ETV Bharat / business

మారిన డిజిటల్ లోన్​ రూల్స్​తో రుణ యాప్​ల ఆగడాలకు చెక్​! - RBI regulations on digital lending platforms

RBI Digital Lending Guidelines In Telugu : మీరు అవసరాల కోసం డిజిటల్ లోన్స్​ తీసుకుంటున్నారా? అయితే తస్మాత్​ జాగ్రత్త! నేడు చాలా రుణ యాప్​లు, సామాన్యులకు అప్పులు ఇచ్చి, సకాలంలో తీర్చని వారిని అనైతిక పద్ధతుల్లో తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. అందుకే ఇలాంటి వాటి ఆటకట్టించడానికి ఆర్​బీఐ కఠినమైన నిబంధనలు తీసుకువచ్చింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

RBI New Rules To Check Unsecured digital Loans
RBI Digital Lending Guidelines In Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 12:40 PM IST

RBI Digital Lending Guidelines : నేడు ఎలాంటి హామీలు తీసుకోకుండా రుణాలు మంజూరు చేసే సంస్థలు అనేకం పుట్టుకొచ్చాయి. రెండేళ్ల క్రితం దేశంలో, మొత్తం రుణాల మార్కెట్లో హామీ అవసరం లేని అప్పుల వాటా 25 శాతంగా ఉండేది. కానీ నేడు అది 28 శాతానికి చేరింది. రోజురోజుకూ ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో, ప్రజల పొదుపు శక్తి క్రమంగా క్షీణిస్తోంది. మరోవైపు హామీ అవసరం లేని రుణాలకు గిరాకీ పెరుగుతోంది. దీనిని ఆసరా చేసుకుని చాలా డిజిటల్ లోన్ యాప్​లు నేడు మనుగడలోకి వచ్చాయి.

ఎలా పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదు!
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు నేరుగా ఆర్‌బీఐ పరిధిలోకి వస్తాయి. కానీ డిజిటల్‌ లోన్స్ ఇచ్చే యాప్‌లు ఎప్పుడు, ఎక్కడి నుంచి పుట్టుకు వస్తున్నాయో ఎవరికీ తెలియడం లేదు. ఇవి ముందుగా రుణాలు ఇచ్చి, తరువాత వాటి వసూలు కోసం అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నాయి. దీనితో అనేక మంది రుణగ్రహీతలు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. దీనిని అరికట్టడానికే రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది. అవి ఏమిటి? వాటి వల్ల రుణగ్రహీతలకు ఎలాంటి రక్షణ కలుగుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యక్తిగత రుణాల విషయంలో జాగ్రత్త!
మన అవసరం ఏమిటన్నది చెప్పకుండానే వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు. సాధారణంగా ఈ పర్సనల్ లోన్స్​ వ్యవధి అయిదేళ్ల వరకూ ఉంటుంది. వ్యక్తిగత రుణాలను వస్తువుల కొనుగోళ్లు, ప్రయాణాలు, వ్యాపార అవసరాలు, వివాహం, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు లాంటి అనేక అవసరాల కోసం తీసుకుంటూ ఉంటారు. స్థిర వడ్డీ రేట్లపై ఈ వ్యక్తిగత రుణాలను అందిస్తారు. సాధారణంగా బ్యాంకులు, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి వీలైనంత తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇస్తూ ఉంటాయి. దేశంలో చూసుకుంటే, అన్ని బ్యాంకుల వ్యక్తిగత రుణాల మొత్తం విలువ రూ.10 లక్షల కోట్లకు పైగానే ఉంటుంది. ఎలాంటి హామీ లేని రుణాలు కనుక, బ్యాంకులకు నష్టభయం ఎక్కువగానే ఉంటుంది. కనుక బ్యాంకులు నుంచి ఈ వ్యక్తిగత రుణాలు పొందడం కాస్త కష్టమవుతుంది. పైగా రుణాలు మంజూరు కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. దీనిని ఆసరాగా తీసుకుని బ్యాంకింగ్‌ వ్యవస్థ వెలుపల, డిజిటల్‌ యాప్‌లు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. ఇవి పరిమితమైన ధ్రువీకరణలతో, నిమిషాల వ్యవధిలోనే పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి. ఇవి ఇచ్చే రుణాలకు వడ్డీ రేటు భారీగా ఉంటుంది. ఒక వేళ రుణగ్రహీత వాటిని సకాలంలో తీర్చలేకపోతే, చాలా అన్యాయమైన, అనైతికమైన పద్ధతిలో వారిని మానసిక క్షోభకు గురిచేస్తారు. దీనిని నివారించేందుకే ఆర్‌బీఐ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.

