Sam Altman OpenAI Microsoft : ప్రముఖ కంపెనీ ఓపెన్‌ఏఐ తనపై విశ్వాసం కోల్పోవడం వల్ల ఆ సంస్థ సీఈఓ పదవీ బాధ్యతల నుంచి తొలగించిన నేపథ్యంలో శామ్ ఆల్ట్‌మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన త్వరలోనే ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లోని కృత్రిమ మేధ పరిశోధన బృందంలో చేరనున్నట్లు స్వయంగా ఆ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల సోమవారం వెల్లడించారు. ఈ విషయాన్ని ఆల్ట్‌మన్ సైతం ధ్రువీకరించారు. కాగా, శామ్ ఆల్ట్‌మన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధిలోనే ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మన్ తన పదవికి రాజీనామా చేశారు.
-
We remain committed to our partnership with OpenAI and have confidence in our product roadmap, our ability to continue to innovate with everything we announced at Microsoft Ignite, and in continuing to support our customers and partners. We look forward to getting to know Emmett…
— Satya Nadella (@satyanadella) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">We remain committed to our partnership with OpenAI and have confidence in our product roadmap, our ability to continue to innovate with everything we announced at Microsoft Ignite, and in continuing to support our customers and partners. We look forward to getting to know Emmett…
— Satya Nadella (@satyanadella) November 20, 2023We remain committed to our partnership with OpenAI and have confidence in our product roadmap, our ability to continue to innovate with everything we announced at Microsoft Ignite, and in continuing to support our customers and partners. We look forward to getting to know Emmett…
— Satya Nadella (@satyanadella) November 20, 2023
"ఆల్ట్‌మన్ మా కంపెనీ కొత్త కృత్రిమ మేధ పరిశోధన బృందంలో చేరనున్నారు. ఆయనతో పాటు ఓపెన్‌ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్ బ్రాక్‌మన్ కూడా మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయనున్నారు. ఓపెన్‌ఏఐ నూతన సీఈఓగా షియర్ నియామకం వాస్తవం. వీరితో మా భాగస్వామ్యం కొనసాగుతుంది. సంస్థతో కలిసి మేము రూపొందించిన ప్రోడక్ట్ రోడ్‌మ్యాప్ ముందుకు సాగుతుంది. ఓపెన్‌ఏఐలో వచ్చిన కొత్త నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాము."
- సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ
'వనరులు సమకూరుస్తాం..'
Greg Brockman Microsoft : ఇక ఆల్ట్‌మన్, బ్రాక్‌మన్ రాకతో మైక్రోసాఫ్ట్‌లోని ఏఐ టీమ్‌కు కొత్త నాయకత్వం లభించనున్నట్లు సత్య నాదెళ్ల పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి కృత్రిమ మేధ పరిశోధన బృందానికి నేతృత్వం వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో వారి విజయానికి కావాల్సిన అన్నీ వనరులు సమకూర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. అందుకు తగ్గట్లు వేగంగా చర్యలు కూడా చేపడతామని నాదెళ్ల ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఇక ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద వాటాదారుగా ఉన్న విషయం తెలిసిందే.
ఓపెన్‌ఏఐ కొత్త సీఈఓగా..
OpenAI CEO Emmet Shear : ఆల్ట్‌మన్‌ను పదవీ నుంచి తొలగించిన అనంతరం ఆయన స్థానంలో ఓపెన్‌ఏఐ కొత్త(తాత్కాలిక) సీఈఓగా వీడియో స్ట్రీమింగ్ సైట్ 'ట్విచ్' సహ వ్యవస్థాపకుడు ఎమ్మెట్ షియర్‌ను నియమించింది ఓపెన్‌ఏఐ బోర్డు. అయితే ఆల్ట్‌మన్‌కు సీఈఓ బాధ్యతల నుంచి ఉద్వాసన కల్పించిన వెంటనే ఆయన స్థానంలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటిని నియమించిన ఓపెన్‌ఏఐ ఆమెను కూడా తాజాగా తొలగించింది. ఆమె కూడా ఆల్ట్‌మన్‌కు మద్దతుగా నిలవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక ఎమ్మెట్ షియర్ 'ట్విచ్'లో సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఈ సంస్థను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కొనుగోలు చేసింది.
'తిరిగి రావడానికి సిద్ధమే.. కానీ..'
తాజా పరిణామాల నేపథ్యంలో ఓపెన్‌ఏఐ సీఈఓగా శామ్ ఆల్ట్‌మన్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. సంస్థలోకి తిరిగి రావడానికి ఆయన(ఆల్ట్‌మన్) సిద్ధంగానే ఉన్నానంటూ కొన్ని షరతులతో కూడిన ప్రతిపాదనను బోర్డు సభ్యుల ముందుంచారు. ఆయతే దీనిని కొంతమంది అంగీకరించకపోవడం వల్ల ఆల్ట్‌మన్ ఉద్వాసన అనివార్యమైంది.
ఈ వ్యూహాలు పాటిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో లాభాలు గ్యారెంటీ!
కొత్త బండి కొనాలా? టాప్ -10 సూపర్ స్టైలిష్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే!