ETV Bharat / business

'రిలయన్స్' మరో ఘనత​.. మార్కెట్​ విలువ @19 లక్షల కోట్లు - stock market live updates

Reliance Industries MCAP: రిలయన్స్​ ఇండస్ట్రీస్​ మరో మైలురాయిని అందుకుంది. మార్కెట్​ విలువ రూ. 19 లక్షల కోట్లను తాకిన.. తొలి భారత కంపెనీగా నిలిచింది. తొలుత భారీగా పెరిగిన రిలయన్స్​ షేరు.. ఆఖర్లో తగ్గింది. గత సెషన్​లో భారీ లాభాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్​ సూచీలు.. బుధవారం మళ్లీ పతనమయ్యాయి.

Reliance Industries becomes first Indian firm to hit Rs 19 lakh cr market valuation mark

author img

By

Published : Apr 27, 2022, 3:43 PM IST

Reliance Industries MCAP: రిలయన్స్​ ఇండస్ట్రీస్​ మరో అరుదైన ఘనత సాధించింది. ఒక దశలో మార్కెట్​ క్యాపిటలైజేషన్ ​(ఎంక్యాప్​)​ రూ. 19 లక్షల కోట్ల మార్కును తాకింది. ఇంత మార్కెట్​ విలువను చేరుకున్న తొలి భారత కంపెనీగా నిలిచింది. బుధవారం సెషన్​లో తొలుత రిలయన్స్​ కంపెనీ షేర్లు.. స్టాక్​ మార్కెట్లలో మంచి లాభాలతో ట్రేడయ్యాయి. ఓ దశలో దాదాపు 2 శాతం మేర పెరిగి 2827.10 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అదే సమయంలో మార్కెట్​ విలువ రూ. 19 లక్షల కోట్ల మార్కును అధిగమించి.. రూ. 19.12 లక్షల కోట్లకు చేరింది.

ఆఖర్లో స్టాక్​ మార్కెట్లలో నష్టాలతో.. రిలయన్స్​ షేరు కూడా ఫ్లాట్​గా ముగిసింది. మార్కెట్​ ముగిసే సమయానికి.. రిలయన్స్​ ఎంక్యాప్ రూ. 18 లక్షల 76 లక్షల కోట్ల వద్ద ఉంది. ఈ ఏడాది మార్చిలోనే రిలయన్స్​ ఇండస్ట్రీస్​ మార్కెట్​ విలువ రూ. 18 లక్షల కోట్లకు చేరింది. గతేడాది అక్టోబర్​ 13న రూ. 17 లక్షల మార్కును అధిగమించింది. 2022లో రిలయన్స్​ షేరు 19 శాతానికిపైగా దూసుకెళ్లింది. ఉక్రెయిన్​- రష్యా యుద్ధం సమయంలోనూ భారీగా పెరగడం విశేషం.

''అంతర్జాతీయంగా చమురు, గ్యాస్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. భౌగోళిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు కూడా రిలయన్స్‌ టెలికాం వ్యాపారంపై ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. రెన్యువబుల్​ ఎనర్జీ బిజినెస్​ను కంపెనీ మరింత విస్తరిస్తోంది.'' అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Stock Market Closing: స్టాక్​ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. గత సెషన్​లో భారీగా పుంజుకున్న దేశీయ సూచీలు.. బుధవారం పతనమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 537 పాయింట్లు కోల్పోయి.. 56 వేల 819 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 162 పాయింట్ల పతనంతో 17 వేల 38 వద్ద సెషన్​ను ముగించింది. సెన్సెక్స్​ తొలుత దాదాపు 370 పాయింట్లకుపైగా నష్టంతో ప్రారంభమైంది. ఓ దశలో 750 పాయింట్లకుపైగా కోల్పోయి.. 56 వేల 584 వద్ద సెషన్​ కనిష్ఠాన్ని తాకింది. 57 వేల 79 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది.

లాభనష్టాల్లో: సెన్సెక్స్​ 30 ప్యాక్​లో 5 షేర్లు మినహా అన్నీ నష్టాల్లోనే ముగిశాయి. హీరో మోటోకార్ప్​, టాటా స్టీల్​, ఏషియన్​ పెయింట్స్​, బజాజ్​ ఆటో, టీసీఎస్​ రాణించాయి. బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, శ్రీ సిమెంట్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, టైటాన్, విప్రో షేర్లు పడిపోయాయి. విద్యుత్తు, ఆయిల్​ అండ్​ గ్యాస్​, బ్యాంకింగ్​ షేర్లు కుదేలయ్యాయి.

అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు మార్కెట్ల నష్టాలకు కారణంగా విశ్లేషిస్తున్నారు నిపుణులు. అమెరికాలో ద్రవ్యోల్బణం భయాలు, కరోనా విజృంభణతో చైనాలో మళ్లీ కఠిన లాక్​డౌన్​లు, రష్యా- ఉక్రెయిన్​ యుద్ధంతో ఐరోపాలో కష్టాలు.. మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. మంగళవారం సెషన్​లో సెన్సెక్స్​ 777 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 247 పాయింట్లు లాభపడింది. విదేశీ సంస్థాగత మదుపరులు.. వరుసగా అమ్మకాలకే మొగ్గుచూపుతుండటం వల్ల మన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ఇవీ చూడండి: ఎల్​ఐసీ ఐపీఓకు అంతా రెడీ! మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే..

ట్విట్టర్​ను మస్క్​ ఏం చేయబోతున్నారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.