ETV Bharat / business

'వడ్డీ రేట్లు యథాతథం- కొంతకాలం ధరల భారం ఖాయం!' - ఆర్బీఐ సమీక్ష

rbi mpc outcome
కీలక వడ్డీ రేట్లు యథాతథం.. వరుసగా 11వ సారి...
author img

By

Published : Apr 8, 2022, 10:17 AM IST

Updated : Apr 8, 2022, 2:41 PM IST

10:14 April 08

కీలక వడ్డీ రేట్లు యథాతథం.. వరుసగా 11వ సారి...

RBI mpc outcome: నిపుణుల అంచనాలను నిజం చేస్తూ.. కీలక వడ్డీ రేట్లను వరుసగా 11వ సారి యథాతథంగా ఉంచుతూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకుతున్నా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ పరిస్థితుల మధ్య ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 4 శాతంగా ఉంచగా రివర్స్‌ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగించనున్నట్లు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్‌ తెలిపారు. మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉండనుంది. 2020 మే 22న చివరిసారిగా వడ్డీ రేట్లలో మార్పులు చేసింది ఆర్​బీఐ. ఫలితంగా రెపో రేటు చరిత్రలో కనిష్ఠమైన 4శాతానికి దిగొచ్చింది.

భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త, పెను సవాలును ఎదుర్కొంటోందని రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు శక్తికాంత దాస్. ఒమిక్రాన్​ను సమర్థంగా ఎదుర్కోవడం వల్ల కలిగిన లాభాలను.. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా కోల్పోవాల్సి వచ్చిందని వివరించారు. అయితే.. విదేశీ మారక నిల్వలు పుష్కలంగా ఉన్నాయని.. ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు ఆర్​బీఐ సర్వసన్నద్ధమై ఉందని స్పష్టం చేశారు.

  • భారత దేశ ఆర్థిక వృద్ధిపై యుద్ధం ప్రతికూల ప్రభావం చూపుతుందని అంచనా వేశారు.
  • 2022-23 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు.
  • పెట్రో మంటతో ద్రవ్యోల్బణం మరింత(4.5శాతం నుంచి 5.7శాతానికి) పెరుగుతుందని, వంట నూనెల ధరలు కొంతకాలం అధికంగానే ఉంటాయని చెప్పారు శక్తికాంత దాస్.

ఇవీ చూడండి: అగ్రస్థానం అంబానీదే.. అత్యంత చేరువలో అదానీ

'హోం లోన్​' భారంగా మారిందా.. ఈ జాగ్రత్తలతో ఈజీగా!

Last Updated : Apr 8, 2022, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.