Reasons For UPI Transaction Failure : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) మన ఆర్థిక లావాదేవీల్ని మరింత సులభతరం చేసింది. మాల్‌లో షాపింగ్ చేసినా, రెస్టారెంట్లో భోజనం చేసినా, హోటల్లో టీ తాగినా.. ఒక్క క్లిక్‌తో ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నాం. దీని వల్ల నగదును చాలా తక్కువ మంది తమ వెంట తీసుకెళుతున్నారు. కానీ ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు అది ఒక్కసారిగా నిలిచిపోయినా, విఫలమైనా, ఇతర ఏ సమస్య వచ్చినా.. ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఈ చిట్కాలు పాటించి చూడండి.
Steps To Follow Overcome UPI Issues :
UPI చెల్లింపు రోజువారీ పరిమితి చూసుకోండి
దాదాపు అన్ని బ్యాంకులు UPI లావాదేవీల రోజూవారీ మొత్తాన్ని పరిమితం చేశాయి. NPCI నిబంధనల ప్రకారం గరిష్ఠ మొత్తంగా రూ.1 లక్ష వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే.. మళ్లీ లావాదేవీలు చేయడానికి 24 గంటల సమయం వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చెల్లించాలని అనుకుంటే వేరొక బ్యాంక్ ఖాతా నుంచి పంపించుకోవచ్చు.
మల్టిపుల బ్యాంక్ అకౌంట్స్ లింక్!
UPI చెల్లింపులు నిలిచిపోవడానికి గల కారణాల్లో బ్యాంక్ సర్వర్‌లు ఓవర్‌లోడ్ అవ‌్వడం కూడా ప్రధాన కారణం. దీన్ని నివారించడానికి మీ UPI IDకి మల్టిపుల్ బ్యాంక్ ఖాతాలను లింక్ చేయడం ఉత్తమం. ఒక బ్యాంకు సర్వర్ డౌన్ అయినా.. మరో బ్యాంకు సర్వర్‌తో చెల్లింపులు చేసుకోవచ్చు.
వివరాలను సరిచూసుకోవాలి!
డబ్బు పంపేటప్పుడు నగదు గ్రహీత వివరాల్ని సరిగ్గా చూసుకోవాలి. అకౌంట్ నంబరు, IFSC కోడ్, ఫోన్ నంబరు తదితర వివరాల్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.
యూపీఐ పిన్ మర్చిపోవడం!
మనం చేసే లావాదేవీల కోసం ఒక్కోసారి ఫోన్, మరోసారి క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డులు వాడుతుంటాం. ఇలాంటప్పుడు ఒక్కోదానికి ఒక్కో పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేస్తాం. ఇలా అనేక పిన్‌లను గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉన్నప్పుడు కూడా పిన్ నంబర్లను మర్చిపోయే అవకాశముంటుంది. ఒక వేళ అలా మర్చిపోతే.. "Forgot UPI PIN"పై క్లిక్ చేసి స్టెప్స్ ఫాలో అవుతూ కొత్త పిన్ను సెట్ చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ కనెక్షన్!
UPI చెల్లింపులు నిలిచిపోవడానికి, విఫలమవడానికి గల ప్రధాన కారణాలలో సరైన ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం ఒకటి. దీనికోసం నెట్‌వర్క్ సిగ్నల్ బాగా ఉన్న ప్రాంతానికి వెళ్లండి. లేదంటే చెల్లింపులు చేసే సమయంలో అక్కడున్న వారిని హాట్‌స్పాట్‌ను ఆన్ చేయడం లేదా వై-ఫై పాస్‌వర్డ్‌ను చెప్పమని కోరండి.
యూపీఐ లైట్ ఫీచర్ ఉపయోగం!
స్లో బ్యాంక్ సర్వర్లు, నెట్‌వర్క్ సమస్యల వల్ల చెల్లింపులు ఆగిపోతుండడం కారణంగానే గతేడాది NPCI ద్వారా UPI Lite ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీని వల్ల యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే.. నేరుగా చెల్లింపులు చేయవచ్చు. ఇందులో గరిష్ఠంగా రూ.2 వేల వరకు జమ చేసుకోవచ్చు. పైగా దీని ద్వారా చిన్న చిన్న పేమెంట్లు చేసినప్పుడు ఆ వివరాలు ట్రాన్సాక్షన్స్లో నమోదు కావు.
- Ujjwala Yojana Free Gas Cylinder : కేంద్రం శుభవార్త.. ఉచితంగా మరో 75 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు
- Payment For Unused Paid Leave For Employees : మిగిలిపోయిన సెలవులను క్యాష్ చేసుకునే అవకాశం!.. కొత్త రూల్స్ ఇవే..
- Stock Market Close Today 13th September 2023 : భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 50@20,070 రికార్డ్ ముగింపు!