మధ్యవర్తులు ఉండకూడదు!
ఆర్​బీఐ నిబంధనల ప్రకారం, డిజిటల్‌ రుణ యాప్‌లు నేరుగా రుణగ్రహీతతోనే ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలి. రుణాన్ని ఇచ్చేందుకూ, వసూలు చేసేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యవర్తులను ఉపయోగించకూడదు. రుణం నేరుగా రుణగ్రహీత ఖాతాలో మాత్రమే జమ చేయాలి. పేమెంట్స్​ కూడా నేరుగా రుణదాతకే చెల్లించాలి.

అన్నీ పారదర్శకంగా ఉండాలి!
రుణ యాప్​లు విధించే నిబంధనలు, షరతులు, ఛార్జీలు అన్నీ పారదర్శకంగా ఉండాలి. అన్ని రకాల లోన్స్​ విషయంలోనూ దీన్ని విధిగా పాటించాలి. డిజిటల్‌ రుణాన్ని మంజూరు చేసే ముందు వడ్డీ, రుసుములు సహా, మొత్తం ఖర్చులను కేఎఫ్‌ఎస్‌ (కీ ఫ్యాక్ట్‌ స్టేట్‌మెంట్‌) రూపంలో రుణగ్రహీతలకు, రుణదాతలు అందించాలి. రుణ మొత్తం, పరిశీలనా రుసుము, వడ్డీ, ముందస్తు చెల్లింపు రుసుములు, ఎన్ని నెలల్లో ఎంత రుణం తీరుతుంది, ఇలా అన్ని వివరాలను ముందుగానే రుణదాతలు, రుణగ్రహీతకు అందించాల్సి ఉంటుంది. ఈ జాబితాలో లేని అంశాలకు రుణదాతలు ఎలాంటి ఫీజులను వసూలు చేయకూడదు. అంతేకాదు, రుణాన్ని తిరిగి వసూలు చేసుకునే ప్రక్రియ ఎలా ఉంటుంది? సమస్య వచ్చినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇలాంటి విషయాలను కూడా ముందుగానే చెప్పితీరాలి.

క్రెడిట్‌ స్కోర్​ బాగుండాలి!
ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేసేటప్పుడు మీ క్రెడిట్​ స్కోర్​ను పూర్తిగా విశ్లేషిస్తాయి. మీ రుణార్హత, తిరిగి చెల్లించే సామర్థ్యం సహా, అన్నింటినీ సరిచూసుకుంటాయి. డిజిటల్ రుణ సంస్థలు కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తాయి. కనుక క్రెడిట్ స్కోర్ తగ్గకుండా జాగ్రత్త పడాలి.

డిజిటల్‌ డాక్యుమెంట్స్​!
రుణయాప్​లు లోన్ మంజూరు చేశాక, అందుకు సంబంధించిన పత్రాలన్నింటినీ, డిజిటల్​ డాక్యుమెంట్స్​ రూపంలోనే ఇస్తాయి. ఈ పత్రాల్లో రుణానికి సంబంధించిన వివరాలతోపాటు, మీ వ్యక్తిగత వివరాల గోప్యతకు సంబంధించిన నియమాలు కూడా పొందుపరచాలి. అంతేకాదు రుణాన్ని మంజూరు చేసే క్రమంలో, ఎవరితో భాగస్వామ్యం ఉందన్న వివరాలు కూడా ఈ పత్రాల ద్వారా తెలియజేయాలి.

