ETV Bharat / business

ఈ రాఖీ గిఫ్ట్‌లతో అక్కాచెల్లెళ్లకు 'రక్ష'గా నిలుద్దాం!

తమకు జీవితాంతం రక్షగా ఉండాలని ఆశిస్తూ అక్కాచెల్లెళ్లు.. సోదరులకు రక్షాబంధన్​ రోజు రాఖీలు కడతారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కేవలం భౌతిక రక్షనే కాకుండా ఆర్థికంగానూ వారికి భరోసా నివ్వాలి. అందుకే ఈ రాఖీ స్పెషల్​ గిఫ్ట్​లతో అక్కాచెల్లెళ్లకు 'రక్ష'గా నిలుద్దాం!

rakshabandhan-special-financial-gift-to-sisters

author img

By

Published : Aug 12, 2022, 7:16 AM IST

Raksha Bandhan Financial Gifts: అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ రక్షా బంధన్‌. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఈ రోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. మరి మారుతున్న కాలానికి అనుగుణంగా 'రక్షగా నిలవడం' అనే పదానికి విస్తృతి పెరిగిందనే చెప్పాలి. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, ఉద్యోగ భద్రతపై అనుమానాలు నెలకొన్న ఈ తరుణంలో కేవలం భౌతిక రక్షణే కాకుండా ఆర్థికంగానూ వారికి భరోసానివ్వాలి. అదే అక్కాచెల్లెళ్లకిచ్చే నిజమైన బహుమతి.

బీమాతో ధీమా ఇవ్వండి..
కేవలం అక్కాచెల్లెళ్ల ఆరోగ్యానికే కాదు.. వారి భవిష్యత్తుకూ భరోసా కల్పించాలి. అందుకు బీమా పాలసీ కొనిపెట్టడం ఓ మంచి మార్గం. వారికోసం టర్మ్‌ ఇన్సూరెన్స్‌తో పాటు ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవాలి. ఎంత తక్కువ వయసులో తీసుకుంటే వారికి అంత ప్రయోజనం. దీనివల్ల భవిష్యత్తులో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటుంది. మరోవైపు పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో వారికి మంచి బహుమతి ఇచ్చినవారమవుతాం.

ఓ మంచి ప్రణాళికను సిద్ధం చేయండి..
ఒకవేళ మీ అక్కాచెల్లెళ్లకు ఆర్థిక వ్యవహారాలపై పెద్దగా అవగాహన లేకపోతే.. వారికి ఓ నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి ఇవ్వండి. ఆమె భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేయండి. చదువు, ఉద్యోగం, మదుపు, పొదుపు, వివాహానంతర జీవితం.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని వారికి ఆర్థిక భరోసానిచ్చే చక్కటి ప్రణాళికను వారి చేతిలో పెట్టండి. అవసరమైతే.. ఆర్థిక నిపుణుల దగ్గరకు తీసుకెళ్లి వివరించే ప్రయత్నం చేయండి.

మదుపు సాధనాలను సూచించండి..
దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే మదుపు మార్గాలను మీ సోదరికి సూచించండి. చదువుకునే వయసులోనే వారికి ‘పాకెట్‌ మనీ’ని ఎలా పొదుపు చేయాలో చెప్పండి. చేసిన పొదుపును పోస్టాఫీసు ఖాతాల్లో మదుపు చేయించండి. వచ్చే రాబడి ఎలా ఉంటుందో వారికి వివరించండి. తక్కువ వయసులో ప్రారంభించి దీర్ఘకాలంలో దాన్ని కొనసాగించడం వల్ల ఉండే ప్రయోజనాల్ని సోదాహరణతో చెప్పండి. సుకన్య సమృద్ధి యోజన, సేవింగ్స్‌ ఖాతా.. వంటి ప్రాథమిక ఆర్థిక మదుపు సాధనాలను వారికి పరిచయం చేయండి. ఒకవేళ మీ అక్కాచెల్లెళ్లు పెద్దవారైతే.. మ్యూచువల్‌ ఫండ్స్‌, సిప్‌, స్టాక్‌ మార్కెట్‌, బాండ్స్‌ వంటి పెద్ద పెద్ద పెట్టుబడి మార్గాల్లో ఉండే ప్రయోజనాల్ని వివరించండి.

డిజిటల్‌ బంగారం బెటర్‌..
ఈ రాఖీ పండుగ సందర్భంగా కొంత మంది తమ సోదరీమణులకు బంగారాన్ని బహుమతిగా ఇస్తుంటారు. అయితే, భౌతిక బంగారం కంటే పసిడి బాండ్లను కొనివ్వడం మేలు. ఇప్పుడు అవి అందుబాటులో లేకపోయినప్పటికీ.. ఆ సొమ్మును పక్కకు తీసి ప్రభుత్వం వాటిని విక్రయించినప్పుడు కొని గిఫ్ట్‌గా ఇవ్వండి. దీనివల్ల బంగారంతో పాటు ఏటా కొంత రాబడిని కూడా అందించిన వారవుతారు. భద్రత కరవైన ఈ తరుణంలో డిజిటల్‌ రూపంలో గోల్డ్‌ కొనివ్వడం కూడా మంచి ఆలోచనే.

ఆర్థిక అక్షరాస్యత.. దేశానికీ భరోసా..
ఆర్థిక విషయాలపై పెద్దగా అవగాహన లేనట్లయితే.. ముందుగా వారిని ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం సోదరుల బాధ్యత! ఇప్పుడు యూట్యూబ్‌లో, యాప్‌లలో అనేక ప్రోగ్రామ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అందులో వారి పేర్లను నమోదు చేయండి. కోర్సులను పూర్తి చేసి అవగాహన పెంచుకునే అవకాశం కల్పించండి. డబ్బు కాంపౌండింగ్‌, మదుపు, స్థిరాస్తి.. వంటి అంశాలపై అవగాహన ఏర్పడేలా చూడండి. వివిధ పథకాల్లో వచ్చే రాబడి వెనుకున్న సూత్రాల్ని వివరించి చెప్పండి. పెళ్లైన తర్వాత ఇంటి ఖర్చులను ఎలా నిర్వహించాలో తెలియజెప్పండి. ఒకవేళ ఇంట్లో ఆడవాళ్లే గనక ఆర్థిక సాధికారిత సాధిస్తే.. అది ఆ కుటుంబం మొత్తాన్ని సరైన దారిలో తీసుకెళ్తుంది. భవిష్యత్తు తరాలకూ గొప్ప జ్ఞానం అందుతుంది.

రక్షాబంధనే కాదు.. మరికొన్ని రోజుల్లో 75 వసంతాల భారత స్వాతంత్ర్య వేడుకలనూ ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఇప్పటికీ భారత్‌లో ఆర్థికపరమైన విషయాల్లో మహిళల పాత్ర తక్కువేనని అనేక నివేదికలు కుండబద్దలు కొడుతున్నాయి. మరి ఈ తరుణంలో మన అక్కాచెల్లెళ్లకు రక్షాబంధన్‌ సందర్భంగా ఆర్థిక సంబంధిత బహుమతి అందజేయడం వల్ల కేవలం వారి జీవితానికి భరోసా కల్పించడమే కాకుండా దేశ నిర్మాణంలోనూ వారికి భాగస్వామ్యమయ్యే అవకాశం కల్పించినవారమవుతాం..!

ఇవీ చదవండి: 10 రోజుల్లో రూ.12 వేల కోట్ల పెట్టుబడులు.. మార్కెట్లలో సరికొత్త జోష్​

ఖర్చులు తగ్గించుకోవాలా? '30 డేస్ రూల్​' ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.