Renault Duster SUV Globally Unveiled : రెనో సబ్-బ్రాండ్ డాసియా తాజాగా న్యూ-జెన్ డస్టర్ కారును ఆవిష్కరించింది. ఈ మిడ్-సైజ్ ఎస్యూవీ కారును భారత్‌లో 2025లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దీనిని కేవలం యూరోపియన్ మార్కెట్లో మాత్రమే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
డస్టర్ ఫీచర్స్
Renault Duster Features : డాసియా కంపెనీ పోర్చుగల్‌లో డస్టర్ వరల్డ్ ప్రీమియర్‌ను అట్టహాసంగా నిర్వహించింది. ఈ నయా డస్టర్ కారు లుక్ చూస్తుంటే.. దీనిని బిగ్‌స్టర్ కాన్సెప్ట్‌తో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
డస్టర్ కార్ లుక్స్
Renault Duster Exterior : ఈ డస్టర్ కారు ముందు భాగంలో చిక్ గ్రిల్ సెక్షన్, Y- ప్యాటర్న్‌లో కాన్ఫిగర్ చేసిన స్లిమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌లు, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్లు అమర్చారు. అలాగే చూడడానికి అందంగా ఉండేందుకు బోల్డ్ స్కిడ్ ప్లేట్లు, లోయర్ గ్రిల్, కొత్త రూఫ్ రెయిల్ అమర్చారు. అంతేకాదు కారు ఎక్స్టీరియర్ను పూర్తిగా బోనెట్ డిజైన్‌తో అప్డేట్ చేశారు.
కారు సైడ్స్ చూసుకుంటే.. స్క్వేర్ షేప్ వీల్ ఆర్చ్‌లు, క్వార్ట్ర్ గ్లాస్, సి-పిల్లర్స్‌పై అమర్చిన డోర్ హ్యాండిల్స్ కనిపిస్తాయి. అలాగే సరికొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, సైడ్ బ్లాక్‌లు ఉన్నాయి. అంతేకాదు వెనుక భాగంలో Y-ఆకారంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాప్స్, రివైజ్డ్ రియర్ బంపర్, టెయిల్ గేట్ ఉన్నాయి.
Renault Duster Interior : ఈ రెనో (డాసియా) డస్టర్ కారులో.. న్యూ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. దీనితో వైర్లెస్ యాపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ కూడా అనుసంధానమై ఉంటాయి. అలాగే ఈ కారులో సరికొత్త ఫ్లాట్ బోటమ్ స్టీరింగ్ వీల్, HVAC వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, న్యూ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి.
డస్టర్ కార్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్
Renault Duster Engine Specs : ఈ డాసియా డస్టర్ కారును 3 ఇంజిన్ ఆప్షన్లతో తీసుకువస్తున్నారు. అవి: 1.0 లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ మిల్. ఇవి వరుసగా 140 hp, 170 hp, 170 hp పవర్‌ను జనరేట్ చేస్తాయి.
జనవరిలో అన్ని కార్ల ధరలు హైక్? ఈలోగా కొనుక్కోవడమే బెటర్?
2024లో లాంఛ్ కానున్న టాప్-6 కార్లు ఇవే! ఫీచర్స్, లుక్స్ అదుర్స్!