ముందస్తు చెల్లింపులు చేయవచ్చు!
మీరు డిజిటల్ యాప్స్​ నుంచి రుణం తీసుకున్న తరువాత, వాటిని అనుకున్న వ్యవధి కంటే ముందే చెల్లించవచ్చు. పైగా దీనికి ఎలాంటి అదనపు రుసుములు చెల్లించవలసిన పని లేదు. సాధారణంగా రుణ సంస్థ నిబంధనలను అనుసరించి, ముందస్తు రుణాన్ని ఎన్నాళ్ల వ్యవధిలో చెల్లించవచ్చు అనేది నిర్ణయం అవుతుంది. అయితే కనీస వ్యవధి 3 రోజుల కంటే తక్కువగా ఉండకూడదు. 7 రోజులు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి ఉన్న లోన్స్​ అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఒకవేళ 7 రోజులకన్నా తక్కువ వ్యవధి ఉన్న రుణాలను తీసుకున్నప్పుడు, కేవలం ఒక్క రోజులోనే ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కు ఇచ్చేయవలసి ఉంటుంది.

ఫిర్యాదు - పరిష్కారం
లోన్ తీసుకున్న తరువాత, ఏదైనా సమస్య ఏర్పడితే, ఫిర్యాదు చేయడానికి ఒక ప్రత్యేక అధికారి ఉండాలి. రుణగ్రహీతతోపాటు, రికవరీ ఏజెంట్లకు కూడా నోడల్ ఆఫీసర్​ను సంప్రదించే వీలు ఉండాలి.

అప్పు తీర్చకపోతే ఏమౌవుతుంది?
ఒక వేళ అప్పు తీర్చలేకపోతే, రుణం వసూలు కోసం ఎవరు వస్తారనేది కూడా రుణగ్రహీతకు ముందే తెలియజేయాలి. అంటే రుణదాతలు తమ రికవరీ ఏజెంట్ల గురించి ముందుగానే, రుణగ్రహీతకు తెలియజేయాలి. ఈ విషయాన్ని స్పష్టంగా కేఎఫ్ఎస్​లో కూడా పేర్కొనాలి. ఆ రికవరీ ఏజెంట్లు కూడా, సదరు కంపెనీ నిర్వహిస్తున్న రుణ వసూలు విభాగంలో పనిచేస్తూ ఉండాలి.

మీ వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన పనిలేదు!
రుణగ్రహీతలకు మీ వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వేళ మీ వివరాలు వారికి చెప్పినా, సదరు సంస్థ మీ అనుమతి లేకుండా వాటిని ఇతరులకు ఇవ్వడానికి వీలులేదు. కనుక మీ నుంచి సేకరించిన వివరాలను, సదరు సంస్థ ఏ విధంగా వినియోగిస్తుందన్న విషయాన్ని మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. రుణ యాప్​లు మీ సమాచారాన్ని సురక్షితంగా, భారతీయ సర్వర్లలో మాత్రమే భద్రపరచాలి. అంతేకాదు సమాచార భద్రత విషయంలోనూ కఠినమైన నిబంధనలు పాటించాలి.

భారతదేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నేరుగా ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోనే ఉంటాయి. కనుక, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఊరుపేరు తెలియని డిజిటల్‌ యాప్​లు ఈ నిబంధనలు అన్నీ పాటిస్తాయో, లేదో తెలియదు. అందుకే ఇలాంటి వాటి నుంచి లోన్స్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు కచ్చితంగా తనిఖీ చేసుకోవాలి. అప్పుడే మీరు సురక్షితంగా ఉంటారు.

అర్జెంట్​గా లోన్ కావాలా? మీ LIC పాలసీపై తక్కువ వడ్డీకే రుణం పొందండిలా!

యూపీఐ ద్వారా రాంగ్​ నంబర్​కు పేమెంట్ చేశారా? తిరిగి మనీ వెనక్కు తీసుకోండిలా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.