ETV Bharat / business

'పెట్రోల్‌ ధర.. శ్రీలంక, పాకిస్థాన్‌ కంటే భారత్‌లోనే ఎక్కువ' - price petrol

దేశంలో పెట్రోల్​ ధర రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. అంతర్జాతీయ మార్కెట్​లో క్రూడ్​ ఆయిల్​ ధర తక్కువగా ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్రాల పన్నుతో పెట్రోల్​ ధర విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్‌, జర్మనీ, బ్రిటన్‌ దేశాలతో పోలిస్తే మనదగ్గర పెట్రోల్‌ ధర తక్కువే అయినా చైనా, బ్రెజిల్‌, జపాన్, అమెరికా, రష్యా, పాకిస్థాన్‌, శ్రీలంక దేశాలకంటే అధికమని తాజా నివేదిక వెల్లడించింది.

pertol priace
pertol priace
author img

By

Published : May 18, 2022, 5:00 AM IST

Petrol Price: గతకొంత కాలంగా దేశంలో పెట్రోల్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్రాల పన్నులతో ఇవి విపరీతంగా పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్‌, జర్మనీ, బ్రిటన్‌ దేశాలతో పోలిస్తే మనదగ్గర పెట్రోల్‌ ధర తక్కువే అయినా చైనా, బ్రెజిల్‌, జపాన్, అమెరికా, రష్యా, పాకిస్థాన్‌, శ్రీలంక దేశాలకంటే అధికమని తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎకనామిక్స్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ ఈ వివరాలు వెల్లడించింది.

'ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 106 దేశాల సమాచారం ప్రకారం, భారత్‌లో పెట్రోల్‌ ధర లీటరుకు 1.35 డాలర్లు. ఈ క్రమంలో 42వ స్థానంలో నిలిచింది. అయితే, భారత్‌ కంటే మరో 50 దేశాల్లో పెట్రోల్‌ ధరలు అధికంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా లీటరు పెట్రోల్‌ ధర సరాసరి 1.22 డాలర్లుగా ఉంది' అని బీఓబీ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, టర్కీ, దక్షిణకొరియా దేశాలతో సమానంగా భారత్‌లో ఇంధన ధరలు ఉన్నాయి. హాంకాంగ్‌, ఫిన్లాండ్‌, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్‌, గ్రీస్‌, ఫ్రాన్స్‌, పోర్చుగల్‌, నార్వే దేశాల్లో మాత్రం ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ ధర 2 డాలర్లుగా ఉంది. ఇక తలసరి ఆదాయంతో పోల్చిచూస్తే.. వియత్నాం, కెన్యా, ఉక్రెయిన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, వెనిజువెలా కంటే భారత్‌లోనే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి.

పొరుగు దేశాల్లో చౌక.. దేశవ్యాప్తంగా పెట్రోల్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. దేశరాజధాని దిల్లీలో రూ.105.41 ఉండగా, డీజిల్‌ ధర రూ96.67గా ఉంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రూ.120కి చేరువైంది. అదే అంతర్జాతీయంగా చూస్తే అత్యధికంగా హాంకాంగ్‌లో లీటర్‌ పెట్రోల్ ధర 2.58డాలర్లుగా ఉండగా, మలేసియాలో అత్యంత చౌక. అక్కడ లీటరు పెట్రోల్‌ కేవలం 47 సెంట్లు మాత్రమే. జర్మనీలో లీటరుకు 2.29 డాలర్లు కాగా ఇటలీ 2.28, ఫ్రాన్స్‌ 2.07, ఇజ్రాయెల్‌ 1.96, యూకేలో, సింగపూర్‌లలో 1.87, న్యూజిలాండ్‌లో 1.75, ఆస్ట్రేలియాలో 1.36డాలర్లుగా ఉంది. ఇక భారత్‌, టర్కీ దేశాల్లో లీటరు పెట్రోల్‌ ధర 1.35 డాలర్లు. జపాన్‌లో మాత్రం 1.25, చైనాలో 1.21డాలర్లు కాగా అమెరికాలో లీటరు పెట్రోల్‌ ధర 98 సెంట్లుగా ఉంది. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌లో లీటరు పెట్రోల్‌ ధర 1.05 డాలర్లు, పాకిస్థాన్‌లో 77 సెంట్లు కాగా శ్రీలంకలో 67 సెంట్లుగా ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.

తలసరి ఆదాయంతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువ.. భారత్‌లో పెట్రోల్‌ ధరలు భారీగా కనిపించనప్పటికీ తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు మనదగ్గర పెట్రోల్‌ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. పెట్రోల్‌ ధరలు అధికంగా ఉన్న దేశాల్లో తలసరి ఆదాయం భారత్‌ కంటే చాలా ఎక్కువ. ఉదాహరణకు ఫిలిప్పైన్స్‌లో భారత్‌లో ఉన్న విధంగానే పెట్రోల్‌ ధరలు ఉన్నప్పటికీ అక్కడ తలసరి ఆదాయం మనకంటే 50శాతం అధికం. భారత్‌ కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న కెన్యా, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, వెనిజువెలాల్లో పెట్రోల్‌ ధరలు చాలా చౌకగా ఉన్నాయి. దీంతో మనకంటే అక్కడి వారిపై పెట్రోల్‌ ధరల ప్రభావం తక్కువే. ఇలా ఏవిధంగా చూసినా భారత్‌లో పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరగడం సామాన్యులపై ఆర్థిక భారంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలని తాజా నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇంధనంపై తక్కువ పన్నులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఓబీ నివేదిక అభిప్రాయపడింది.

ఇదీ చదవండి: క్యూ4లో ఎయిర్​టెల్​ జోరు- ఐఓసీకి తగ్గిన లాభం.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.