక బ్యాంకులో ఖాతాలు కలిగి ఉంటున్నారు. అయితే.. చాలా మందికి క్లారిటీ లేని విషయం ఏమంటే.. అది సేవింగ్స్ అకౌంటా? కరెంట్ అకౌంటా.. అని! మరి, వీటి మధ్య తేడాలేంటి అన్న విషయంతోపాటు ఏది తీసుకుంటే మంచిది అనే విషయాలు తెలుసుకుందాం.
కరెంట్ అకౌంట్..
Current Account: కరెంట్ అకౌంట్ అనేది వ్యాపారాలకు అనుకూలమైన ఖాతా. ఈ ఖాతా ద్వారా.. వ్యాపారులు, సంస్ధలు, బడా కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్ధలు కరెంట్ అకౌంట్ ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ అకౌంట్ లో ఉన్న డబ్బును.. ఏ సమయంలోనైనా తిరిగి తీసుకోవచ్చు. మళ్లీ డిపాజిట్ చేసుకోవచ్చు.
కరెంట్ ఖాతా ప్రయోజనాలు..
Current Account Benefits:
- కరెంట్ ఖాతాలో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
- ఓవర్ డ్రాఫ్ట్ అంటే.. మీ ఖాతాలో డబ్బు లేకున్నా.. విత్‌డ్రా చేసుకోవచ్చు.
- వ్యక్తిగత, ఉమ్మడి ఖాతాలకు ఏటీఎం/డెబిట్ కార్డు జారీ చేయబడుతుంది.
- ఇతర నగరాల్లో చెల్లుబాటయ్యేలా చెక్కు బుక్కులు జారీ చేస్తారు.
- ఈ ఖాతాలో లావాదేవీలకు (డిపాజిట్, విత్‌డ్రా) ఎటువంటి పరిమితి లేదు.
- ఆన్‌లైన్ సేవలైన.. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ టాన్స్‌ఫర్-ఎన్‌ఈఎఫ్‌టీ, రియల్ ట్కెమ్ గ్రాస్ సెటిల్‌మెంట్-ఆర్‌టీజీఎస్‌లను ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు.
- కరెంట్ ఖాతాల విషయంలో బ్యాంకులు ఎలాంటి పరిమితులు విధించవు.
- రోజులో ఎన్నిసార్లయినా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
- ఈ ఖాతాలోని నగదు నిల్వపై బ్యాంకులు ఎలాంటి వడ్డీని చెల్లించవు.
సేవింగ్స్ అకౌంట్..
Savings Account: బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడానికి తేరిచే ఖాతాను సేవింగ్స్ ఖాతా అంటారు. ఈ అకౌంట్ తెరవాలంటే బ్యాంకును బట్టి రూ.1000 నుండి రూ.5000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి. మొదటిది.. బ్యాంకులో విత్‌డ్రా ఫారమ్ పూరించి డ్రా చేయడం. రెండవది.. ATM ద్వారా, మూడవ పద్ధతి.. చెక్ ద్వారా సొమ్మును తీసుకోవడం.
పొదుపు ఖాతా ప్రయోజనాలు..
Savings Account Benfits:
- పొదుపు ఖాతాలో జమ చేసిన డబ్బు సురక్షితంగా ఉంటుంది.
- బ్యాంకుల్లో పొదుపు ఖాతాలపై వార్షిక వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి.
- ఈ ఖాతాకు కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఈ-బ్యాంకింగ్ బిల్లులు చెల్లించే సౌకర్యం ఉంటుంది.
- ఈ ఖాతాతో హౌస్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ EMIవంటివి పొందొచ్చు.
- ఫండ్ ట్రాన్స్‌ఫర్ (EFT) ఈ ఖాతా నుండి మరొక వ్యక్తి ఖాతాకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో చేయవచ్చు.
- పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉన్నా.. వాటి ఆధారంగా రుణం లభించదు.
వివిధ పొదుపు ఖాతాలు
Various Savings Accounts:
- ఫ్యామిలీ పొదుపు ఖాతా
- శాలరీ సేవింగ్స్ అకౌంట్
- జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్లు
- ఫ్యామిలీ పొదుపు ఖాతా
- మైనర్ల సేవింగ్స్ అకౌంట్
- మహిళల సేవింగ్స్ అకౌంట్
జీరో బ్యాలెన్స్ ఖాతా
Zero Balance Account: జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది కూడా.. సేవింగ్స్ అకౌంటే. కాకపోతే, ఈ తరహా ఖాతాలో కనీస బ్యాలెన్స్ పాటించాలన్న నియమం ఉండదు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఈ అకౌంట్‌ను.. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) అకౌంటుగా పిలుస్తారు. ప్రజల్లో పొదుపు చేసే అలవాటును మరింతగా ప్రోత్సహించేందుకు బ్యాంకులు జీరో అకౌంట్ ఖాతాను అందుబాటులోకి తెచ్చాయి. ఈ జీరో బ్యాలెన్స్ ఖాతాను..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లతోపాటు భారతదేశంలోని అగ్ర బ్యాంకులు తమ కస్టమర్‌లకు జీరో బ్యాలెన్స్ సేవింగ్ ఖాతాలను అందిస్తున్నాయి.
జీరో బ్యాలెన్స్ ఖాతా ప్రయోజనాలు..
Zero Balance Account Benfits:
- ఖాతాదారులకు బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు.
- ఈ ఖాతాతో పొదుపు ఖాతాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
- ఖాతాదారులకు ఉచిత పాస్‌బుక్, ఏ శాఖలోనైనా నగదు, చెక్ డిపాజిట్ లావాదేవీలను ఉచితంగా కల్పిస్తుంది.
- జీరో బ్యాలెన్స్ ఖాతా ఉన్న వారికి డెబిట్ కార్డు, ఏటీఎం కార్డు సదుపాయం ఉంటుంది.
- మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసులు కూడా పొందవచ్చు.
- డిజిటల్ మాధ్యమంలో చెల్లింపులు జరపవచ్చు.
పర్సనల్ లోన్ కావాలా?.. తక్కువ వడ్డీ రేటుతో రుణం ఇస్తున్న 10 బ్యాంకులు ఇవే!