ETV Bharat / business

Reactions Against Infosys Narayana Murthy : గొడ్డులమా? లేదా ఉద్యోగులమా?.. వారానికి 70 గంటలు పనిచేయడానికి.. - comments aganist narayana murthy

Reactions Against Infosys Narayana Murthy : ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి.. యువత వారానికి 70 గంటలపాటు పనిచేయాలని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ క్లైంట్ల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసే ఐటీ కంపెనీలు.. ఉద్యోగులకు మాత్రం నామమాత్రపు జీతాలు ఇస్తూ పీడిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Infosys Founder Narayana Murthy
Reactions Against Infosys Narayana Murthy
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 1:09 PM IST

Updated : Oct 27, 2023, 3:32 PM IST

Reactions Against Infosys Narayana Murthy : నేటి యువత వారానికి కనీసం 70 గంటలపాటు పని చేయాలని.. ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చేసిన సూచనపై అంతర్జాలంలో పలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Narayana Murthy About Indian Work Culture : ఇన్ఫోసిస్​ మాజీ సీఎఫ్​ఓ మోహన్​దాస్​ పాయ్​తో నారాయణ మూర్తి మాట్లాడుతూ.. మిగతా దేశాలతో పోల్చితే, భారతదేశంలో ఉత్పాదకత బాగా తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత జపాన్, జర్మనీలు అమలు చేసిన వ్యూహాలనే నేడు భారతదేశంలో అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత వారంలో కనీసం 70 గంటలపాటు పనిచేయాలని ఆయన సూచించారు. అప్పుడే ఎంతో అభివృద్ధి చెందిన చైనా లాంటి దేశాలతో మనం పోటీపడగలుగుతాము అని ఆయన పేర్కొన్నారు. పరిపాలనలో అవినీతి, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే జాప్యం వల్ల.. భారతదేశంలో పని ఉత్పాదకత చాలా తక్కువగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నారాయణ మూర్తి వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు ఐటీ సంస్థల దోపిడీ విధానం గురించి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

"రోజుకు 70 గంటలు పనిచేయాలా? యువతీయువకులను పనిలో పెట్టుకుని, వారితో గొడ్డుల్లా పనిచేయించి.. భారీ లాభాలను ఆర్జించడం సరైనది కాదు. ఇది పూర్తిగా దోపిడీ విధానం.ఇదొక బ్యాడ్​ బిజినెస్ మోడల్​."
- నరేష్

  • 70 hours?! If true, it’s a predatory approach to employ youngsters, work them to death, and make huge profits. Bad business model.

    — Naresh (@TopDriverIndia) October 26, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నారాయణ మూర్తి చెప్పింది చాలా మంచి విషయం. కానీ ఇన్ఫోసిస్​లో ఒక ఫ్రెషర్​కు సంవత్సరానికి 3.5 లక్షలు మాత్రమే జీతంగా ఇస్తున్న ఆయన.. చాలా ఎక్కువగా ఆశిస్తున్నారు. ముందుగా తమ ఉద్యోగులకు జీతాలు పెంచి, తరువాత ఇలాంటి సలహాలు ఇస్తే బాగుంటుంది. కానీ ఆయన తన జీవితంలో ఇలాంటి ఆలోచన చేసి ఉండరు."
- ప్రయూష్​ జైన్​

  • Infosys pays 3.5 Lakh per year to a fresher and expects a lot. Good advice but once in his lifetime he has never thought of his employees.

    — Prayush Jain / PJ 🇮🇳 (@jainprayush9) October 26, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఐటీ ఉద్యోగులు ఆవేదన
'భారతదేశంలోని ఐటీ సంస్థలు.. తమ ఉద్యోగులు రోజుకు 12 గంటలపాటు, వారంలో 6 రోజులు పనిచేయాలని ఆశిస్తున్నాయి. క్లైంట్స్​ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసే ఐటీ సంస్థలు.. తమ ఉద్యోగులకు మాత్రం నామమాత్రపు జీతాలు ఇస్తూ సరిపెడుతున్నాయి' అని పలువురు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

"రోజుకు 12 గంటలు, వారానికి 6 రోజులు ఉద్యోగులు పనిచేయాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. దీనికి అదనంగా ఉద్యోగులకు రోజులో 2 గంటలు ప్రయాణానికి, 1 గంట ప్రిపరేషన్​కు సరిపోతుంది. క్లైంట్స్​ నుంచి మిలియన్స్​లో ఫీజులు వసూలు చేసే ఐటీ సంస్థలు.. తమ ఉద్యోగులకు మాత్రం చిల్లర పడేస్తున్నాయి."
- డాక్టర్ శ్రద్ధయా కటియార్​

  • Yes , For these corporations destroy everything.

    12 hrs a day for 6 days week and add 2 hrs travelling 1 hrs for preparation. These IT consulting corporations charge in millions from their clients but pay pennies to their employees.

    — Dr SHRADDHEY KATIYAR (@Wegiveyouhealt1) October 26, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఉద్యోగులకు కుటుంబ జీవితం వద్దా?
'ప్రపంచమంతా నేడు వారానికి 5 లేదా 4 రోజులు మాత్రమే పనిచేయాలనే దిశగా పయనిస్తోంది. కానీ ఇన్ఫోసిస్​ మాత్రం.. ఉద్యోగులు వారానికి 7 రోజులు కూడా పనిచేయించాలని సూచిస్తోంది. తమ కంపెనీలో పనిచేసేవారి నుంచి ఎంతో ఆశిస్తున్న ఐటీ సంస్థలు.. సదరు ఉద్యోగుల కుటుంబ జీవితాన్ని, వారి మానసిక ఆరోగ్య పరిస్థితుల గురించి కూడా ఆలోచిస్తే మంచిది' అని మరికొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Indian Mobile Congress 2023 : 7వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్​లో.. 100 5జీ ల్యాబ్స్​ ప్రారంభించిన మోదీ..' అని

Car Subscription Model : కారు కొనకుండా హ్యాపీగా తిరగాలా?.. సబ్​స్క్రిప్షన్ ఆప్షన్ గురించి తెలుసా?

Last Updated : Oct 27, 2023, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.