ETV Bharat / business

దంపతుల కోసం బెస్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్​ - ఏకంగా రూ.5.55 లక్షల వడ్డీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 7:13 PM IST

Post Office Monthly Income Scheme In Telugu : మీ పెట్టుబడులు ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితంగా ఉండాలా? మంచి రాబడి కూడా రావాలా? అయితే ఇది మీ కోసమే. పోస్టల్ డిపార్ట్​మెంట్​ చిన్న మొత్తాల పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. వీటిలో అధిక వడ్డీ రేటు కూడా ఉంటుంది. భార్యాభర్తలు జాయింట్​ అకౌంట్ ఓపెన్​ చేస్తే, మరిన్ని అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. పూర్తి వివరాలు మీ కోసం.

Post Office Small Savings Schemes
Post Office Monthly Income Scheme benefits

Post Office Monthly Income Scheme : రిస్క్ లేని పెట్టుబడి మార్గం వెతికే వారికి పోస్ట్​ ఆఫీస్ అందించే​ చిన్న మొత్తాల పొదుపు పథకాలు మంచి భరోసానిస్తున్నాయి. ఈ పోస్టల్​ పథకాలకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుంది. కనుక మన డబ్బు నష్టపోతామనే ఆందోళన ఉండదు. ప్రస్తుత కాలంలో పెరిగిన ఖర్చులతో పొదుపు చేయడం గగనమైపోతోంది. అందుకే పోస్టల్ డిపార్ట్​మెంట్​ చిన్నమొత్తాల పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో పోస్ట్​ ఆఫీస్​ మంత్లీ ఇన్​కం స్కీమ్ ఒకటి. విశ్రాంత జీవితంలో నెలవారీ ఖర్చుల కోసం ఈ పోస్టల్ సేవింగ్​ స్కీమ్​​ మంచిగా ఉపయోగపడతుంది. అంతేకాదు ఈ పోస్టల్​ పథకంలో భార్యభర్తలు ఇద్దరూ ఉమ్మడి ఖాతాను కూడా తెరిచి మంచి బెనిఫిట్స్ పొందవచ్చు. అందుకే ఈ ఆర్టికల్​లో మనం పోస్ట్​ ఆఫీస్​ మంత్లీ ఇన్​కం స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నెలవారీ ఆదాయం!
మీరు ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్​కమ్​ స్కీమ్​లో డిపాజిట్ చేయడం ద్వారా ప్రతినెలా రాబడిని పొందవచ్చు. ఈ పథకం కాలవ్యవధి ఐదేళ్లు. ఆసక్తి ఉన్న ఎవరైనా సింగిల్, జాయింట్ అకౌంట్లను తెరవొచ్చు. వాస్తవానికి ఈ అక్టోబర్ నుంచి ఈ స్కీమ్ వడ్డీ రేట్లు పెంచారు. ప్రస్తుతం ఈ స్కీమ్​ కింద 7.4 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నారు. అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి.

ఎంత డిపాజిట్ చేయవచ్చు?
చిన్నమొత్తాల పొదుపు అంటే గుర్తుకు వచ్చే పోస్టల్ పొదుపు పథకాల్లో గరిష్ట పెట్టుబడిపై రకరకాల అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలనే సందేహాలు వస్తుంటాయి. అయితే ఈ పోస్ట్​ ఆఫీస్​ మంత్లీ ఇన్​కమ్​ స్కీమ్​లో ఒక వ్యక్తి గరిష్ఠంగా రూ.9 లక్షలు వరకు డిపాజిట్ చేయవచ్చు. అదే జాయింట్ అకౌంట్ అయితే గరిష్ఠంగా రూ.15 లక్షలు వరకు మదుపు చేయవచ్చు.

జాయింట్ అకౌంట్​ బెనిఫిట్స్!
పోస్ట్​ ఆఫీస్ మంత్లీ ఇన్​కమ్​ స్కీమ్​లో సింగిల్ అకౌంట్​ ఓపెన్ చేయవచ్చు. లేదంటే ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఒక జాయింట్​ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ప్రతి జాయింట్ అకౌంట్ హోల్డర్ సమాన భాగాన్ని అందుకుంటారు. ఇక డిపాజిట్స్​ విత్ డ్రా విషయానికి వస్తే, మొదటి మూడేళ్లలోపు ఈ స్కీమ్ నుంచి మీరు విత్​డ్రా అయితే, మీరు డిపాజిట్ చేసిన అమౌంట్​ నుంచి 2 శాతాన్ని మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని అందిస్తారు. అదే మూడేళ్ల తర్వాత విత్ డ్రా చేసుకుంటే, మొత్తం డిపాజిట్ నుంచి 1 శాతాన్ని మినహాయించుకుని, మిగతా సొమ్మును మీకు చెల్లిస్తారు.

వార్షిక వడ్డీరేటు
ఉదాహరణకు మీరు ఈ పథకంలో రూ.5 లక్షలు మదుపు చేశారని అనుకుందాం. అప్పుడు మీరు వచ్చే ఐదేళ్లపాటు వార్షికంగా 7.4 శాతం వడ్డీ చొప్పున అందుకుంటారు. అంటే మీకు నెలవారీగా రూ.3,084 వడ్డీ అందుతుంది. ఈ లెక్కన మీకు 5 ఏళ్లలో రూ.1,85,000 వరకు వడ్డీ జమ అవుతుంది. అదే భార్యాభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే, మరింత ఎక్కువ లబ్ధి పొందవచ్చు. ఎలా అంటే? భార్యాభర్తలు ఇద్దరూ జాయింట్​ అకౌంట్​పై గరిష్ఠంగా రూ.15 లక్షలు పొదుపు చేస్తే, వార్షిక వడ్డీ రేటు 7.4 శాతం చొప్పున లెక్కవేస్తే, 5 ఏళ్ల తరువాత మీకు అక్షరాలా రూ.5,55,000 వడ్డీ లభిస్తుంది.

మారిన డిజిటల్ లోన్​ రూల్స్​తో రుణ యాప్​ల ఆగడాలకు చెక్​!

అత్యవసరంగా రుణం కావాలా? సిబిల్ స్కోర్​ లేకున్నా లోన్​​ పొందండిలా!

CNG కార్స్​పై భారీ డిస్కౌంట్స్​ - ఏ మోడల్​పై ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.