Recurring Deposit SBI vs Post Office : పెట్టుబడులపై మంచి వడ్డీలు పొందేందుకు రికరింగ్ డిపాజిట్లు అనేవి ఓ అనువైన మార్గంగా చెప్పవచ్చు. ప్రతినెలా తక్కువ మొత్తంలో డబ్బును జమ చేస్తూ.. ఎక్కువ సొమ్మును కూడగట్టుకునేందుకు ఈ డిపాజిట్లు దోహదపడతాయి. దేశ వ్యాప్తంగా పేరు మోసిన బ్యాంకులన్నీ రికరింగ్ డిపాజిట్ల సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఎస్బీఐ, పోస్టాఫీస్.. రికరింగ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Recurring Deposit Features : రికరింగ్ డిపాజిట్ల ఫీచర్లు..
- ప్రజల్లో పొదుపును ప్రోత్సహించేందుకు ఈ రికరింగ్ డిపాట్లను ప్రవేశపెట్టారు.
- కేవలం చిన్న మొత్తాలతో ఆరు నెలల నుంచి 10 ఏళ్ల వరకు ఈ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టొచ్చు.
- తనకు అనుకూలమైన కాల వ్యవధిని ఖాతాదారు ఎంచుకోవచ్చు.
- రికరింగ్ డిపాజిట్ అకౌంట్.. సుమారు 30 రోజుల నుంచి మూడు నెలల వరకు లాక్-ఇన్ పీరియడ్‌ను కలిగి ఉంటుంది. ఇది సంబంధిత బ్యాంకును బట్టి ఉంటుంది.
ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్లు..
SBI Rd Interest Rate 2023 : ఏడాది నుంచి పది సంవత్సరాల కాల వ్యవధి వరకు రికరింగ్ డిపాజిట్లను స్వీకరిస్తుంది ఎస్బీఐ. ప్రతినెల కనీసం వంద రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. తరువాత ఆ మొత్తానికి పది రూపాయలను జోడిస్తూ చెల్లించాలి. రికరింగ్ డిపాజిట్లపై సగటున సాధారణ ప్రజలకు 6.5 నుంచి 7 శాతం వడ్డీని చెల్లిస్తుంది ఎస్బీఐ. సీనియర్ సిటీజన్లకు మాత్రం.. 7 నుంచి 7.5శాతం వరకు వడ్డీని అందిస్తుంది. 2023 ఫిబ్రవరి 15 నుంచి ఈ వడ్డీ రేట్లు అందుబాటులోకి వచ్చాయి.
ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ రేట్లు
కాల వ్యవధి | సాధారణ ప్రజలు | సీనియర్ సిటీజన్లు |
ఏడాది నుంచి 2ఏళ్లు | 6.80శాతం | 7.30 శాతం |
2 నుంచి 3ఏళ్ల లోపు | 7 శాతం | 7.50 శాతం |
3 నుంచి 5ఏళ్ల లోపు | 6.50 శాతం | 7 శాతం |
5 నుంచి 10 ఏళ్లు | 6.50 శాతం | 7.50 శాతం |
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లు..
Post Office Rd Interest Rate 2023 : పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ల మెచురిటీ సమయం ఐదేళ్లు ఉంటుంది. కనీసం నెలకు రూ.100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తరువాత ఆ మొత్తానికి పది రూపాయలు అదనంగా జమ చేస్తూ చెల్లించాలి. అయితే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ల వడ్డీరేట్లపై సీనియర్ సిటీజన్లు.. ఎలాంటి అదనపు ప్రయోజనాన్ని పొందలేరు. 2023 జులై1 నుంచి ఈ రేట్లు అమలులోకి వచ్చాయి. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై 6.5శాతం వడ్డీని చెల్లిస్తుంది పోస్టాఫీస్. దాంతోపాటు రికరింగ్ డిపాజిట్ల పెట్టుబడుల వడ్డీపై 10 శాతం టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ సోర్స్) విధిస్తోంది ప్రభుత్వం. ఒకవేళ రికరింగ్ డిపాజిట్లపై ఆర్జించిన వడ్డీ మొత్తం రూ.10వేలు దాటితే టీడీఎస్ నుంచి మినహాయింపు ఉంటుంది.
How to Become Millionaire : 15వేల రూపాయలతో కోటీశ్వరులు కావొచ్చు.. ఈ సూత్రం తెలుసా..?
How to Link Aadhaar with UAN in Online : మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? వెంటనే ఈ పని చేయండి..!